దేశంలో ఒక్కరోజే 6088 కరోనా కేసులు.. వణుకుతున్న మహారాష్ట్ర
23-05-202023-05-2020 08:39:37 IST
Updated On 23-05-2020 10:55:02 ISTUpdated On 23-05-20202020-05-23T03:09:37.154Z23-05-2020 2020-05-23T03:09:35.562Z - 2020-05-23T05:25:02.259Z - 23-05-2020

దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6088 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,18,447కి చేరింది. కాగా 24 గంటల్లోనే 148 మంది మరణించడంతో దేశంలో మృతుల సంఖ్య 3583కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 48,533 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 66,330 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా దేశంలో కరోనా రికవరీ రేటు 40.97 శాతంగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. గత రెండు నెలల కాలంలో 24 గంటల్లో ఆరువేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు బయటపడటంతో భారత్ కోవిడ్-19 వ్యాప్తికి సంబంధించి ప్రమాదకరమైన దిశలోకి వెళుతున్నట్లు భయపడుతున్నారు. మహమ్మారి కరోనా వైరస్ మహారాష్ట్రను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రాణాంతక వైరస్ ధాటికి దేశ ఆర్థిక రాజధాని చిగురుటాకులా వణుకుతోంది. ముంబైవాసులను కరోనా కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2940 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యియి. రాష్ట్రంలో వైరస్ బయటపడినప్పటి నుంచి ఇంతపెద్ద మొత్తంలో కేసులు వెలుగుచూడటం ఇది తొలిసారి. దీంతో మహారాష్ట్ర ఒక్కసారికి ఉలిక్కిపడింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 44,582కి చేరింది. ఇక ఆసియాలోనే అత్యంత మురికివాడల్లో ఒకటైన ధారావిలో కరోనా భయాందోళన సృష్టిస్తోంది. శుక్రవారం కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మురికివాడలో మొత్తం కేసుల సంఖ్య 1478కి చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరణాల సంఖ్య 1460కి పెరిగింది. తాజా కేసులతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. నాలుగో విడత లాక్డౌన్ అనంతరం రాష్ట్రంలో పెద్ద ఎత్తున సడలింపులు ఇవ్వడంతో కేసుల సంఖ్య పెరిగినట్లు బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు భావిస్తున్నారు. ఇక దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,18,447కి చేరింది.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
5 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
6 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
5 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
9 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
10 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
9 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
11 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
12 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
7 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
13 hours ago
ఇంకా