newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

నితీష్ ప్రచార వ్యయం తడిసిమోపెడు

15-05-201915-05-2019 07:47:16 IST
Updated On 28-06-2019 11:47:37 ISTUpdated On 28-06-20192019-05-15T02:17:16.740Z15-05-2019 2019-05-15T02:15:21.100Z - 2019-06-28T06:17:37.944Z - 28-06-2019

నితీష్ ప్రచార వ్యయం తడిసిమోపెడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ త‌న ప్ర‌భుత్వ ప‌థ‌కాల ప్ర‌చారానికి కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నార‌ట‌. కేవ‌లం ఈ ఐదేళ్ల కాలంలో ఆయ‌న మీడియాలో ప్ర‌చారానికి దాదాపు 498 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టిన‌ట్లు తేలింది. ఆ రాష్ట్రానికి చెందిన ఆర్టీఐ కార్య‌క‌ర్త నారాయ‌ణ గిరి, స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా ఈ వివ‌రాల‌ను తెల్సుకున్నారు. 

రెండోసారి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత, అంటే 2014-15 సంవత్స‌రంలో మీడియాలో ప్ర‌చారానికి నితీష్ ప్ర‌భుత్వం పెట్టిన ఖ‌ర్చు 83 కోట్ల 34 ల‌క్ష‌ల 28 వేల 851 రూపాయ‌ల‌ట‌. అలాగే 2015-16 సంవ‌త్స‌రంలో మీడియాలో ప్ర‌చారానికి వాడిన సొమ్ము 98 కోట్ల 42 ల‌క్ష‌ల 14 వేల 181 రూపాయ‌లుగా తేలింది. ఇక 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో నితీష్ కుమార్ మీడియాలో ప్ర‌చారానికి వాడిన మొత్తం 133 కోట్ల 53 ల‌క్ష‌ల 18 వేల 694 రూపాయ‌ల‌ట‌. 

ఈ ఐదేళ్ల‌లో ప‌త్రిక‌లు, టీవీ న్యూస్ చాన‌ళ్ల‌లో ప్ర‌క‌ట‌న‌ల‌కు ఈ మొత్తం వాడిన‌ట్లు తేలింది. 2005 నుంచి 2005 దాకా, అంటే లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ స‌తీమ‌ణి ర‌బ్రీదేవి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో మీడియాలో ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ ప్ర‌చారానికి చేసిన ఖ‌ర్చు కేవ‌లం 23 కోట్ల 48 ల‌క్ష‌లుగా తేలింది.

అయితే నితీష్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సీన్ మారిపోయింద‌ని జేడీయూ నేత‌లు చెబుతున్నారు. మ‌రి ఇంత‌గా ఖ‌ర్చు పెట్ట‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తే, ర‌బ్రీదేవి పాల‌న‌లో ఏ ఒక్క నూత‌న‌ ప‌థ‌కం ప్ర‌వేశ పెట్ట లేద‌నీ, ఉన్న ప‌థ‌కాలు కూడా స‌రిగ్గా అమ‌లు చేయ‌లేద‌ని చెబుతున్నార‌ట‌. 

మ‌రో విష‌యం ఏంటంటే, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను, ప‌నితీరును విమ‌ర్శించే ప‌త్రిక‌, టీవీ న్యూస్ చాన‌ళ్ల‌కు ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డం లేద‌ట‌. బీహార్ ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల కోసం ఓ ప్ర‌త్యేక విధానాన్ని నితీష్ కుమార్ తీసుకొచ్చార‌ట‌. ముఖ్యంగా స‌ర్క్యులేష‌న్ ఆధారంగా ప‌త్రిక‌లకు ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చే విధానాన్ని అమ‌లు చేస్తున్నారు నితీష్ కుమార్. హిందీ ప‌త్రిక‌ల‌కు అయితే క‌నీసం 40 వేల స‌ర్క్యులేష‌న్, ఇంగ్లీష్ ప‌త్రిల‌కు అయితే 25 వేల స‌ర్క్యులేష‌న్, ఉర్దూ ప‌త్రిక‌ల‌కు 20 వేల స‌ర్క్యులేషన్ ఉండాల‌ని నిర్ణ‌యించింది నితీష్‌ ప్ర‌భుత్వం. 

దాదాపు 45 వేల స‌ర్క్యులేషన్ ఉన్న ప్ర‌భాత్ క‌మ‌ల్ అనే హిందీ ప‌త్రికలో, త‌న ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వార్త‌లు రావ‌డంతో, ఆ ప‌త్రిక య‌జ‌మానిపై కేసులు పెట్టి జైల్లో పెట్టించారు.

అలాగే బీహార్ రూర‌ల్ ప్రాంతాల్లో క్రైం రేట్ పెరిగిందంటూ క‌థ‌నాలు రాసిన ఓ హిందీ ప‌త్రిక‌కు ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు ఆపేశారు. ఆ త‌ర్వాత మ‌ద్య నిషేధాన్ని పొగుడుతూ ఆ ప‌త్రిక వ‌రుస‌గా ప‌ది రోజుల పాటు క‌థ‌నాలు రాయ‌డంతో, మ‌ళ్లీ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చార‌ట‌. మ‌రో విష‌యం ఏంటంటే, క‌నీసం 500 స‌ర్క్యులేషన్ కూడా లేని హాల‌త్ ఏ బీహార్, న్యూస్ నెక్ట్స్ ఉర్దూ ప‌త్రిక‌ల‌కు ఏటా 30 లక్ష‌ల రూపాయ‌ల ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చిన‌ట్లు తేలింది. 

ఎందుకంటే ఈ రెండు ప‌త్రిక‌ల‌కు నితీష్ కుమార్ ని పొగ‌డ‌ట‌మే ప‌నిగా పెట్టుకున్నాయ‌ట‌. ఇదంతా చూస్తుంటే ఏపీలో సీఎం చంద్ర‌బాబు కొన్ని మీడియా సంస్థ‌ల‌కు ఏ ర‌కంగా మేలు కుదిర్చారు అన్న‌ది గుర్తుకొస్తుంద‌నేది చాలా మందికి అర్థం అవుతోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle