నితీష్-బీజేపీ మైత్రిపై పీకే ఘాటు వ్యాఖ్యలు
19-02-202019-02-2020 09:24:13 IST
2020-02-19T03:54:13.315Z19-02-2020 2020-02-19T03:53:20.098Z - - 11-04-2021

ప్రశాంత్ కిషోర్. దేశవ్యాప్తంగా ఈయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడానికి పీకే వ్యూహాలు కారణం అని అందరికీ తెలుసు. ఇప్పుడీయన ఫోకస్ అంతా పశ్చిమబెంగాల్ పైనే వుంది. తాజాగా పీకే చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గాంధీ భావజాలాన్ని సమర్థిస్తారో, గాంధీని చంపిన గాడ్సేని సమర్థిస్తున్నవారితో చేతులు కలుపుతారో తేల్చుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కిషోర్. నితీశ్ ప్రభుత్వ అభివృద్ధి నమూనాపై పీకే ప్రశ్నల వర్షం కురిపించారు. నితీశ్ ప్రభుత్వం తన పార్టీ సిద్ధాంతాలను పక్కనపెట్టి బీజేపీతో చేతులుకలపడాన్ని దుయ్యబట్టారు. పౌరసత్వ సవరణ చట్టంపై తన వ్యతిరేకతను స్పష్టంచేసిన ప్రశాంత్ కిశోర్, గాంధీ, జయప్రకాష్ నారాయణ్, రామ్మనోహర్ లోహియాల సిద్ధాంతాలనూ, ఆదర్శాలనూ ఎన్నటికీ వీడబోనని ఎప్పుడూ చెపుతూ ఉండే నితీశ్ నాథూరాం గాడ్సేని సమర్థించే వారితో ఎలా ఉండగలుగుతున్నారో చెప్పాలన్నారు. నిన్న మొన్నటివరకూ నితీష్ తో తిరిగిన ప్రశాంత్ కిషోర్ తన విమర్శలతో జేడీయూ నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. ఉత్తమ టాప్ 10 రాష్ట్రాల్లో బిహార్‌ను ఒకటిగా చేసేందుకే 20వ తేదీన ‘‘బాత్ బిహార్‌కీ’కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని పీకే ప్రకటించారు. రాష్ట్రంలో యువనాయకులను తయారుచేసే దిశగా కృషిచేస్తానని తెలిపారు. వంద రోజుల్లో కోటిమంది యువతను కలుస్తానని ప్రకటించారు. ప్రశాంత్ వ్యాఖ్యలపై జేడీయూ తీవ్రంగా స్పందించింది. నితీశ్‌ను విమర్శించే బదులు తన విలువైన సమయాన్ని ‘వ్యాపారం’కోసం ప్రశాంత్ కేటాయిస్తే మంచిదని పార్టీ నేత కేసీ త్యాగి సలహా ఇచ్చారు. ఈ ఏడాది చివరల్లో బీహార్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. నితీశ్ పాలనలోని లోపాలను ప్రచారం చేస్తానన్నారు. తాను బిహార్ కోసమే పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు. గతంలో నితీష్ తో కలిసి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఆయనకు శత్రువుగా మారడం చర్చకు దారితీస్తోంది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
16 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
12 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
14 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
19 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
21 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా