newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

దేశంలో విపక్షాల ఐక్యతకు ఇదే మంచి తరుణం..!

22-09-202022-09-2020 18:11:12 IST
Updated On 22-09-2020 18:15:01 ISTUpdated On 22-09-20202020-09-22T12:41:12.648Z22-09-2020 2020-09-22T12:40:54.681Z - 2020-09-22T12:45:01.138Z - 22-09-2020

దేశంలో విపక్షాల ఐక్యతకు ఇదే మంచి తరుణం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

విపక్షాల  అభ్యంతరాలను ఖాతరు చేయకుండా, చర్చకు, ఓటింగ్ కు తావివ్వకుండా  కేంద్రం  పార్లమెంటు ఆమోదం పొందిన అగ్రి బిల్లుల వ్యవహారం విపక్షాల ఐక్యతకు దోహదపడుతున్నది. వేర్వేరుగా కాకుండా సమష్టిగా మాత్రమే బీజేపీని ఎదుర్కొనడం వీలౌతుందన్న అవగాహనకు క్రమంగా బీజేపీయేతర పార్టీలన్నీ వస్తున్నాయి. రాజ్యసభలో అగ్రీ బిల్లుల విషయంలో  ప్రభుత్వం అనుసరించిన తీరే విపక్షాలను అనివార్యంగా ఏకతాటిపైకి తీసుకువచ్చింది. మిత్ర పక్షం అంటే ఎన్డీయే భాగస్వామ్య పక్షం వ్యతిరేకతను సైతం ఖాతరు చేయకుండా బీజేపీ సభలో వ్యవహరించిన తీరు విపక్షాలను జ్ణానోదయం అయ్యేలా చేసింది. జాతీయ స్థాయిలో రాజకీయ ఐక్యతకు నాయకత్వం వహించేందుకు కాంగ్రెస్ సుముఖంగానే  ఉన్నా  పలు అనివార్యతలు  ఆ పార్టీకి బీజేపీ  యేతర పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తీసుకువచ్చే అవకాశంలేకుండా పోయింది.

యూపీఏ భాగస్వామ్య పక్షాలు మాత్రమే  ఐక్యంగా  ఉన్నంత  మాత్రాన కేంద్రంలో బీజేపీని దీటుగా ఎదుర్కొనే  పరిస్థితి, వాతావరణం ప్రస్తుతం  లేదు. ఎన్డీయే నుంచి శివసేన, అకాలీదళ్ వంటి  పార్టీలు  బయటకు వచ్చినా  ఖాతరు  చేయాల్సిన  అవసరం లేని సంఖ్యా  బలం ప్రస్తుతం  బీజేపీకి ఉంది. అందుకే యూపీఏతో పాటు యూపీఏతర, ఎన్డీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి రావలసిన అవసరం  ప్రస్తుతం  దేశంలో ఉందన్న సంగతిని బీజేపీయేతర పార్టీలన్నీ గుర్తించాయి. ఆరేళ్ల కాలంలో అంటే ప్రధాని మోడీ కేంద్రంలో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు  చేసిన  నాటి నంచీ లెక్కగట్టుకుంటే విపక్ష పార్టీలన్నీ ఒకే అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం సమష్టిగా సభనుంచి వాకౌట్ చేయడం ఇదే మొదటి సారి.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి సమాఖ్య స్ఫూర్తికి  బీటలు వారే పరిస్థితులు ఏర్పడే విధంగా కేంద్రం తీరు ఉండటంతో ప్రాంతీయ పార్టీలు  ఎన్డీయే కూటమిలో ఉన్నా మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సహకరించలేని పరిస్థితి ఉంది. కేంద్రానికి దన్నుగా నిలబడితే రాష్ట్రంలో రాజకీయ ఉనికి ప్రశ్నార్ధకమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకు భిన్నంగా ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుంటే రాష్ట్రంలో పార్టీ మనుగడకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయన్న శంశయం వెన్నాడుతోంది. కేంద్రంతో ఢీ అన్న నేతలు, పార్టీలూ కేంద్ర దర్యాప్తు సంస్థల వేధింపులను ఎదుర్కొన్న ఉదంతాలూ, సంఘటనలే ఇందుకు నిదర్శనం. దీంతో ప్రాంతీయ పార్టీలు తమ అస్థిత్వం కాపాడుకోవడానికైనా బీజేపీకి వ్యతిరేక గళం వినిపించాల్సిన పరిస్థితి.

వైకాపా వంటి ప్రాంతీయ పార్టీలు ఇందుకు భిన్నంగా ఉండటానికి వేరే కారణాలున్నాయి. వాటి సంగతి పక్కన పెడితే...కేంద్ర సర్కార్ కు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ముందుగా అడుగు వేసినది తెలంగాణ సీఎం నేతృత్వంలోని తెరాస పార్టీయే. ఆ అడుగును ఒక లాజికల్ ఎండ్ కు తీసుకు వెళ్లడానికి తెరాసకు నూతన విద్యుత్ బిల్లు, అగ్రి బిల్లులు కలిసి వచ్చాయని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీని మినహాయిస్తే ఈ బిల్లులను, జీఎస్టీ బకాయిల చెల్లింపు విషయంలలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరునూ గట్టిగా వ్యతిరేకించింది తెరాస మాత్రమే. సమాఖ్య వ్యవస్థకు, సమాఖ్య స్ఫూర్తికి గండి కొట్టేలా రాష్ట్రాల పరిధిలోని అంశాలపై కూడా ఆర్డినెన్సులు తీసుకువస్తున్న కేంద్రానికి వ్యతిరేకంగా విపక్షాలలో ఇప్పుడు కనిపిస్తున్న ఐక్యత ముందు ముందు కూడా కొనసాగితే బీజేపీకి ఇబ్బందులు తప్పవు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   14 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   10 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   13 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   17 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   20 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   21 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle