newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నిత్యానందకు చుక్కలు కనిపించనున్నాయా?

23-01-202023-01-2020 09:52:19 IST
Updated On 23-01-2020 09:57:43 ISTUpdated On 23-01-20202020-01-23T04:22:19.874Z23-01-2020 2020-01-23T04:19:09.414Z - 2020-01-23T04:27:43.960Z - 23-01-2020

నిత్యానందకు చుక్కలు కనిపించనున్నాయా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వివాదాస్పద ఆధ్మాతిక‌వేత్త నిత్యానందపై ఇంటర్‌పోల్ బ్లూకార్నర్‌ నోటీసులు జారీ చేయడంతో ఆయన చిక్కుల్లో పడ్డట్టేనని అంతా భావిస్తున్నారు. గతంలో ఆహ్మదాబాద్‌లోని ఆశ్రమం నుంచి ఇద్దరు అమ్మాయిలు ఆదృశ్యమైన కేసులో నిత్యానందపై ఎఫ్ఐఆర్ న‌మోదు అయిన సంగతి తెలిసిందే. చిన్న పిల్లలను ఆశ్రమంలో బంధించి, లైంగికంగా వేధించిన‌ట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు నిత్యానంద. 

ఈ ఆరోపణలు, కేసుల నేపథ్యంలో గ‌త ఏడాది నిత్యానంత కనిపించకుండా పోయాడు. ఆయన విదేశాల‌కు పారిపోయినట్టు తర్వాత వెల్లడైంది. గుజ‌రాత్‌, క‌ర్ణాట‌క పోలీసుల వాంటెడ్ లిస్టులో వున్న నిత్యానందపై విడుదలైన వీడియో సంచలనం రేపింది. ఈక్వెడార్‌లో కైలాసం అనే దేశాన్ని నిర్మించ‌నున్నట్లు నిత్యానంద చెప్పారు. అక్కడికి వెళ్లడానికి వీసా, ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించడంతో అంతా అవాక్కయ్యారు.

 గుజరాత్ పోలీసుల విజ్ఞప్తితో… నిత్యానంద ఆచూకీ ఉంటే తెలపాల‌ని ఇంట‌ర్‌పోల్ బ్లూకార్నర్‌ నోటీసులు జారీ చేసింది.. నిత్యానంద వీడియోపై ఈక్వెడార్ కూడా స్పందించింది. నిత్యానంద ఈక్వెడార్‌లో లేర‌ని ఆ దేశం ఎంబసీ స్పష్టం చేసింది.  ఓ దీవిని కొని, దానికి కైలాసం అని నిత్యానంద‌ పేరుపెట్టిన అంశాన్ని ఈక్వెడార్ కొట్టిపారేసింది. నిత్యానంద ఈక్వెడార్‌ను వదిలి హైతీకి పారిపోయాడంటోంది. 

ఈక్వెడార్ విడిచి పారిపోయిన స్వామీజీ ట్రినిడాడ్ లో వున్నట్టు సమాచారం అందుతోంది. గుజరాత్ లోని నిత్యానంద ఆశ్రమంలో అక్రమాలు వెలుగుచూడడంతో నిత్యానందను వెతికే పనిలో పడ్డారు పోలీసులు. ఇంటర్ పోల్ కూడా రంగంలోకి దిగడంతో నిత్యానంద ఆటలు ఇక సాగవంటున్నారు పోలీసులు. నిత్యానందపై నకిలీ పాస్ పోర్టు కేసు కూడా వుంది. 2018 నుంచి ఆయన పాస్ పోర్టు రెన్యువల్ కాకపోవడంతో ఈ కేసు కూడా మెడకు చుట్టుకోనుంది. ఇంతకీ నిత్యానంద ఎక్కడున్నాడు? 

న్యూస్ స్టింగ్ కోసం నిత్యానందపై ప్రముఖ కార్టూనిస్టు సతీష్ ఆచార్య వేసిన కార్టూన్... 

Swamy Nithyananda's Kailaasa nation

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   12 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   12 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   17 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   18 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   13 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   20 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   21 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   13 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   15 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle