newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నల్లధనంపై నరేంద్రమోడీ ముందడుగు

08-10-201908-10-2019 10:30:15 IST
2019-10-08T05:00:15.442Z08-10-2019 2019-10-08T05:00:08.549Z - - 15-04-2021

నల్లధనంపై నరేంద్రమోడీ ముందడుగు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బీజేపీ అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చింది. అందులో ముఖ్యమయినది విదేశాల్లో పేరుకుపోయిన నల్లధనం వెలికితీత. ఈ హామీ అమలుకోసం ప్రధాని నరేంద్రమోడీ అనేక ప్రయత్నాలు చేశారు.

ఇప్పుడు ఇవన్నీ కొలిక్కి వచ్చాయి. నల్లధనం దాచిన వారి పేర్లు త్వరలో బయటకు రానున్నాయి. ప్రధాని మోడీ ఈ విషయంలో తొలి అడుగు వేశారు. 

స్విట్జర్లాండ్‌ బ్యాంకుల్లో అక్రమంగా డబ్బు దాచిన భారతీయుల ఖాతాల తొలి విడత వివరాలు స్వదేశానికి చేరాయి. ఫెడరల్‌ టాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు 2018 లో భారతీయులు జరిపిన లావాదేవీలు, మూసివేసిన ఖాతాల వివరాలను భారత్‌ కు అందించడంతో వారి గుట్టురట్టుకానుంది.

స్విస్ బ్యాంకులో భారతీయులు చేసిన వివిధ లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎఫ్‌టీఏ ఈ వివరాలను అందజేస్తోంది. 2020 సెప్టెంబర్‌లో మరో విడతలో ఖాతాదారుల వివరాలను తెలియజేయనున్నట్లు ఎఫ్‌టీఏ తెలిపింది. 

ఆటోమేటిక్‌ ఎక్చేంజ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఒప్పందం ప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న ఖాతాలు, 2018 లో మూసివేసిన ఖాతాల వివరాలను అందజేసేందుకు స్విట్జర్లాండ్‌ అంగీకారం తెలిపింది.

అయితే తాము అందించే వివరాలను ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో బహిర్గతం చేయరాదని స్విట్జర్లాండ్‌ షరతు విధించడం విశేషం. ఈ షరతు ప్రకారం స్విస్‌ బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన భారతీయుల వివరాలను వెల్లడించకుండా, ఆయా వ్యక్తులు/సంస్థలపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశముంది. 

వివిధ దేశాలతో స్విట్జర్లాండ్‌ చేసుకున్న సమాచార మార్పిడి ఒప్పందం ప్రకారం తొలి విడతలో 31 లక్షల ఆర్థిక ఖాతాల వివరాలను ఆయా దేశాలకు పంపించినట్టు తెలుస్తోంది.

వచ్చే తొమ్మిది నెలల్లో రెండో విడత సమాచారాన్ని భారత్‌కు అందించనుంది. స్విస్‌ బ్యాంకుల్లో అక్రమంగా నల్లధనాన్ని దాచుకున్న భారతీ యుల వివరాలు మోడీ ప్రభుత్వానికి అందడంతో వారిపై చర్యలకు ఐటీ శాఖ అధికారులు సిద్ధమౌతున్నారు.

దేశంలో ఆదాయపు పన్నును ఎగ్గొట్టి.. అక్రమంగా డబ్బును విదేశాలకు తరలించిన వారి వివరాలను ఆరా తీస్తున్నారు. నల్లధనం దాచిన వివరాలు బయటపడడమే కాదు, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకున్నప్పుడే స్విట్జర్లాండ్ ఇచ్చిన సమాచారానికి విలువ వుంటుంది. 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   13 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   13 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   17 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   18 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle