నాయకుడి కలను నెరవేర్చిన నరేంద్ర మోడీ
06-08-201906-08-2019 11:37:19 IST
Updated On 06-08-2019 16:55:26 ISTUpdated On 06-08-20192019-08-06T06:07:19.622Z06-08-2019 2019-08-06T06:07:16.403Z - 2019-08-06T11:25:26.577Z - 06-08-2019

ఏడు దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని జమ్మూ కశ్మీర్ సమస్యను పరిష్కరించే దిశగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో బిల్లు పెట్టారు. రాజ్యసభలో ఆమోదం పొందడం, రాష్ట్రపతి ఆమోదముద్ర పొందటం కూడా జరిగిపోయాయి.
దీంతో జమ్మూ కశ్మీర్‌కు ఇంతకాలం ఉన్న స్వయం ప్రతిపత్తి కోల్పోయింది. ఈ నిర్ణయాన్ని రాజ్యసభలో మెజారిటీ పార్టీలు స్వాగతించి మద్దతు తెలపగా, కాంగ్రెస్ సహా మరికొన్ని పార్టీలు వ్యతిరేకించాయి. దేశవ్యాప్తంగానూ ప్రజల నుంచి ఈ నిర్ణయం పట్ల అభినందనలు వస్తున్నాయి. అయితే, ఆర్టికల్ 370ని రద్దు చేయడం అనేది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఈ ఆర్టికల్‌ను రద్దు చేయాలనేది భారతీయ జనతా పార్టీకి అనేక ఏళ్లుగా ఉన్న లక్ష్యం.
కొంచెం చరిత్రలోకి వెళితే.. భారతీయ జనతా పార్టీకి పూర్వ రూపమైన భారతీయ జన సంఘ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామ ప్రసాద్ ముఖర్జీకి ఆర్టికల్ 370 రద్దు చేయాలనేది ఒక లక్ష్యం. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే ఆయన ఈ ఆర్టికల్ వల్ల దేశానికి, జమ్ము కశ్మీర్‌కు కలిగే నష్టాన్ని గుర్తించి తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా జాతీయ సమైక్యతకు ఈ ఆర్టికల్ భంగం కలిగిస్తుందనేది ఆయన వాదన.
ఈ ఆర్టికల్‌ను తీసుకురావడంలో, కొనసాగించడంలో కాంగ్రెస్ పార్టీ విధానాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకే దేశానికి ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. అప్పట్లో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేకంగా ప్రధాన మంత్రి ఉండేవారు. దేశంలో భాగమైన కశ్మీర్‌కు వెళ్లడానికి అనుమతులు ఎందుకని ఆయన ప్రశ్నించారు.
అంతేకాదు, అప్పుడే ఆయన ఆర్టికల్ 370 రద్దు చేయాలనే డిమాండ్‌తో దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి ఆయన జమ్మూ కశ్మీర్‌కు కూడా వెళ్లగా ఆయనను పోలీసులు ఆరెస్ట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేయడం శ్యామ ప్రసాద్ ముఖర్జీకి ఒక కల. అందుకే బిల్లుపై చర్చ సందర్భంగా అమిత్ షా శ్యామ ప్రసాద్ ముఖర్జీని గుర్తు చేసుకున్నారు.
తర్వాత కూడా బీజేపీ ఈ ఆర్టికల్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చింది. 1992లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరిగిన ఏక్తా యాత్రలోనూ ఇదే ప్రధాన లక్ష్యంగా ఆ పార్టీ పెట్టుకుంది. ఈ యాత్రలో ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొన్నారు. అంటే, 30 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ ఆర్టికల్ 370ని రద్దు చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఈసారి పూర్తి మెజారిటీతో బీజేపీ అధికారంలో ఉండటంతో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ నరేంద్ర మోడీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. తమ నాయకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ కన్న కలను నిజం చేయడంతో పాటు తమ పార్టీ ప్రధాన లక్ష్యాల్లో ఒక దానిని అందుకున్నారు.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
3 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
4 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
4 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
8 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
9 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
7 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
9 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
10 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
5 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
12 hours ago
ఇంకా