నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. వన్ నేషన్ వన్ ఎగ్జామ్
20-08-202020-08-2020 11:14:14 IST
Updated On 20-08-2020 14:58:14 ISTUpdated On 20-08-20202020-08-20T05:44:14.099Z20-08-2020 2020-08-20T05:44:11.370Z - 2020-08-20T09:28:14.915Z - 20-08-2020

దేశంలో ఏకీకృత విధానం వైపు అడుగులు పడుతున్నాయి. నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంక్ ఉద్యోగాలన్నింటికీ ఓకే పరీక్ష రాస్తే చాలు. పరీక్షల కోసం, ఫీజుల కోసం బాగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ పరీక్షలో వచ్చిన స్కోరు కార్డును మూడేళ్ల పాటు ఉద్యోగాల కోసం వాడుకోవచ్చు. ఈ దిశగా సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించేందుకు ‘జాతీయ రిక్రూట్మెంట్ ఏజెన్సీఏర్పాటుకు కేంద్ర కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. దీంతో నిరుద్యోగులకు భారీ ఊరట లభించనుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో నాన్-గెజిటెడ్ పోస్టులు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో వివిధ రకాల పోస్టులకు సంబంధించి ఎన్ఆర్ఏ కామన్ ఎలిజిబిటిటీ టెస్ట్ నిర్వహిస్తుంది. వివిధ ఉద్యోగ నియామకాల్లో ఈ పరీక్షలో వచ్చిన మార్కులనే ప్రాతిపదికగా తీసుకుంటారు. ఈ స్కోరు కార్డుకు మూడేళ్ల పాటు వాలిడిటీ ఉంటుంది. ఈలోగా జాబ్ రాకపోతే అభ్యర్థులు మళ్లీ పరీక్ష రాసుకోవచ్చు. దేశంలో ఏటా ప్రభుత్వ రంగ సంస్థల్లో సుమారు 1.25 ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు విడివిడిగా విడుదల అవుతున్నాయి. వీటి కోసం ఏటా సుమారు 2.5 కోట్ల మంది పోటీ పడుతున్నారు. వీరంతా ఆయా బోర్డులు నిర్వహించే పరీక్షలు రాస్తున్నారు. ఫీజులు చెల్లిస్తున్నారు. కొత్త విధానం ద్వారా ఇకపై ఇలాంటి వారంతా ఒకే ఎగ్జామ్ రాసి ఈ ఉద్యోగాలన్నింటికీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కలుగుతుందని కేంద్రం తెలిపింది. ఆన్లైన్ ద్వారా పరీక్ష కామన్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించి రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కావాలంటే ఆ మెరిట్ జాబితాను ఉపయోగించుకొని వివిధ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసుకునే విధంగా విధానాన్ని రూపొందిస్తున్నారు.ప్రభుత్వ రంగానికి చెందిన వివిధ ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థులు వివిధ పరీక్షలు రాస్తున్నారు. ఇకపై ఒకటే కామన్ పరీక్ష రాస్తే సరిపోతుంది. *కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు జాతీయ నియామక సంస్థ ద్వారా ఒకటే పరీక్ష నిర్వహించనుంది. *కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఒకటే పరీక్ష ద్వారా భర్తీ అవుతాయి. మూడేళ్ళపాటు అభ్యర్ధులు ఆయా ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. పదేపదే పరీక్షలకు ఫీజులు చెల్లించడం అవసరంలేదు. *ఉద్యోగాలకోసం నిరుద్యోగులు వత్లిడికి గురికాకుండా చేపట్టిన సంస్కరణలు విప్లవాత్మక మార్పులకు అంకురార్పణ జరిగింది. కేంద్రం చేపట్టిన సంస్కరణల ద్వారా ఉద్యోగార్ధులపైనే కాదు, ఎన్ఆర్ఏ ద్వారా వత్తిడి తగ్గుతుంది. *ఒకే పరీక్ష నిర్వహిస్తే అభ్యర్థులకు డబ్బుతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. తొందరగా కెరీర్లో కుదురుకోవడానికి అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా నిరుద్యోగులపై ఒత్తిడి తగ్గుతుంది. ✧ మెరిట్ లిస్ట్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండటం వల్ల అటు ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులకు కూడా నియామక ప్రక్రియ సులభమవుతుంది. ఖాళీలు ఏర్పడగానే మెరిట్ జాబితా నుంచి కొంత మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వూలు నిర్వహించి ఎంపిక ప్రక్రియ పూర్తి చేసే వెసులుబాటు ఉంది. ✧ వివిధ ఉద్యోగాల్లో ఖాళీలను వేగంగా పూర్తి చేయడానికి ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. * ఎన్ఆర్ఏ ఏర్పాటు గురించి ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రసంగంలోనే ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ కలిపి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఎర్రకోట వేదికగా ఒన్ నేషన్-ఒన్ హెల్త్ కార్డుపై ప్రధాని కీలక ప్రకటన!

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
12 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
9 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
11 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
16 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
18 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
19 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా