దీదీతో అమీతుమీకి బీజేపీ రెడీ
29-06-201929-06-2019 08:04:45 IST
2019-06-29T02:34:45.167Z29-06-2019 2019-06-29T02:34:27.134Z - - 23-04-2021

పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ మీద పోరు తీవ్రతరం చేశారు ఆ రాష్ట్ర బీజేపీ నేతలు. తాజాగా హౌరాలోని బాల్లె ఖాల్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం నడి రోడ్డు మీద హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది బీజేపీ యువమోర్చా కార్యకర్తలు పాల్గొన్నారు. దీంతో గంటల పాటు ట్రాఫిక్ నిల్చిపోయింది. దీనికి వారు చెబుతోన్న కారణం ఒక్కటే. మమత బెనర్జీ సీఎం అయినప్పటి నుంచీ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం ప్రధాన రహదారుల మీద ముస్లింలు నమాజ్ చేస్తున్నారట. వందలాది మంది ముస్లింలు రోడ్ల మీద నమాజ్ చేస్తుండటం వల్ల భారీగా ట్రాఫిక్ నిల్చపోతోందట. పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఈ పరిస్థితి నెలకొందట. ఈ విధానం మీద ఎన్నోసార్లు మమత బెనర్జీకి ఫిర్యాదులు అందినా, ఆమె పట్టించుకోవడం లేదట. ముఖ్యంగా హౌరాలో ఆఫీసులకు వెళ్లేవారు, ఆస్పత్రులకు వెళ్లే అంబులెన్సులకు తీవ్ర అంతరాయం కలుగుతోందట. కొందరు పేషంట్లు అంబులెన్సుల్లోనే ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయట. కేవలం ముస్లింల ఓట్ల కోసమే మమత బెనర్జీ రోడ్ల మీద నమాజ్ చేయడాన్ని ప్రోత్సహిస్తున్నారనీ, జనం బాధలు ఆమెకు పట్టడం లేదని బీజేవైఎం ఆరోపిస్తోంది. అందుకే తాము ఈ విధంగా నిరసన చేస్తున్నామనీ, బెంగాల్ వ్యాప్తాంగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాల దగ్గర్లోని ప్రధాన రహదారుల మీద ఈ విధంగానే ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని స్పష్టం చేస్తున్నారు బీజేవైఎం నేతలు. గతంలో ముంబైలో కూడా ముస్లింలు నడిరోడ్డు మీద ప్రతి శుక్రవారం నమాజ్ చేసేశారు. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలకులు, ఏమాత్రం అడ్డుకునే వారు కాదు. వేలాది వాహనాలు నడిరోడ్డు మీద నిలిచి పోయేవి. జనం ఎన్నిసార్లు మొత్తుకున్నా కాంగ్రెస్ పాలకులు పట్టించుకునే వారు కాదు. దాంతో శివసేన ఈ విధంగానే నడిరోడ్డు మీద ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం మొదలు పెట్టింది. మొదట్లో శివసైనికుల మీద మండిపడ్డ జనం, ఆ తర్వాత వారికి మద్దతుగా నిలిచారు. జనం నుంచి వచ్చిన వ్యతిరేకతతో కాంగ్రెస్ నేతలు, ఆ తర్వాత నుంచీ ముస్లింలను రోడ్డు మీద నమాజ్ చేసుకునేందుకు ఒప్పుకోలేదు. ఇక ముస్లింలు కూడా శివసేన దెబ్బకు రోడ్ల మీద నమాజ్ చేయడం మానేశారు. అందుకే ఇప్పుడు బెంగాల్లో కూడా బీజేపీ ఈ విధంగానే నిరసనలకు దిగుతోంది.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
an hour ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
3 hours ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
2 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
4 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
4 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
5 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
21 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
22-04-2021
ఇంకా