నితీష్‌పై కీలక వ్యాఖ్యలు.. ప్రశాంత్ కిషోర్ పై వేటు
30-01-202030-01-2020 09:20:02 IST
Updated On 30-01-2020 11:31:01 ISTUpdated On 30-01-20202020-01-30T03:50:02.517Z30-01-2020 2020-01-30T03:49:57.090Z - 2020-01-30T06:01:01.829Z - 30-01-2020

జేడీయూలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్నికల వ్యూహకర్త, పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పై వేటు పడింది. కీలకమయిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా రిజిస్టర్ విషయంలో పార్టీ వైఖరిని ఆయన ప్రశ్నిస్తునే వున్నారు. దీంతో జనతాదళ్(యూ) బహిష్కరణ వేటు వేసింది. సీఏఏ, ఎన్పీఆర్లను వ్యతిరేకిస్తున్న కిషోర్... ఈ విషయంలో పార్టీ వైఖరిని తప్పుబడుతున్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనను 'కరోనా వైరస్'తో పోల్చారు జేడీయూ నేత అజయ్ అలోక్. ఆయన ఆప్ తరఫున పనిచేస్తారు, రాహుల్ గాంధీతో మాట్లాడతారు, మమతా దీదీతో కూర్చుంటారు. ఆయనను నమ్మేదెవరు? ఈ కరోనా వైరస్ మమ్మల్ని వదిలిపోతే సంతోషిస్తాం. ఆయన ఎక్కడకు వెళ్లాలనుకుంటే అక్కడకు వెళ్లచ్చు అంటూ అలోక్ కామెంట్ చేశారు. ఈ కామెంట్లు రచ్చరేపాయి. తాజాగా పీకేపై వేటు వేయడం చర్చనీయాంశం అయింది. ప్రశాంత్ కిషోర్ తో పాటు పవన్ వర్మపై నితీష్ ఆగ్రహంతో వున్నారు. ఈ రెండింటికీ వ్యతిరేకంగా విపక్షాలు ఒక్కటవ్వాలని ప్రశాంత్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీనుంచి వారిద్దరినీ బహిష్కరిస్తున్నట్లు జేడీయూ తెలిపింది. ‘వారిద్దరూ సీఎంను అవమానించేలా మాట్లాడారు. పార్టీ క్రమశిక్షణను అతిక్రమించారు’ అని పార్టీ పేర్కొంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి, పార్టీ పదవుల నుంచి తక్షణమే అమల్లోకి వచ్చేలా ప్రశాంత్ కిషోర్, పవన్ వర్మలను బహిష్కరిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదిలా వుంటే తనపై వేటు పడినా ప్రశాంత్ మాత్రం నితీష్ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నానన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించడం వల్లే ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలో చేర్చుకున్నానని మంగళవారం నితీశ్ చెప్పటంతో ఇద్దరి మధ్యా విభేదాలు తీవ్రమయ్యాయి. నితీష్ పై తీవ్రంగా మండిపడ్డ ప్రశాంత్ కిషోర్ అబద్దాలు చెబుతున్నారని, మీరు చెప్పిందే నిజమైతే అమిత్ షా సిఫారసులున్న నన్ను తొలగించే ధైర్యం మీకుంటుందా? దాన్ని ఎవరైనా నమ్ముతారా?’’ అని ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఆప్ సలహాదారుగా, ఎన్నికల వ్యూహకర్తగా వున్నారు. మరోసారి కేజ్రీవాల్ ను సీఎంని చేస్తానని ఇంతకుముందే ప్రకటించారు. తాజాగా ఆయన తృణమూల్‌లో చేరతారనే ప్రచారం సాగుతోంది. తృణమూల్ వర్గాలు మాత్రం దీనిపై స్పందించడం లేదు. భవిష్యత్తులో ఆ అవకాశం లేకపోలేదంటూ... ఆ విషయాన్ని ప్రశాంత్ కిషోర్ లేదా తమ అధినేత్రి మమత బెనర్జీనే ధ్రువీకరించాలని టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీ అన్నారు. బెంగాల్లో 2021 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రశాంత్ సేవలను ఉపయోగించుకోవాలని టీఎంసీ భావిస్తోంది.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
9 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
12 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
15 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
6 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
16 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
13 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
16 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
16 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
10 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
19 hours ago
ఇంకా