newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

దమ్ముంటే చర్చకు రండి.. రాహుల్‌కి షా సవాల్

04-01-202004-01-2020 08:35:12 IST
Updated On 04-01-2020 12:45:13 ISTUpdated On 04-01-20202020-01-04T03:05:12.710Z04-01-2020 2020-01-04T03:04:35.581Z - 2020-01-04T07:15:13.626Z - 04-01-2020

దమ్ముంటే చర్చకు రండి.. రాహుల్‌కి షా సవాల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీఏఏ, ఎన్నార్సీ, ఎన్ పీఏ లపై రాజకీయ దుమారం రేగుతోంది. బీజేపీయేతర పార్టీలు వీటిపై నిరసనలు కొనసాగిస్తున్నాయి. తాజాగా హోంమంత్రి అమిత్ షా .. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. పౌరసత్వ సవరణ చట్టంపై దమ్ముంటే తనతో చర్చకు రావాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కోరారు. పౌర చట్టంపై కాంగ్రెస్‌ సహా విపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 

పౌర చట్టానికి మద్దతుగా శుక్రవారం జోథ్‌పూర్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి అమిత్‌ షా ప్రసంగించారు. ఈ చట్టంపై అపోహలు వీడాలని, వాస్తవాలు గ్రహించాలని ఆయన కోరారు. ఏ ఒక్కరి పౌరసత్వాన్ని నూతన చట్టం లాగేసుకోబోదని భరోసా ఇచ్చారు.

దేశంలో వుండే పౌరులకు దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని, అనవసరంగా నిరసనలకు దిగి పౌరులకు ఇబ్బందులు కలిగించవద్దన్నారు. సీఏఏపై దేశవ్యాప్త అవగాహనా కార్యక్రమాల్లో భాగంగా జోథ్‌పూర్‌ ర్యాలీలో అమిత్‌ షా సీఏఏను గట్టిగా సమర్ధించారు. ఈ చట్టాన్ని వెనక్కుతీసుకునే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. మోదీ సర్కార్‌ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల తోడ్పాటు అవసరమన్నారు. 

మరోవైపు వీర్‌సావర్కర్‌, నాథూరాం గాడ్సేల మధ్య శారీరక సంబంధం ఉందంటూ కాంగ్రెస్‌ సేవాదళ్‌ పుస్తకం ప్రచురించడంతో రచ్చరేగుతోంది. ఈ క్రమంలో రాహుల్‌ గాంధీపై హిందూ మహాసభ సంచలన వ్యాఖ్యలు చేసింది. వీర్‌సావర్కర్‌పై వచ్చిన ఆరోపణలు అర్ధరహితమైనవని అఖిల భారతీయ హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి అన్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్వలింగ సంపర్కుడనే వాదనలను కూడా తాము విన్నామని దీనిపై కాంగ్రెస్ నేతలు ఏమంటారో చెప్పాలన్నారు.

వీర్‌సావర్కర్‌తో నాథూరాం గాడ్సేల శారీరక బంధంపై కాంగ్రెస్‌ సేవాదళ్‌ ప్రచురించిన పుస్తకం కలకలం రేపుతోంది. బీజేపీతో పాటు ఆ పార్టీతో గతంలో కలిసి పనిచేసిన శివసేన సైతం సేవాదళ్‌ తీసుకువచ్చిన వివాదాస్పద పుస్తకాన్ని తప్పుబట్టింది. దేశభక్తుడిగా పేరొందిన గొప్ప నేత వీర్‌ సావర్కర్‌ను కించపరిచడం సరికాదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మండిపడుతున్నారు. ప్రజల మనసుల్లో ఉన్నత స్ధానం పొందిన సావర్కర్‌ ప్రతిష్టను మసకబారేలా చేయడం ఏమాత్రం అభిలషణీయం కాదన్నారు. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   3 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   5 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   10 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   12 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle