newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నిర్మలమ్మ బడ్జెట్ ఎలా ఉండబోతోంది?

01-02-202001-02-2020 09:05:25 IST
2020-02-01T03:35:25.964Z01-02-2020 2020-02-01T03:35:20.377Z - - 12-04-2021

నిర్మలమ్మ బడ్జెట్ ఎలా ఉండబోతోంది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో ఆర్థికమాంద్యం  పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండవసారి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిద్ధమయ్యారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.  2020 బడ్జెట్ వస్తోంది. మరి ఈ బడ్జెట్‌‌‌‌ అయినా దేశ ఆర్థిక వృద్ధిని పట్టాలెక్కిస్తుందా..? నిరుద్యోగానికి చెక్ పెడుతుందా..? కొనుగోళ్లను పెంచుతుందా? లేదా? చూడాల్సి ఉంది. దేశ వృద్ధి రేటును గాడిలో పెట్టడానికి ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనేక ఉద్దీపనలు, స్కీములు ప్రకటించారు. 

ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే, ఆర్థిక వృద్ధి పట్టాలెక్కించవచ్చని ఆర్థిక నిపుణులతో చర్చించి మరీ బడ్జెట్‌‌‌‌కు తుదిమెరుగులు దిద్దినట్టు తెలిసింది. దేశంలో నగదు కొరత బాగా వుంది. దీంతో అనేక రంగాలు తీవ్ర సంక్షోభానికి గురవుతున్నాయి.

బ్యాంక్‌‌లకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.70 వేల కోట్ల వరకు ఫండ్స్‌‌‌‌ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు గత కొన్ని నెలల నుంచి ప్రభుత్వం, బ్యాంకింగ్ రెగ్యులేటరీ వ్యవస్థ పనిచేస్తూ ఉన్నాయి.నాన్ బ్యాంకింగ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లోని అప్పులిచ్చే కంపెనీలను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు, ఈ బడ్జెట్‌‌‌‌లో పలు ప్రకటనలు చేస్తారని బ్యాంకింగ్ వర్గాలు చూస్తున్నాయి. ఐఎల్‌ అండ్ ఎఫ్‌ఎస్‌‌‌‌ గ్రూప్, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వంటి పెద్ద కంపెనీలు దివాలా తీయడంతో ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభం మొదలైంది. 

దేశంలో జీఎస్టీ వసూళ్ళు బాగా పడిపోయాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతోంది ప్రభుత్వం.  ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ఒకదేశం ఒక పన్ను జీఎస్టీ టార్గెట్‌‌‌‌ రూ.6.63 లక్షల కోట్లు కాగా.. ఏప్రిల్ నుంచి నవంబర్ కాలంలో రూ. 4.67 లక్షల కోట్లే ప్రభుత్వం కలెక్ట్ చేసింది.

కస్టమ్స్ సుంకాల టార్గెట్ రూ.1.55 లక్షల కోట్లుంటే, కలెక్షన్లు రూ.75,933 కోట్లే ఉన్నాయి. సెంట్రల్ ఎక్సైజ్‌‌‌‌ల టార్గెట్ రూ.3 లక్షల కోట్లైతే… వసూళ్లు రూ.1.33 లక్షల కోట్లే.. ఇలా అన్నింటిల్లో పన్ను వసూళ్లు తగ్గిపోయాయి. ఇండియాలో 136 కోట్ల మంది జనాభా ఉంటే… వారిలో 8.45 కోట్ల మందే ఇన్‌‌కంట్యాక్స్‌‌‌‌ చెల్లించేవారున్నారు. దేశంలో 20 ఏళ్లలో మొట్టమొదటిసారి డైరెక్ట్ ట్యాక్స్‌‌‌‌ కలెక్షన్లు తగ్గిపోతున్నాయి. దీనిపై న్యాయనిపుణులు ఆందోళన చెందుతున్నారు. 

దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. రెండు కోట్ల మంది ప్రజలకు ఉద్యోగాలు లేవని ఇటీవల రిపోర్ట్‌‌ల్లో తెలిసింది. దీంతో ఎంప్లాయిమెంట్‌ క్రియేట్ చేయడం ఈ బడ్జెట్‌‌లో చాలా కీలకంగా మారింది. నిరుద్యోగ రేటు పెరుగుతుండటం కూడా కొనుగోళ్లపై ప్రభావం చూపుతోందని తెలుస్తోంది.  ఈసారి బడ్జెట్‌పై చాలా అంచనాలున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో బడ్జెట్‌ ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle