newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నా బిడ్డను ఎందుకు ఓడించారు... పుత్రప్రేమతో విలపించిన కుమారస్వామి

28-11-201928-11-2019 16:14:26 IST
2019-11-28T10:44:26.689Z28-11-2019 2019-11-28T10:44:22.964Z - - 12-04-2021

నా బిడ్డను ఎందుకు ఓడించారు... పుత్రప్రేమతో విలపించిన కుమారస్వామి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి పుత్రప్రేమతో బహిరంగంగా విలపించారు. మాండ్య ప్రజలను నమ్మి తన కుమారుడిని గత ఎన్నికల్లో నిలబెడితే వాడిని ఓడించి నన్ను గాయపర్చారంటూ కుమారస్వామి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ రాష్ట్రానికి, ప్రత్యేకించి మాండ్య నియోజకవర్గానికి నేను ఏం తప్పు చేశానని నాకీ శిక్ష విధించారు అంటూ కుమారస్వామి అందరిముందు కన్నీళ్లు పెట్టి మరీ ఏడ్చారు.

డిసెంబర్ 5న జరగనున్న ఉపఎన్నికల సందర్భంగా మాండ్య జిల్లాలోని కెఆర్ పేటలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన కుమారస్వామి గత ఎన్నికల్లో ఎంపీ నియోజకవర్గంలో తన కుమారుడు ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన విషయం తల్చుకుని మరీ విలపించారు. ఆ ఎన్నికల్లో నిఖిల్ కుమారస్వామి స్వతంత్ర అభ్యర్థి సుమలత అంబరీష్‌పై పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. 

బహిరంగ సభల్లో భావోద్వేగానికి గురి కావడం కుమారస్వామికి పరిపాటిగా మారింది. ఇప్పుడూ అదే పునరావృతమైంది. మాండ్య ప్రజలరా, మిమ్మల్ని నేను ఎంతో అభిమానించాను. కానీ మీరు నా హృదయాన్ని గాయపర్చారు. వాస్తవానికి నేను నా కుమారుడిని ఎన్నికల్లో పోటీ చేయించడానికి సిద్ధం కాలేదు. కానీ మీరే బలవంతం చేసి వాడిని పోటీలో నిలిచేలా చేశారు. అదే నన్ను బాధిస్తోంది. అధికారం కోల్పోయినందుకు నేను బాధపడలేదు. కానీ నా బాధను వ్యక్తపర్చడానికే ఇలా చేయాల్సి వస్తోందంటూ కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.

కర్ణాటకలోనే అత్యంత అసమర్థుడైన పాలకుడినని, పదవి నిలబెట్టుకోవడానికే సమయమంతా వెచ్చించేవాడినని  తనపై అధికార పక్షం బేజీపీ, తదితరులు చేస్తున్న ప్రచారాన్ని కుమారస్వామి ఖండించారు. ప్రజల ఆదరాభిమానాలను తాను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తానని, ముఖ్యమంత్రి పదవి తనకు గడ్డిపోచతో సమానమని కుమారస్వామి చెప్పారు. మీ ప్రేమ, అభిమానం ఉంటే తనకు అదే చాలని, మరేమీ అక్కర్లేదని తెలిపారు.

గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కాస్త ముందుగా కుమారస్వామి బెంగళూరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ నేను బతికి ఉండాలంటే నన్ను ఈసారి ఎన్నికల్లో గెలిపించండి అంటూ భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. గెలిచాక కొన్ని నెలల్లోనే ముఖ్యమంత్రి పదవి ఎంత కఠినమైనదో అనుభవమై కుమారస్వామి మళ్లీ ప్రజల ముందు ఏడ్చేశారు. మీరు పూలదండలతో నన్ను అభినందించడానికి వస్తున్నారు. మీలో ఒక సోదరుడు ముఖ్యమంత్రి అయినందుకు ఎంతో సంతోషిస్తున్నారు. కాని నేను సంతోషంగా లేను. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడంలో బాధను నేను అనుభవిస్తున్నాను అంటూ కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle