newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నిర్భయ దోషి వినయ్ పిటిషన్ డిస్మిస్.. సోమవారం కీలక తీర్పు

14-02-202014-02-2020 17:52:27 IST
2020-02-14T12:22:27.145Z14-02-2020 2020-02-14T12:22:25.332Z - - 12-04-2021

నిర్భయ దోషి వినయ్ పిటిషన్ డిస్మిస్.. సోమవారం కీలక తీర్పు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిర్భయ కేసులో రోజుకో ట్విస్ట్. ఉరి శిక్ష ఎప్పుడు అమలవుతుందో తెలీని పరిస్థితి. దోషులు ఏదో విధంగా ఉరి శిక్ష అమలును వాయిదా వేసేందుకు చట్టంలో తమకున్న అవకాశాలను వాడుకుంటూనే వున్నారు. నిర్భయ హత్యాచారం కేసులో దోషిగా తేలిన వినయ్ శర్మ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం తిరస్కరించింది.

వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కొట్టేయడంతో వినయ్ సుప్రీంలో పిటిషన్‌ను దాఖలు చేశాడు. జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్‌భూషణ, జస్టిస్ బోపన్నతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. రాష్ట్రపతి నిర్ణయాన్ని న్యాయసమీక్ష చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. 

అయితే ఆయన మానసికంగా అనారోగ్యంగా ఉన్నాడన్న వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఆయన మెడికల్ రిపోర్టులను బట్టి అతడు ఆరోగ్యంగానే ఉన్నాడని ధర్మాసనం పేర్కొంది. దోషుల ఉరికి సంబంధించి వచ్చే సోమవారం కింది కోర్టు ఉత్తర్వులు ఇవ్వనున్నందున అప్పటి వరకు వేచి చూడాలని అపెక్స్‌ కోర్టు కేంద్రానికి స్పష్టం చేసింది.

వినయ్ శర్మ పిటిషన్ డిస్మిస్ కావడంతో దోషులకు సంబంధించి ఎటువంటి పిటిషన్‌లు కోర్టుల్లో పెండింగ్‌లో లేవు. దీంతో వీరి ఉరిశిక్షకు సంబంధించి సోమవారం ఎలాంటి ఉత్తర్వులు వస్తాయోనని నిర్భయ తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉరి అమలులో జాప్యంపై నిర్భయ తల్లి ఆశాదేవి కోర్టులోనే ఆవేదనకు గురయిన సంగతి తెలిసిందే. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle