newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నిందలూ, ఆరోపణలతో మహా సర్కార్ పబ్బం..!

22-09-202022-09-2020 08:32:16 IST
2020-09-22T03:02:16.845Z22-09-2020 2020-09-22T03:02:14.253Z - - 19-04-2021

నిందలూ, ఆరోపణలతో మహా సర్కార్ పబ్బం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

దశాబ్దాల పాటు బీజేపీ మిత్రపక్షంగా కొనసాగిని శివసేన...మహారాష్ట్రలో అధికారం కోసం భావసారూప్యత ఇసుమంతైనా లేని పార్టీలతో జతకట్టింది. జతకట్టి మహా ఘట బంధన్ పేరుతో సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నది. అయితే శివసేన అధికారంలోనికి వచ్చిన క్షణం నుంచీ వరుస వైఫల్యాలతో ప్రతిష్ట దిగజార్చుకుంది. ఆధిపత్య ధోరణి, ప్రత్యర్థి పార్టీలపై నియంత్రణ లేని నిందారోపణలతో వివాదాలను కొని తెచ్చుకుంటున్నది. బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య అంశంలో మహా సర్కార్ తీరు గానీ, నటి కంగనా ఆరోపణలపై స్పందించిన తీరులో గానీ శివసేన వైఖరి ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింప చేసేదిగా లేదు.

కరోనాను కాదు కంగనాను నియంత్రించడమే ప్రథమ లక్ష్యం అన్నట్లుగా శివసేన తీరు ఉంది. కంగనా కార్యాలయాన్ని కూల్చే విషయంలో బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు చూపిన అత్యుత్సాహం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగా ఉందే తప్ప, నిబంధనలకు వ్యతిరేకంగా కట్టడం ఉండటం వల్లనే కూల్చివేత జరిగిందని అనిపించేదిగా లేదు. అన్ని వైపుల నుంచీ విమర్శలు వెల్లువెత్తుతుంటే ఇప్పుడు శివసేన అధికారిక పత్రిక సామ్నా వేదికగా తమ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందంటూ మహా సర్కార్ ఆరోపణల పర్వానికి తెరతీసింది. 

ఇందుకు ప్రభుత్వ అధికారులే ఈ కుట్ర సూత్రధారులు అంటూ శివసేన చేసిన ఆరోపణలు...ఆ పార్టీ రాజకీయ ఆశక్తతకు అద్దం పడుతున్నాయి. అధికారులు బీజేపీతో కుమ్మక్కై మహా సంకీర్ణ సర్కార్ ను కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారనడమే కాక...అలా ప్రయత్నిస్తున్న అధికారులలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీసు అధికారులు కూడా ఉన్నారనడం...తమ ప్రభుత్వ వైఫల్యాల నుంచి జనం దృష్టి మరల్చానికే తప్ప మరొకందుకు కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  శివసేన సర్కార్ కొలువు దీరడానికి ముందు ఎన్సీపీ నేత అజిత్‌పవార్‌ బీజేపీ గూటికి చేరి హడావుడిగా ప్రమాణస్వీకారం చేసిన ఉదతాన్ని ఉదాహరణగా శివసేన చూపింది.

ప్రభుత్వంలోని కొందరు అధికారులు ఇఫ్పటికీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఫడ్నవీస్ సర్కారేనన్న భ్రమలో ఉన్నారని చెప్పడం ద్వారా రాష్ట్రంలో అధికారుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా వారు స్వేచ్ఛగా, స్వతంత్రంగా పని చేసే వాతావరణం లేకుండా చేసింది. ఇటువంటి ఆరోపణలు, విమర్శల వల్ల రాజకీయంగా శివసేనకు నష్టమే తప్ప వీసమెత్తు ప్రయోజనం ఉంటుందని భావించలేం.

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   an hour ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   an hour ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   5 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   7 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   2 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   9 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   9 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   2 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   3 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   10 hours ago


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle