దీదీ ఇస్తానంటే పీకే వద్దన్నారా?
03-03-202003-03-2020 08:39:35 IST
Updated On 03-03-2020 15:44:00 ISTUpdated On 03-03-20202020-03-03T03:09:35.943Z03-03-2020 2020-03-03T03:09:22.431Z - 2020-03-03T10:14:00.311Z - 03-03-2020

ప్రశాంత్ కిషోర్ నిన్న మొన్నటి వరకూ కేవలం ఎన్నికల వ్యూహకర్త మాత్రమే. 2019 ఎన్నికల వరకూ ఆయన పెద్దగా రాజకీయాల జోలికి పోలేదు. రాజకీయ అంశాలను కూడా పట్టించుకోలేదు. అయితే జనతాదళ్ యు ఉపాధ్యక్షుడు అయిన తర్వాతనే ప్రశాంత్ కిషోర్ జాతీయ అంశాలపై కామెంట్స్ చేస్తున్నారు. జేడీయూతో బెడిసికొట్టాక ప్రశాంత్ కిషోర్ తన వ్యూహం మార్చారు. ప్రశాంత్ కిశోర్‌ను తృణమూల్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు నామినేట్ చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్లమెంట్‌తో తమ గొంతుకను మరింత బలంగా వినిపించాలని భావిస్తోన్న తృణమూల్ అధినేత్రి.. తెరపైకి కొత్త పేర్లను తీసుకొచ్చినట్టు చెబుతున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ మాత్రం... ఆఫర్ తిరస్కరించారని చెబుతున్నారు. ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆయన పెద్దల సభకు ఎన్నికవుతారనే ఊహాగానాలు ఢిల్లీ రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్నాయి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ నుంచి ప్రశాంత్ కిషోర్‌ను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పౌరసత్వ చట్ట సవరణపై ఆయన నిత్యం బీజేపీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. పార్లమెంట్‌తో ప్రతిపక్షాల గొంతుకను మరింత బలంగా వినిపించాలని భావిస్తోన్న తృణమూల్ అధినేత్రి.. తెరపైకి కొత్త పేర్లను తీసుకొచ్చారనే ప్రచారం జరుగుతోంది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పార్టీ వాణిని బలంగా వినిపించే యువ నేతలను రాజ్యసభకు పంపాలనేది అధినేత్రి ఉద్దేశమని, ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా ప్రశాంత్ పోరాడుతున్నారు. ఆయనతో పాటు దినేష్ త్రివేది, మౌసమ్నూర్ లాంటి వారిని రాజ్యసభకు పంపే అలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది బీజేపీని ధీటుగా ఎదిరిస్తూ, అన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీని వరసగా ఓడిస్తున్న ప్రశాంత్ కిషోర్ కు రాజ్యసభ పదవిని మమత బెనర్జీ గిఫ్ట్ గా ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్ లో ఖాళీ అవుతున్న నాలుగు సీట్లను తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంటుంది. రాజ్యసభకు మమత బెనర్జీ నామినేట్ చేస్తే ప్రశాంత్ కిషోర్ రాజ్యసభలోకి అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి ప్రశాంత్ కిషోర్ పై మమత బెనర్జీకి ప్రత్యేకమైన అభిమానమంటూ ఏమీ లేదు. అమిత్ షా కారణంగానే జేడీయూ నుంచి ప్రశాంత్ కిషోర్ సస్పెన్షన్ కు గురయ్యారని, బీజేపీని వ్యతిరేకించే గళానికి ఊతమివ్వాలన్న ఉద్దేశ్యంతోనే మమత బెనర్జీ ప్రశాంత్ కిషోర్ కు రాజ్యసభ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జేడీయూ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో బీహార్ నుంచి బరిలోకి దిగాలని ప్రశాంత్ కిషోర్ భావించారు. సీఏఏ పై కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటం, పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించడంతో ప్రశాంత్ కిషోర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆయన ఫ్రీ బర్డ్ అయ్యారు. బీహార్ లో బీజేపీ, జేడీయూ వ్యతిరేక కూటమి ఏర్పాటులో తలమునకలై ఉన్నారు మరో వైపు బీహార్ ఎన్నికలపై దృష్టి సారించిన ప్రశాంత్ ఆఫర్ ను తిరస్కరించారనే ప్రచారం జరుగుతోంది. గతంలో జేడీయూలో చేరిన చేసిన తప్పును మళ్లీ చేయకూడదని పీకే భావిస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ ఏడాదిలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే స్వరాష్ట్రంలో బలమైన రాజకీయ పునాది నిర్మించుకుని, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని ప్రశాంత్ భావిస్తున్నారు. తనకోసం ఒక దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించిన కిశోర్.. బీహార్‌లో రాజకీయంగా ఎదగడానికి ఐదు నుంచి పదేళ్ల సమయం తీసుకోవాలని భావిస్తున్నారు. అభివృద్ధి నినాదంతో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని సాధించి, భవిష్యత్తులో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనే నిశ్చయంతో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
11 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
16 hours ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
13 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
17 hours ago

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
15 hours ago

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత
20 hours ago

లక్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడినట్లే- రఘురామ
19 hours ago

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
21 hours ago

షర్మిల పక్కనే విజయమ్మ.. లాభమా నష్టమా
18 hours ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
a day ago
ఇంకా