నవంబర్ వరకూ ఉచిత రేషన్.. పీఎం గరీబ్ కల్యాణ్ యోజన పొడిగింపు
30-06-202030-06-2020 17:00:12 IST
Updated On 30-06-2020 17:20:14 ISTUpdated On 30-06-20202020-06-30T11:30:12.987Z30-06-2020 2020-06-30T11:23:46.844Z - 2020-06-30T11:50:14.528Z - 30-06-2020

దేశంలో కరోనా కేసులు పెరిగిపోవడం, లాక్ డౌన్ నిబంధనలు కొన్ని సడలించిన గడువు ముగియడంతో ప్రధాని మోడీ దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అందులో భాగంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా నియంత్రణకు సహకరించాలని కోరారు. మరో విడత అన్ లాక్ అమలు కావాల్సిన వేళ ప్రధానమంత్రి ఏం మాట్లాడతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అంతేకాదు.. ప్రధాని గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. నవంబర్ చివరి వరకు ఉచిత రేషన్ కొనసాగిస్తున్నట్టు తెలిపారు. జూలై నుంచి నవంబర్ వరకు 80 కోట్ల మందికి రేషన్ ఇస్తామని తెలిపారు. నెలకు 5 కిలోల బియ్యంతోపాటుగా, కిలో పప్పు అందజేస్తామని తెలిపారు. ‘వాతావరణం మారుతున్నందున ప్రజలంతా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఇతర దేశాలతో పోలిస్తే కరోనా పోరాటంలో భారత్ ముందుందని తెలిపారు. భారతదేశంలో కరోనా నివారణ చర్యలు సత్పలితాలు ఇస్తున్నాయని అందుకే, కరోనాతో చనిపోతున్నవారి సంఖ్యను చూస్తే.. ప్రపంచంలో భారత్ పరిస్థితి మెరుగ్గా ఉందని పేర్కొన్నారు.సరైన సమయంలో లాక్డౌన్ పెట్టడం వల్ల కరోనా అదుపులో ఉందని, కానీ ఆంక్షలు సడలించడం వల్ల కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందన్నారు.మాస్కులు వేసుకోవడంలో ప్రజల్లో నిర్లక్ష్యం వహించడంపై ఆవేదన చెందారు మోడీ. లాక్డౌన్ సమయంలో నిబంధనలను చాలా కఠినంగా పాటించారు. మళ్లీ ఒకసారి రాష్ట్రప్రభుత్వాలు నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని దేశాలలో మాస్కు ధరించకపోతే నిబంధనలు కఠినంగా అమలుచేస్తున్నారని, ఒక దేశ ప్రధాని మాస్కు పెట్టుకోలేదని రూ.13వేలు జరిమానా విధించారన్నారు. లాక్డౌన్ సందర్భంగా ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని ప్రభుత్వాలు పనిచేశాయన్నారు. నిబంధనలు మరింత కఠినతరం చేయడానికి అంతా సహకరించాలన్నారు. ఫ్లూ జ్వరాల సీజన్ నేపథ్యంలో అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్నయోజన పథకానికి 1.5లక్షల కోట్లు ఖర్చవుతోందన్నారు. 80 కోట్ల మందికి బియ్యం, గోధుమలు, కిలో కందిపప్పు అందించామన్నారు.వలస కూలీలు ఎక్కడ వున్నా వారికి రేషన్ అందించామన్నారు. కంటైన్ మెంట్ జోన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు మోడీ. కరోనా వేళ గరీబ్ యోజన ద్వారా 20 కోట్ల కుటుంబాలకు రూ.31 వేల కోట్లు నగదు జమచేశామన్నారు. రైతులకు కూడా 9 కోట్ల మందికి 18వేల కోట్లు జమచేశామన్నారు. రైతులు పెట్టుబడి మొత్తం కోసం ఎదురుచూడకుండా చూశామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పోరాటం అంతా 130 కోట్లమందిని కాపాడుకోవడానికే అన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఇంకా అప్రమత్తతతో వుండాలన్నారు మోడీ.

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
7 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
10 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
14 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
14 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
14 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
12 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
21-04-2021

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా