తలైవా ఇక తలపడేందుకు సిద్ధం..!
11-02-202011-02-2020 07:54:05 IST
2020-02-11T02:24:05.191Z11-02-2020 2020-02-11T02:23:55.173Z - - 23-04-2021

ఎట్టకేలకు సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీని స్థాపించాలనే నిర్ణయానికి వచ్చారట. రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించి రెండేళ్లు అవుతున్నా ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు వేయని రజనీ ఇప్పుడు ఇక ఫుల్‌టైమ్ రాజకీయ నేతగా మారిపోవాలని నిర్ణయించుకున్నట్లు తమిళనాట ప్రచారం జరుగుతోంది. 2021 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న రజనీకాంత్ ఏప్రిల్‌లో పార్టీ స్థాపించాలనే నిర్ణయానికి వచ్చారని తమిళ మీడియా అంటోంది. తమిళనాట సినీనటులు రాజకీయాల్లోకి వచ్చి కొందరు ఫెయిల్ కాగా, మరి కొందరు ముఖ్యమంత్రులు అయ్యారు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి తమిళ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. విజయకాంత్, కమల్ హాసన్ వంటి కొందరు నేతలు రాజకీయాల్లో రాణించలేకపోయారు. అందుకే తన రాజకీయ ప్రవేశం గురించి 20 ఏళ్లుగా అభిమానులు ఎదురుచూస్తున్నా రజనీకాంత్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రావాల్సిన సమయంలో వస్తానంటూ ఇంతకాలం దాటేస్తూ వచ్చారు. చివరగా రెండేళ్ల క్రితం తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. అప్పటినుంచి కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్న రజనీ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు మాత్రం చేయలేదు. కేవలం తన అభిమానులను సంఘటితం చేసేందుకు ప్రయత్నించారు. జయలలిత, కరుణానిధి మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో ఒక గ్యాప్ ఏర్పడింది. డీఎంకేకు స్టాలిన్ బలమైన నాయకుడిగా ఉన్నా అన్నా డీఎంకేకు బలమైన నాయకత్వం లేదు. దీంతో తను రాజకీయ రంగప్రవేశం చేయడానికి ఇదే సరైన సమయమని రజనీకాంత్ భావిస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అధ్యాత్మిక రాజకీయాలు చేస్తానని ప్రకటించిన రజనీకాంత్ బీజేపీకి దగ్గరవాడిగా ముద్రపడింది. తమిళనాట బీజేపీకి, ఆ పార్టీ విధానాలకు ఏ మాత్రం ఆదరణ లేదు. అయినా కూడా రజనీకాంత్ బీజేపీకి అనుకూలంగా పలు సందర్భాల్లో మాట్లాడుతున్నారు. ఇటీవల ఆయన పెరియార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తమిళనాడులో సంచలనంగా మారింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని కూడా రజనీ సమర్థించారు. దీంతో రాజకీయాల్లోకి వచ్చినా బీజేపీతో కలిసి పని చేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. అయితే, రజనీకాంత్ మాత్రం 2021లో అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీని స్థాపించి ఒంటరి పోరు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఏప్రిల్‌లో పార్టీని స్థాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీ పెట్టాక ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలనే అంశంపై కూడా రజనీకాంత్ కసరత్తు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. తమిళనాడులోని ఎనిమిది ప్రధాన నగరాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారట. వీటితో పాటు ప్రజల్లోకి వెళ్లేందుకు రాష్ట్రమంతా పాదయాత్ర చేయాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పాదయాత్ర చేసిన వారు కచ్చితంగా ముఖ్యమంత్రులు అయినందున ఆయన పాదయాత్ర వైపు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. అయితే, 69 ఏళ్ల రజనీ పాదయాత్ర చేయడం సాధ్యమయ్యే పనేనా అనే అనుమానాలు వస్తున్నాయి. ఏదేమైనా ఆయన రెండుమూడు నెలల్లో పార్టీని స్థాపించడం మాత్రం ఖాయంగా చెబుతున్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
2 hours ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
4 hours ago

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు
30 minutes ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
3 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
5 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
6 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
6 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
a day ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021
ఇంకా