newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

దేశంలో కేసుల తీవ్రత.. ముంబైలో 144 సెక్షన్.. రోడ్డెక్కితే అరెస్టే!

05-05-202005-05-2020 11:34:21 IST
Updated On 05-05-2020 12:39:25 ISTUpdated On 05-05-20202020-05-05T06:04:21.144Z05-05-2020 2020-05-05T06:03:14.174Z - 2020-05-05T07:09:25.081Z - 05-05-2020

దేశంలో కేసుల తీవ్రత.. ముంబైలో 144 సెక్షన్.. రోడ్డెక్కితే అరెస్టే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్‌లో కరోనా కేసుల తీవ్రత పెరుగుతూనే వుంది. ఒకటి రెండు రోజుల తగ్గుతున్నట్లుగానే అనిపిస్తోన్నకేసులు.. మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 46వేల మార్క్‌ను దాటేసింది. గడిచిన 24 గంటల్లో 3,900  కొత్త కేసులు నమోదు కాగా.. 195 మంది మరణించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 46,433గా ఉంది. 1,568 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. 12727 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 32,138 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 1717 కి పెరిగాయి. ఇవాళ కొత్తగా 67 కేసులు వెలుగులోకి వచ్చాయి. 

లాక్‌డౌన్‌ మరో రెండు వారాల పాటు పొడిగించిన కేంద్రం.. కొన్ని రంగాలకు మినహాయింపు ఇవ్వడంతో కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ముంబై న‌గ‌రంలో సోమ‌వారం ఒక్క రోజే కొత్త‌గా 510 పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. మొత్తం 18 మంది మృతి చెందారు. ఈ కేసుల‌తో ముంబైలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9123కు చేరుకుంది. ముంబైలో క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు పోలీసులు 144 సెక్ష‌న్ ను విధించారు. మే 17 వ‌ర‌కు 144 సెక్ష‌న్ అమ‌లులో ఉంటుంది. 

అవసరం లేకపోయినా రోడ్డుపైకి వస్తే కేసులు పెట్టి..అరెస్ట్ చేస్తామని ముంబై పోలీస్ ఉన్న‌తాధికారులు హెచ్చరించారు. ఇటు వైద్య‌సేవ‌లు మిన‌హా ఇత‌ర ప‌నుల కోసం బ‌య‌ట‌కు రావ‌డంపై ప్ర‌తీ రోజూ ఉద‌యం 7 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు లాక్ డౌన్ నిబంధ‌న‌లు, నిషేధాజ్ఞ‌లు అమ‌లులో ఉంటాయి. మహారాష్ట్రలో దేశంలోనే అతి ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ఉబెర్, ఓలా క్యాబ్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 

ఇటు ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు ఆందోళనకరంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 36,46,099 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 2,52,406 మంది మృతిచెందారు. ఈ వైరస్‌ బారిన పడిన 11,97,708 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 21,95,985 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అమెరికాలో మొత్తం 12,12,900 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 69,921 మంది బాధితులు మరణించారు. 1,88,068 మంది కోలుకోగా, మరో 9,54,887 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

స్పెయిన్లో 2,48,301 కరోనా కేసులు నమోదవగా, 25,428 మంది మృతిచెందారు. ఇటలీలో 2,11,938 కరోనా కేసులు నమోదవగా, 29,079 మంది మరణించారు. యూకేలో 2,11,938 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 28,734 మంది మరణించారు. ఫ్రాన్స్‌లో ఈ ప్రాణాంతక వైరస్‌ బారిన 1,69,462 మంది పడగా, 25,201 మంది మృతిచెందారు. రష్యాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,45,268కు చేరింది. దేశంలో ఇప్పటివరకు 1,356 మంది మరణించారు.

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   an hour ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   3 hours ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   2 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   4 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   4 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   4 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   21 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   a day ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle