newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నిర్భయ దోషుల ఉరికి ముహూర్తం.. అడ్వకేట్ ట్విస్ట్

19-03-202019-03-2020 17:13:46 IST
2020-03-19T11:43:46.567Z19-03-2020 2020-03-19T11:43:40.012Z - - 10-04-2021

నిర్భయ దోషుల ఉరికి ముహూర్తం.. అడ్వకేట్ ట్విస్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు నిర్భయ కేసులో నలుగురు దోషులకు రేపు ఉరిశిక్ష అమలు చేయడానికి జైలు అధికారులు రెడీ అయ్యారు. ఉరి శిక్షను రద్దు చేయాలంటూ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీలోని పాటియాలా కోర్టు కొట్టేసింది. దీంతో వారిని ఉరి తీయడం దాదాపుగా ఖాయమైందని అంటున్నారు. ఈనెల 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు తీహార్ జైల్లో నిర్భయ దోషులకు ఉరితీస్తారు. తమ ఉరిశిక్షను నిలిపివేయాలంటూ నిర్భయ దోషులు పెట్టుకున్న పిటిషన్‌ను పాటియాలా హౌస్ కోర్టు కొట్టివేసింది. దీంతో వారి ఉరితీతకు ఎలాంటి ఆటంకం ఉండబోదని నిర్భయ తరఫు న్యాయవాది సీమా కుష్వాహా అన్నారు. ‘రేపు ఉదయం 5.30 గంటలకు ఆ నలుగురికి ఉరిశిక్ష అమలవుతుందని విశ్వసిస్తున్నా.’ అని సీమా కుష్వాహా చెప్పారు.

మరోవైపు పాటియాలా హౌస్ కోర్టు ఎదుట నిందితుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ భార్య సొమ్మసిల్లిపడిపోయారు. తన భర్తను ఉరితీయవద్దంటూ ఆమె కోర్టు ఎదుట తన చెప్పులతో తాను కొట్టుకుంటూ ఏడ్చారు. అక్కడ ఉన్న మహిళా న్యాయవాదులు, కుటుంబసభ్యులు ఆమెను సముదాయించారు. అయినా ఆమె అక్కడినుంచి కదలలేదు. తన వెంట వఛ్చిన బంధువులు వారించినా ఆమె శాంతించలేదు. ఉరి శిక్షకు గురైన ఒక వ్యక్తికి భార్యగా ఉండదలచ లేదని, తనకు డైవోర్స్ ఇప్పించాలని ఆమె బీహార్ లోని స్థానిక కోర్టులో ఓ పిటిషన్ వేసింది. 

ఉరికి మరికొన్ని గంటలే ఉందనగా, దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ ట్విస్ట్ ఇచ్చారు. కొత్త ప్రతిపాదన తెరమీదకు తెచ్చారు. నలుగురు దోషులు దేశ సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిని భారత్ - పాకిస్తాన్ సరిహద్దులకు పంపాలని, లేకపోతే భారత్ - చైనా సరిహద్దు అయిన డోక్లాంకు పంపాలని సూచించారు. అంతేకానీ, వారిని ఉరి తీయవద్దని కోరారు. ఈ మేరకు తాను అఫిడవిట్ ఫైల్ చేయనున్నట్టు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు. ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పటికే ఉరి వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వుంది. జనవరి 22న, ఫిబ్రవరి 1న,  మార్చి 3, మార్చి 20న ఉరి తీయాలని కోర్టు మార్చి 5వ తేదీన డెత్ వారెంట్ జారిచేసింది. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   5 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   an hour ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   8 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   12 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle