newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

దేశంలో జూన్ 25 తర్వాత మళ్ళీ లాక్ డౌన్ తప్పదా ?

10-06-202010-06-2020 10:03:52 IST
2020-06-10T04:33:52.401Z10-06-2020 2020-06-10T04:33:19.939Z - - 15-04-2021

దేశంలో జూన్ 25 తర్వాత మళ్ళీ లాక్ డౌన్ తప్పదా ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐదుపర్యాయాలు లాక్ డౌన్ విధించినా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గడంలేదు, లాక్ డౌన్ నిబంధనలు క్రమేపీ సడలించారు. ఇప్పుడు సినిమా థియేటర్లు తప్ప అన్నీ అందుబాటులోకి వచ్చాయి. అయితే సడలింపుల అనంతరం వారానికి 70 వేల కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో కరోనా కేసుల తీవ్రతలో ఇండియా ఐదవ స్థానానికి చేరడం ఆందోళణ కలిగిస్తోంది.ఈ నేపథ్యంలో అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న ఒక్కటే. మళ్ళీ స్వీయ నిర్బంధం తప్పదా? జూన్ 25 తర్వాత మళ్ళీ దేశంలో లాక్ డౌన్ విధిస్తారా ? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి.

కేంద్రం కూడా వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులకు సంబంధించి, వాస్తవిక పరిస్థితులను కనుగొనేందుకు సర్వే చేయాలని భావిస్తోంది. లాక్ డౌన్ సడలించిన తర్వాత విజృంభిస్తున్న కరోనా నేపథ్యంలో  మళ్ళీ లాక్ డౌన్ తప్పదన్న వార్త వైరల్ అవుతోంది. దేవాలయాలు, మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదికి వస్తున్నారు.

దాంతో కరోనాను అడ్డుకోవడం ఎవరి తరం కాదనే చర్చ సాగుతోంది. లాక్ డౌన్ లేకపోతే చిన్న దేశాలే కరోనాను అరికట్టలేకపోతున్నాయని, భారత్ దేశంలాంటి పెద్ద దేశంలో అరికట్టడం మరింత కష్టసాధ్యమంటున్నారు నిపుణులు. కేసుల సంఖ్య అమెరికాలో మాదిరిగా భారీగా పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సామాజిక‌ వ్యాప్తి చెందుతుందేమో అని భయపడుతున్నారు. మరో వైపు ఇప్పటికే కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి చెందడం ప్రారంభించిందని అంటున్నారు.

ఈనెలాఖరునాటికి లక్షల కొద్దీ కేసులు వస్తే మన దేశంలోని ఆస్పత్రులు కూడా సరిపోకపోవచ్చు. పీపీఈ కిట్లు, ఆస్పత్రుల్లో సిబ్బంది సరిపోకపోవచ్చు. లాక్ డౌన్ ఎత్తేసిన కొన్ని దేశాలు తిరిగి లాక్ డౌన్ విధించాయి. ఈ నేపథ్యంలో భారత్ లో కూడా జూన్ 25 తర్వాత మళ్ళీ లాక్ డౌన్ విధించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.  కరోనా వైరస్‌ ‌విజృంభణతో దేశ అర్థిక రాజధాని ముంబై అతలాకుతలమవుతోంది. ఇప్పటికే పాజిటివ్‌ కేసుల్లో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనాను అధిగమించిన మహారాష్ట్ర.. తాజాగా మరో అపఖ్యాతిని తెచ్చుకుంది.

వైరస్‌ పురుడుపోసుకున్న చైనాలోని వూహాన్‌ నగరాన్ని ముంబై మహానగరం అధిగమించింది. వూహాన్‌లో మొత్తం  50,333, కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 3,869 మంది మృత్యువాత పడ్డారు. వైరస్‌ను కట్టడి చేయడంలో చైనా ప్రభుత్వం ఇప్పటికే విజయంకాగా.. భారత్‌లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రోజులు గడుస్తున్నా కొద్ది దేశంలో వైరస్‌ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. గత వారం వరకు రోజుకూ ఏడువేల చొప్పున నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య తాజాగా పదివేలకు చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle