దీదీ వెనక్కు తగ్గిందా..?
20-09-201920-09-2019 11:38:26 IST
Updated On 20-09-2019 15:03:37 ISTUpdated On 20-09-20192019-09-20T06:08:26.974Z20-09-2019 2019-09-20T06:08:23.660Z - 2019-09-20T09:33:37.757Z - 20-09-2019

దీదీ.. ఈ పేరువింటేనే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి.. అధికార పార్టీలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (దీదీ) స్టైలే వేరు. కేంద్రంలో పటిష్ఠంగా ఉన్న బీజేపీపైనే కాలుదువ్వారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దానిని పశ్చిమ బెంగాల్లోకి ఎంటర్ కానివ్వకుండా అడ్డుపడ్డారు.. తమ అనుచరులు, పశ్చిమ బెంగాల్‌లోని కీలక అధికారులపై కేంద్రం సీబీఐ కేసులతో ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గకుండా పోరాటం చేస్తూ వచ్చారు. కానీ తాజాగా ఊహించనిరీతిలో మమతా ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాతో వరుస భేటీలు కావటం దేశరాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.
బీజేపీ జాతీయ ప్రధాన పార్టీ అయితే తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో ప్రధాన పార్టీ. ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరుంది. బీజేపీ విధానాలను, మోదీ నిర్ణయాలను ఎంతో ధైర్యంతో, మరే ముఖ్యమంత్రికి సాధ్యం కాని రీతిలో ఆమె విమర్శించేవారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మోదీని గద్దె దించటమే ప్రధాన అజెండాగా తన వంతు ప్రయత్నాలు చేశారు. కేంద్రంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా నిలిచారు.
ఎన్నికల ప్రచార సమయంలో పశ్చిమ బెంగాల్లో అమిత్‌షా ప్రచారానికి హెలికాప్టర్ దిగేందుకు అనుమతి నిరాకరించి బీజేపీతో ఢీ అంటే ఢీ అన్నారు. బీజేపీ సైతం మమతా బెనర్జీని టార్గెట్ చేసింది. దీంతో పశ్చిమ బెంగాల్లో బీజేపీ వర్సెస్ టీఎంసీ అన్నట్లుగా రాజకీయాలు కొనసాగాయి. హిందుత్వాన్ని బీజేపీ బలవంతంగా రుద్దాలని చూస్తుందని, ముస్లీంలపై దాడులు చేస్తున్నారంటూ మమత ఆరోపించటంతో పాటు తన కాన్వాయ్ వెళ్తుండగా జై శ్రీరాం అన్న వ్యక్తిని అరెస్టు చేయించి మోదీ, అమిత్‌షాలకు ప్రధాన శత్రువుగా మమత నిలిచారు.
కేంద్ర ప్రధాని హోదాలో మోదీ అమలు చేసిన పథకాలను మమతా తన రాష్ట్రంలో అమలు చేయలేదు. ఒకానొక దశలో తమ రాష్ట్రాన్ని తాము బాగుచేసుకుంటామని కేంద్రం మాకు అవసరం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇటీవల నూతన మోటార్ వాహన చట్టాన్ని తాము అమలు చేయబోమని మమత తెగేసి చెప్పింది. ఇలా కేంద్రంతో, మోదీ, అమిత్‌షాలతో పూర్తి వ్యతిరేకించే మమతా బెనర్జీ ఇప్పుడు వారిరువురికితో వరుసగా భేటీలు కావటం ప్రాధాన్యత సంతరించుకుంది.
మోదీ, అమిత్‌షాలతో వరుస భేటీలు కావటంతో దీదీ వెనక్కి తగ్గిందా అనే సందేహాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మోదీ, అమిత్‌షాలు అంటే ఒంటికాలుపై లేచే దీదీ ఇప్పుడు వారితో భేటీకి కారణమేమై ఉంటుందోననే చర్చ దేశ రాజకీయాల్లో సాగుతుంది. ఇదిలా ఉంటే తృణమూల్ కాంగ్రెస్ నేతలు మాత్రం దీదీ కేవలం రాష్ట్రం పేరు మార్పుకోసమే వారిని కలిశారని అంటున్నారు.
అయితే, పశ్చిమ బెంగాల్‌ను బంగగా మార్చేందుకు సహకరించాలని మోదీ, అమిత్‌షాలను కోరిందని, అంతకు మించి ఎలాంటి రాజకీయ అంశాలపై చర్చలు జరగలేదని పేర్కొంటున్నారు. కానీ మరోవైపు దీదీ వెనక్కుతగ్గారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనికి కారణంగా తన వర్గీయులపై సీబీఐ కేసులు ప్రభావం కూడా ఉండిఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏదిఏమైనా మొత్తానికి మోదీ, అమిత్‌షాలతో దీదీ భేటీ దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది.





జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
5 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
8 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
12 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
2 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
12 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
10 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
12 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
13 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
7 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
15 hours ago
ఇంకా