నిర్భయ హంతకులకు ఇవాళే ఉరి ?
16-12-201916-12-2019 08:45:30 IST
2019-12-16T03:15:30.746Z16-12-2019 2019-12-16T03:15:25.696Z - - 12-04-2021

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన నిర్భయ కేసులో హంతకులు ఇప్పటికీ జైళ్ళోనే వున్నారు. ‘నిర్భయ’ ఘటన జరిగి నేటికి ఏడేండ్లు గడిచినప్పటికీ బాధితురాలికి ఇంకా న్యాయం జరుగలేదు. తెలంగాణలో దిశ నిందితులు ఎన్ కౌంటర్ లో చనిపోయాక నిర్భయ కేసు మళ్ళీ తెరమీదకు వచ్చింది. నిర్భయ కేసులోని నలుగురు నిందితులకు ఉరి శిక్ష అమలు చేయబోతున్నారు.
‘నిర్భయ’ కేసులో నలుగురు దోషులకు త్వరలో ఉరిశిక్ష అమలుచేయవచ్చని జోరుగా వార్తలు వెలువడుతుండటంతో ఇకనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని నిర్భయ తల్లి అన్నారు. దోషులకు డెత్ వారెంట్ జారీచేసి ఉరిశిక్ష తేదీని ఖరారుచేసే వరకు ఇలాంటి వార్తలను నమ్మలేమని ఆమె అన్నారు.
సోమవారం వారిని ఉరి తీయడానికి తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేరస్తులకు మరణ శిక్ష విధించాలంటే ‘బ్లాక్ వారెంట్’ తప్పనిసరి. కోర్టు బ్లాక్ వారెంట్ జారీచేయనుందని సమాచారం. ఇప్పటికే ఈ నిందితుల్లో ఒకరు రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరగా.. మరొకరు కోర్టు తీర్పును పునః పరిశీలించాలంటూ సుప్రీంలో రివ్యూ పిటీషన్ దాఖలు చేశాడు.
బ్లాక్ వారెంట్ జారీ అయితే ఉరి ఎప్పుడు తీస్తారనేది స్పష్టం అవుతుంది. బ్లాక్ వారెంట్ ఒక్కసారి వచ్చిన తర్వాత దోషి ఇక పని చేయడు. రోజంతా దోషులను జైలు అధికారులు పరిశీలిస్తారు రోజుకి రెండుసార్లు మెడికల్ చెకప్ కూడా చేస్తారు.
మరోవైపు బ్లాక్ వారెంట్లో ఏ నిందితుడిని ఉరి తీయాలనేది పూర్తిగా వివరించి ఉంటుంది. ఆయా నిందితులు చనిపోయే వరకూ నిందితుడి మెడకు ఉరి తాడు బిగించి ఉంచాలని బ్లాక్ వారెంట్లో ఉంటుంది.
నిర్భయ కేసులో శిక్షను అనుభవిస్తున్న దోషులను తన చేతులతో ఉరి తీసే అవకాశం ఇవ్వాలంటూ అంతర్జాతీయ షూటర్ వర్తిక సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరడం చర్చనీయాంశం అయింది. 'ఇది నా రక్తంతో రాస్తున్నా! నిర్భయ హత్య కేసు దోషులను నా చేతులతో ఉరి తీసే అవకాశం కల్పించండి. దీనిద్వారా దేశంలో ఒక మహిళ కూడా ఉరిశిక్షను అమలు చేయగలదనే సందేశాన్ని సమాజానికి చెప్పాలనుకుంటున్నా" అని వర్తిక సింగ్ లేఖలో పేర్కొన్నారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
8 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
11 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
14 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
4 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
15 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
12 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
15 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
15 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
9 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
18 hours ago
ఇంకా