newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

దుష్యంత్ చౌతాలా.. 10నెలలకే కింగ్ మేకర్

27-10-201927-10-2019 08:23:31 IST
2019-10-27T02:53:31.437Z27-10-2019 2019-10-27T02:52:44.198Z - - 12-04-2021

దుష్యంత్ చౌతాలా.. 10నెలలకే కింగ్ మేకర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
31 ఏళ్ల దుష్యంత్ చౌతాలాకి అనుకోని అదృష్టం తలుపుతట్టింది. ఒక రాష్ట్రానికి అతి చిన్న వయసులో డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం దుష్యంత్ కే దక్కింది. అసలు దుష్యంత్ చౌతాలా ఎవరు, ఈ విజయం ఎలా దక్కిందో తెలుసుకోవడానికి ఇప్పుడు ఇంటర్నెట్లో అన్వేషణ మొదలైంది. దుష్యంత్ .. ఓం ప్రకాశ్ చౌతాలా మనవడు. మాజీ ఉప ప్రధాని చౌదరీ దేవి లాల్ ముని మనవడు. 1988లో జన్మించిన దుష్యంత్.. 2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిచి.. అతి చిన్న వయసులోనే ఎంపీగా చరిత్ర సృష్టించాడు. 2018 డిసెంబర్ 9న ఆయన్ను ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) బహిష్కరించింది. 

ఆ పార్టీ అధినేతగా దుష్యంత్ చిన్నాన్న అభయ్ చౌతాలా ఉన్నారు. ఐఎన్‌ఎల్‌డీ నుంచి బయటకొచ్చిన దుష్యంత్ తనకంటూ ఓ పార్టీ కావాలని భావించాడు. జననాయక్ జనతా పార్టీ పేరుతో పార్టీకి శ్రీకారం చుట్టాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆరు లక్షల మంది ప్రజలు హాజరుకావడం ఇతర పార్టీల వెన్నులో వణుకుపుట్టేలా చేసింది. 1986లో ఆయన ముత్తాత చౌదరీ దేవి లాల్ నిర్వహించిన సభ తర్వాత అంతమంది జనం మనవడి సభకు వచ్చారు. 

తాతకు తగ్గ మనవడు అంటారు.. కానీ దుష్యంత్ ముత్తాత పేరు స్ఫురించేలా పార్టీ పెట్టడం అందరినీ ఆలోచింపచేసింది. హర్యానాలో జింద్ ఉపఎన్నికలో జేజేపీ అభ్యర్ధి తన సత్తా చాటాడు. ప్రధాన పార్టీలకు షాకిచ్చేలా రెండోస్థానంలో నిలిచింది. దుష్యంత్‌ ప్రతిభ, వ్యూహాలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫిదా అయ్యారు. ఆమ్ ఆద్ పార్టీ జేజేపీకి మద్దతు ఇస్తుందని ప్రకటించారు.  2019 లోక్ సభ ఎన్నికల్లో జేజేపీ తరఫున పోటీ చేసిన దుష్యంత్.. బీజేపీ అభ్యర్ధి బ్రిజేంద్ర సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు.

కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ కొడుకైన బిజేంద్ర సింగ్ చేతిలో ఓడినా అసెంబ్లీ ఎన్నికల కోసం ఎదురుచూశారు. హర్యానాలో జాట్‌లు 29 శాతం పైగా ఉంటారు. వీళ్లంతా జేజేపీ‌కి మద్దతు నిలవడంతో దుష్యంత్ కింగ్ మేకర్ అయ్యాడు. అమెరికాలో చదువుకున్న దుష్యంత్ చౌతాలా.. అరిజోనా అత్యున్నత పౌరపురస్కారం కూడా అందుకున్నాడు. తాజాగా ఫలితాల అనంతరం జరిగిన పరిణామాలు దుష్యంత్ కు బాగా కలిసి వచ్చాయి. జేజేపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరనుంది.

ఈ మేరకు గవర్నర్ సత్యదేవ్ నరైన్ బీజేపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మనోహర్ లాల్ ఖట్టర్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎంగా దుష్యంత్ చౌతాలా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. అంతకుముందు దుష్యంత్ చౌతాలా తల్లి నైనా చౌతాలా డిప్యూటీ సీఎం అవుతారని వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చారు ఖట్టర్.

చివరకు దుష్యంత్ డిప్యూటీ సీఎం కాబోతున్నారు. ఎన్నిసీట్లు వచ్చాయని కాదు, ప్రభుత్వ ఏర్పాటులో కీలకం అవుతున్నామా లేదా అనేది నిరూపించాడు దుష్యంత్. కర్నాటకలో కుమారస్వామిలా.. దుష్యంత్ చక్రం తిప్పాడు. యువతరం ప్రతినిధిగా హర్యానా డిప్యూటీ సీఎంగా తన సమర్థతను ఎలా నిరూపించుకుంటాడో చూడాలి. 90 సీట్లున్నరాష్ట్రంలో పదిసీట్లు వస్తే చాలు డిప్యూటీ సీఎం అయిపోవచ్చని దుష్యంత్ ఉదంతం నిరూపించింది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle