newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నరేంద్ర మోడీ కాకుంటే మరెవరు? -1

14-05-201914-05-2019 15:20:02 IST
Updated On 14-05-2019 17:45:54 ISTUpdated On 14-05-20192019-05-14T09:50:02.068Z14-05-2019 2019-05-14T09:44:11.729Z - 2019-05-14T12:15:54.650Z - 14-05-2019

నరేంద్ర మోడీ కాకుంటే మరెవరు? -1
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
2019 లోక్​సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీలో చక్రం తిప్పబోయేది ఎవరు? మోడీకి ఎదురుగాలి వీస్తే అందరికీ ఆమోదయోగ్యమయిన వ్యక్తి ఎవరు? తదుపరి ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్న నేత ఎవరు? బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రధానమంత్రి నిజంగా రాబోతున్నారా? అంటే ఢిల్లీ పరిణామాలను బట్టి అవుననే సమాధానం వస్తోంది. దేశరాజకీయాలువేగంగా మారుతున్నాయి. మోడీ కరిష్మా తగ్గిపోతోంది. దేశాన్ని నడిపించే సమర్థ నాయకత్వం కావాలి. ఈసారి ఎన్నికలలో ఎవరికీ సరైన మెజారిటీ రాకపోవచ్చు. దీనికి బీజేపీ మినహాయింపు కాదు. గతంలో వచ్చిన సీట్ల కంటే వంద సీట్ల వరకూ మోడీకి తగ్గవచ్చని అంటున్నారు. అదే జరిగితే ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత పెరుగుతుంది. 

ఢిల్లీతో పాటు హిందీ బెల్ట్‌లో బీజేపీ కమలం వాడిపోతోంది. ఎక్కువగా ఆశలు పెట్టుకున్న ఉత్తరాది రాష్ట్రాల్లో మోడీకి ఎదురుగాలి బాగా వీస్తోందని సర్వేలు, రాజకీయ అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో బీజేపీ బలం బాగా తగ్గనుంది. ఈ నష్టాన్ని పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల ద్వారా భర్తీ చేసుకోవాలని మోడీ అండ్ కో భావిస్తోంది.

అయితే వారు ఆశించినట్టుగా బెంగాల్ బీజేపీకి అంత సానుకూలంగా లేదు. బెంగాల్లో పాతుకుపోయిన తృణమూల్ కాంగ్రెస్ అంత త్వరగా బీజేపీకి అవకాశం ఇవ్వదు. అయితే బీజేపీ నేతలు మాత్రం బెంగాల్లో 20 సీట్లు సాధిస్తామంటున్నారు. ఇటు ఒడిశాలోనూ బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. 10 నుంచి 12 సీట్లు రాబట్టుకోగలిగితే వర్కవుట్ అవుతుందని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు.

అయితే మోడీ మాత్రం అంత త్వరగా బీజేపీ అధికారానికి దూరం అవుతుందంటే ఒప్పుకోవడం లేదు. దేశంలో ఏ ప్రాంతంలోనూ బీజేపీకి దీటుగా ఏ ఒక్క పార్టీ నిలబడలేకపోయిందంటున్నారు. గతంలో సాధించిన వాటికంటే ఈసారి ఎక్కువ సీట్లతో అధికారాన్ని నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో చివరిదశలో ఆయన అదే ధీమాతో ముందుకెళుతున్నారు.

బీజేపీ భారీ మెజారిటీతో గెలవబోతున్నదని ప్రజలు అనుకుంటున్నారు. ఎన్డీఏలోని ఇతర పార్టీలు కూడా మంచి స్కోర్​ సాధిస్తాయంటున్నారు. ఇప్పుడున్న వాటికంటే ఎక్కువ సీట్లతో, ఫుల్​ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం. ఈసారి దేశం నలుమూలల నుంచి మేం సీట్లు గెలవబోతున్నాం అని మోడీ చెబుతున్నా.. మనసులో ఎక్కడో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

17వ లోక్‌స‌భ‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌లు దాదాపు చివ‌రి అంకానికి చేరుకోవడంతో బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా బీజేపీని శాసించే ఆర్‌.ఎస్‌.ఎస్ చేసిన స‌ర్వేలో బీజేపీకి 180 సీట్లకు మించి రావని తేలింది.  ఆర్‌.ఎస్‌.ఎస్ నాయ‌కులు చాలా రాష్ట్రాల్లో ఇంటింటి స‌ర్వే చేప‌ట్టి తేల్చిన లెక్క ఇది. జాతీయ మీడియాలో ఈ సర్వే హల్ చల్ చేస్తోంది.

దీని ప్రకారం బీజేపీకి కేవ‌లం 180 సీట్లు మాత్రమే వ‌స్తాయని, మ‌రో 100 సీట్ల వ‌ర‌కు మిత్రుల స‌హ‌కారం అవ‌స‌రం అవుతుంద‌ని అంటున్నారు. ఆర్ఎస్ఎస్ చేసిన ఈ ముందస్తు హెచ్చరిక‌లు ఇప్పుడు బీజేపీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. 2014లో క‌నిపించినంత మోడీ హవా ఇప్పుడేమీ లేదన్నది నిజం  గ‌త ఎన్నిక‌ల్లో ఒంటరిగా బీజేపీ అధికారం సాధించింది. ఎన్నో అంచ‌నాల‌తో ప్రధాని ప‌గ్గాలు చేప‌ట్టిన మోడీ.. ఈ ఐదేళ్లలో సాధించిన ఘ‌న‌త‌లు పెద్దగా లేవ‌ని చెప్పాలి. ఎన్నో వివాదాల ముసుర్లు మోడీని చుట్టిముట్టేస్తున్నాయి. 

ఇటు కాంగ్రెస్ పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేదని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీతో కలిసి రావడానికి పార్టీలు సుముఖంగా ఉన్నా వారిని ప్రధానమంత్రి ఎవరనేది డోలాయమానంలో పడేస్తోంది. రాహుల్ గాంధీని ప్రధానిగా కూర్చోబెట్టడానికి కాంగ్రెస్ మిత్రపక్షాలు అంతగా ఒప్పుకోవడం లేదు. ముఖ్యంగా మాయావతి, ములాయం సింగ్, మమతా బెనర్జీ మోకాలడ్డుతున్న సంగతి తెలిసిందే. దేశంలో అత్యున్నతమయిన ప్రధానమంత్రి పదవి వస్తుందంటే ఏ చిన్న అవకాశాన్ని మమత-మాయావతి వదులుకునేలా లేరు. ఈ నేపథ్యంలో వీరందరికీ ఆమోదయోగ్యమయిన వ్యక్తి ఎవరనేది చర్చనీయాంశంగా మారింది.  (ఇంకా ఉంది)


నరేంద్ర మోడీ కాకుంటే ఇంకెవరు? -2 ఇది కూడా చదవండి

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   12 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   13 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   13 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   17 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   18 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   16 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   19 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   14 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle