newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నిర్ణయం స్పీకర్‌దే అన్న‘సుప్రీం’....పతనం అంచున కుమారస్వామి సర్కార్?

17-07-201917-07-2019 13:21:35 IST
Updated On 18-07-2019 11:30:27 ISTUpdated On 18-07-20192019-07-17T07:51:35.356Z17-07-2019 2019-07-17T07:51:33.153Z - 2019-07-18T06:00:27.007Z - 18-07-2019

నిర్ణయం స్పీకర్‌దే  అన్న‘సుప్రీం’....పతనం అంచున కుమారస్వామి సర్కార్?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎట్టకేలకు కర్ణాటక అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడం అనేది పూర్తిగా స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌కే వదిలేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ తీర్పు చెప్పారు.

రాజీనామాలపై కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించలేమని పేర్కొంది. అయితే రేపు బలపరీక్షకు హాజరుకావాలా వద్దా అన్నది మాత్రం ఎమ్మెల్యేల ఇష్టమని తెలిపింది.  విశ్వాసపరీక్షకు హాజరుకావాలని ఎమ్మెల్యేలను బలవంతం చేయలేమని కూడా స్పష్టం చేయడంతో కర్నాటక సంక్షోభం బాల్ స్పీకర్ కోర్టుకి చేరింది. 

తీర్పు అనంతరం అసంతృప్త ఎమ్మెల్యేల తరఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి మీడియాతో మాట్లాడారు. ‘కర్ణాటక అసెంబ్లీలో రేపు విశ్వాసపరీక్ష ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు రెండు కీలక విషయాలు వెల్లడించింది. ఒకటి రెబల్స్‌పై ఏ నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ స్పీకర్‌కు ఉంది. ఇక రెండోది సుప్రీంను ఆశ్రయించిన 15 మంది ఎమ్మెల్యేలు బలపరీక్షకు హాజరుకావాలా వద్ద అనేది వారి ఇష్టం. అసెంబ్లీకి రావాలని ఎమ్మెల్యేలను బలవంతం చెయ్యలేమని చెప్పింది.

సుప్రీం తీర్పు నేపథ్యంలో రెబల్స్‌ ఎమ్మెల్యేలపై సంకీర్ణ ప్రభుత్వం జారీ చేసిన మూడు లైన్ల విప్‌ పనిచేయదు’ అన్నారు. మరోవైపు సర్వోన్నత న్యాయస్థానం తీర్పుని కర్ణాటక స్పీకర్‌ రమేశ్ కుమార్‌ స్వాగతించారు. రాజీనామాలపై ఆలస్యం చేయబోనని, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానన్నారు రమేష్ కుమార్.

సుప్రీం తీర్పుపై బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప హర్షం వ్యక్తం చేశారు. గురువారం కుమారస్వామి విశ్వాసపరీక్షలో నెగ్గలేరన్నారు.  ప్రభుత్వం కూలడం ఖాయం. సంకీర్ణ సర్కార్‌కి రేపే ఆఖరి తేదీ అంటున్నారు. తాజా సుప్రీం తీర్పు వచ్చినా కర్ణాటక రాజకీయ సంక్షోభం కొనసాగేలా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలను బలవంతం చేయలేమని న్యాయస్థానం చెప్పడంతో ఎమ్మెల్యేలు స్వంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సుప్రీంకోర్టుకు వెళ్లిన ఈ 15 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే సభ్యుల సంఖ్య 209కి తగ్గడం,టు జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంఖ్యా బలం 101కి పడిపోతుంది. ఈ నేపథ్యంలో విశ్వాస పరీక్షలో కుమారస్వామి ప్రభుత్వం పడిపోవడం ఖాయం అంటున్నారు రాజ్యాంగ నిపుణులు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle