newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నా ఆదేశాలు పాటించకపోతే సినిమాలకే అంకితం.. బాంబు పేల్చిన రజనీకాంత్

10-03-202010-03-2020 16:24:58 IST
Updated On 10-03-2020 16:29:01 ISTUpdated On 10-03-20202020-03-10T10:54:58.744Z10-03-2020 2020-03-10T10:54:54.617Z - 2020-03-10T10:59:01.158Z - 10-03-2020

నా ఆదేశాలు పాటించకపోతే సినిమాలకే అంకితం.. బాంబు పేల్చిన రజనీకాంత్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
డబ్బు సంపాదన, పదవులపై ఆరాటం, కుమ్ములాటలు వంటి అవలక్షణాలు తన అభిమానుల్లోనూ ఏర్పడితే ఆ తరహా రాజకీయాలకు మంగళంపాడి సినిమాలకే అంకితం అయిపోతానని కొలివుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ బాంబు పేల్చారు. తనతో కలిసి రాజకీయాల్లోకి వచ్చేవారెవరికీ డబ్బు సంపాదించాలన్న ఆలోచన ఉండకూడదు.. ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న వారందరికీ పదవులు లభించకపోయినా బాధ పడకూడదు.. ఈ నిబంధనలను అందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తేనే పార్టీని ప్రారంభిద్దాం.. ఎవరికైనా ఇందుకు అభ్యంతరం ఉంటే సమస్యలేదు.. తనకు రాజకీయాలు సరిపడవు, సినిమాలే చాలు అని ఒక వారంలో ప్రకటిస్తానను అని రజనీకాంత్‌ తన ప్రజాసంఘం జిల్లా కార్యదర్శులతో భేటీ సందర్భంగా హెచ్చరించారు.

తమిళనాడులోని రజనీ ప్రజాసంఘం జిల్లా కార్యదర్శులతో స్థానిక కోడంబాక్కంలోని శ్రీరాఘవేంద్ర కల్యాణ మంటపంలో రజనీకాంత్‌ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రజనీకాంత్‌ రాజకీయ పార్టీ గురించి ప్రకటన చేస్తారని ఆసక్తిగా ఎదురు చూశారు. తీరా భేటీ అనంతరం తాను ఒక్క విషయంలో మోసపోయానని, అదేమిటన్నది త్వరలోనే చెబుతానని మీడియాతో చెప్పారు. రజనీ పార్టీ సంగతేమోగానీ, ఆయన ఏ విషయంలో మోసపోయారన్న ఆసక్తి ఇప్పుడు సర్వత్రా నెలకొంది. 

రజనీకాంత్‌ మోసపోయానన్న వ్యాఖ్యలకు కారణాలు ఇప్పుడు వెలుగు చూశాయి. రజనీకాంత్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఒక ప్రముఖుడు ఆ విషయాలను బయటపెట్టారు. సమావేశంలో పాల్గొన్న రజనీ ప్రజా సంఘం జిల్లా కార్యదర్శులు బీజేపీ పార్టీ గురించి, కమలహాసన్‌ పార్టీ మక్కళ్‌కట్చితో పొత్తు గురించి చర్చించుకున్నారు. నటుడు రజనీకాంత్‌ వారి పని తీరుపై ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందిని సభ్యులుగా చేర్చమని చెప్పాననీ, అది ఇంత వరకూ జరగలేదని అన్నారు.

నా అదేశాన్ని పాటించడంలో ఎందుకింత అలసత్వం అని ప్రశ్నించారు. బూత్‌కమిటీలకు ఇంకా సభ్యులను నిర్వహించలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. నేను చెబితేనే కొన్ని పనులు చేస్తున్నారని అన్నారు. మీలో మీరు ఎందుకు గొడవ పడుతున్నారు అలా గొడవలు పడడం ఇకపై మానుకోవాలి. లేకుంటే అలాంటి వారిని దయా దాక్షిణ్యలు చూపకుండా తొలగిస్తాను అని హెచ్చరించారు. నేను బీజేపీ మద్దతుదారుడిని కాదనీ, అదే విధంగా కమలహాసన్‌ పార్టీ మక్కళ్‌ కట్చితో పొత్తుపై మీ అభిప్రాయం ఏంటనీ రజనీకాంత్‌ అనడంతో అక్కడ ఉన్నవారంతా షాకయ్యారని ఆ వ్యక్తి చెప్పారు. 

నేను ముఖ్యమంత్రిని కాదు, తనతో కలిసి రాజకీయాల్లోకి వచ్చేవారెవరికీ డబ్బు సంపాదించాలన్న ఆలోచన ఉండకూడదు.. ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న వారందరికీ పదవులు లభించకపోయినా బాధ పడకూడదు.. ఈ నిబంధనలను అందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తేనే పార్టీని ప్రారంభిద్దాం.. ఎవరికైనా ఇందుకు అభ్యంతరం ఉంటే సమస్యలేదు.. తనకు రాజకీయాలు సరిపడవు, సినిమాలే చాలు అని ఒక వారంలో ప్రకటిస్తానను అని రజనీకాంత్‌ చెప్పడంతో సమావేశంలోని వారందరూ ఖంగుతిన్నారని ఆ వ్యక్తి వెల్లడించారు. 

అంతేకాకుండా ముఖ్యమంత్రిగా రజనీకాంత్‌ను మినహా వేరెవరినూ ఊహించకోలేమని, అట్లాండిది రజనీకాంత్‌ వ్యాఖ్యలు తమకు షాక్‌ ఇచ్చాయని కార్యదర్శులు పేర్కొనట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు పార్టీ గురించి తలైవా ఎలాంటి ప్రకటన చేస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

అస్పష్టతకు, అనిశ్చితికి మారుపేరుగా నిలిచి ప్రజల దృష్టిలో పలుచబారిపోయిన జనసేన పార్టీ అధినేత, తెలుగు సినీ హీరో పవన్ కల్యాణ్ తరహాలోనే రజనీకాంత్ కూడా క్షణక్షణం తన అభిప్రాయాలు మార్చుకుంటూ రాజకీయ రంగ ప్రవేశం విషయంలోనూ గందరగోళం సృష్టిస్తూండటం వింతగొలుపుతోంది.

సస్పెన్స్‌ను దీర్ఘకాలంపాటు కొనసాగిస్తూ పోవడం సత్ఫలితాలు ఇవ్వదని రాజకీయ వ్యాఖ్యాత సుమంత్ సి రామన్ వ్యాఖ్యానించారు. గత 20 ఏళ్లుగా రజనీ రాజకీయ ప్రవేశం గురించి అభిమానులు కలలు కంటూనే ఉన్నా రజనీ మాత్రం ఇంతవరకు ఆ వైపుగా పయనించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని రామన్ అభిప్రాయపడ్డారు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle