newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

దూబే నోరు నొక్కేశారు. ఎన్ని రహస్యాలు దాచారు.. రాహుల్ ప్రశ్న

12-07-202012-07-2020 06:41:44 IST
Updated On 12-07-2020 10:46:24 ISTUpdated On 12-07-20202020-07-12T01:11:44.426Z12-07-2020 2020-07-12T01:11:41.847Z - 2020-07-12T05:16:24.397Z - 12-07-2020

దూబే నోరు నొక్కేశారు. ఎన్ని రహస్యాలు దాచారు.. రాహుల్ ప్రశ్న
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. దూబే ఎన్‌కౌంటర్‌పై విపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ ఎంపీ చురకలు వేశారు. దూబే ఎన్‌కౌంటర్‌ సహా ఏ ఒక్కరినీ నేరుగా ప్రస్తావించకుండా ఈ వ్యవహారంలో యూపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ  రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ‘ఎన్నో సమాధానాలకు మౌనమే సమాధానం..మౌనం వెనుక ఎన్ని ప్రశ్నలను దాచారో తెలియద’ని రాహుల్‌ వ్యాఖ్యానించారు. కాగా ఎన్‌కౌంటర్‌లో వికాస్‌ దూబేను హతమార్చడంపై విపక్షాలు సీబీఐ విచారణకు డిమాండ్‌ చేశాయి. 

దూబే ఎన్‌కౌంటర్‌పై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయని కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ అన్నారు. రాజకీయ నేతలతో గ్యాంగ్‌స్టర్‌ సంబంధాలు బయటపడతాయనే భయంతోనే ఆయనను ఎన్‌కౌంటర్‌ చేశారని పలువురు భావిస్తున్నారని చెప్పారు. కరుడుగట్టిన నేరస్తుడు, గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌పై ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ స్పందించారు. నిజానికి కారు బోల్తా పడలేదని, రహస్యాలు బయటపడి ప్రభుత్వం బోల్తా పడకుండా రక్షించారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

కాగా యూపీలో అనేక నేర కార్యకలాపాలకు పాల్పడిన వికాస్‌ దూబే వారం రోజుల క్రితం తన అనుచరులతో కలిసి ఎనిమిది మంది పోలీసుల ప్రాణాలు బలితీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం అతడిని మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. సమాచారం అందుకున్న యూపీ పోలీసులు అక్కడికి చేరుకుని.. రోడ్డు మార్గం గుండా శుక్రవారం ప్రత్యేక ఎస్కార్ట్‌లో వికాస్‌ను కాన్పూర్‌కు తీసుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పోలీసుల తుపాకీ లాక్కునేందుకు అతడు ప్రయత్నించిన క్రమంలో వాహనం బోల్తా పడిందని, అనంతరం తమపై కాల్పులు జరపగా ఎన్‌కౌంటర్‌ చేశామని పోలీసులు తెలిపారు. 

ఈ క్రమంలో వికాస్‌ అరెస్టైన తీరుపై అనుమానం వ్యక్తం చేసిన అఖిలేఖ్‌ యాదవ్‌.. గ్యాంగ్‌స్టర్‌ను పోలీసులు పట్టుకున్నారా లేదా అతడే లొంగిపోయాడో చెప్పాలంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను డిమాండ్‌ చేశారు. ఇక తాజాగా ఎన్‌కౌంటర్‌లో అతడు హతం కావడంతో.. ‘‘నిజానికి కారు బోల్తా పడలేదు. రహస్యాలు బహిర్గతం కాకుండా.. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం బోల్తా పడకుండా రక్షించడం జరిగింది’’అంటూ తనదైన శైలిలో ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు.

కాగా అఖిలేశ్‌తో పాటు జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా ఈ ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. ‘‘చనిపోయిన వ్యక్తి ఎలాంటి కథలు చెప్పలేడు’’ కదా ఒమర్‌ ట్వీట్‌ చేయగా.. ‘‘నేరస్తుడు చచ్చిపోయాడు. మరి అతడు చేసిన నేరాలు, అందుకు సహకరించిన వారి సంగతేంటి’’ అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. కాగా ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వికాస్‌ దూబేను విచారిస్తే పోలీసులు, రాజకీయ నాయకులతో అతడికి ఉన్న సంబంధాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే ఎన్‌కౌంటర్‌ చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ అతడిని ఈరోజు ప్రత్యేక వాహనంలో కాన్పూర్‌కు తరలిస్తుండగా.. పోలీసుల ఎస్కార్ట్‌లోని ఆ వాహనం బోల్తా పడింది. దీనిని అదునుగా తీసుకున్న వికాస్‌ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో గాయపడిన అతడిని కాన్పూర్‌ ఆస్పత్రికి తరలించగా అతడు మరణించాడు. వికాస్‌ దూబేపై హత్య కేసులు సహా మొత్తం 60 క్రిమినల్‌ కేసుల్లో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నాడని పోలీసులు చెప్పారు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle