newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

త‌గ్గితే తోక‌పార్టీ అవుతామ‌నే..!

09-11-201909-11-2019 09:50:24 IST
2019-11-09T04:20:24.461Z09-11-2019 2019-11-09T04:20:08.918Z - - 14-04-2021

త‌గ్గితే తోక‌పార్టీ అవుతామ‌నే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మ‌హారాష్ట్ర‌లో ప్ర‌భుత్వ ఏర్పాటు ఓ కొలిక్కి రావ‌డం లేదు. భార‌తీయ జ‌న‌తా పార్టీ - శివ‌సేన మ‌ధ్య ఎంత‌కూ స‌యోధ్య కుద‌ర‌క‌పోవ‌డంతో ప్ర‌భుత్వ ఏర్పాటుపై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి.

దీంతో ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో బంతి గ‌వ‌ర్న‌ర్ కోర్టులోకి వెళ్లింది. రాష్ట్ర‌ప‌తి పాల‌న విధిస్తార‌ని ఓ వైపు ప్ర‌చారం జ‌రుగుతున్నా ఆ అవ‌కాశం లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

మొద‌ట ప్ర‌భుత్వ ఏర్పాటుకు అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీని గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానించే అవ‌కాశం ఉంది. త‌ర్వాత అసెంబ్లీలో బ‌లం నిరూపించుకోమ‌ని ఆదేశించ‌వ‌చ్చు.

అంత‌లోగా బీజేపీ - శివ‌సేన మ‌ధ్య ఓ అవ‌గాహ‌న కుద‌రొచ్చు. ఒక‌వేళ అలా కుద‌ర‌క‌పోతే బీజేపీ ఏం చేస్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. బీజేపీ ఆప‌రేష‌న్‌కు చిక్క‌కుండా శివ‌సేన ముందు జాగ్ర‌త్త‌గా త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను హోట‌ల్‌కు త‌ర‌లించి క్యాంపు నిర్వ‌హిస్తోంది.

ముఖ్య‌మంత్రి ప‌ద‌వీకాలాన్ని చేరి స‌గం పంచుకోవాల‌ని శివ‌సేన డిమాండ్ చేస్తోంది. మొద‌టిసారి ఎమ్మెల్యే అయిన త‌న 29 ఏళ్ల కుమారుడు అధిత్య థాక్రేను ముఖ్య‌మంత్రిని చేసి శివ‌సైనికుడిని ముఖ్య‌మంత్రిని చేస్తాన‌ని త‌న తండ్రి బాల్ థాక్రేకు ఇచ్చిన మాట‌ను నిలుపుకోవాల‌ని శివ‌సేన అధ్య‌క్షుడు ఉద్ధ‌వ్ థాక్రే భావిస్తున్నారు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల ముందు బీజేపీ 50 50 ఫార్ములాకు అంగీక‌రించింద‌ని శివ‌సేన గుర్తు చేస్తోంది.

అయితే, ఈ ఫార్ములా ఏమీ లేద‌ని, శివ‌సేన‌కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇచ్చేది లేద‌ని బీజేపీ కంక‌ణం క‌ట్టుకొని కూర్చుంది. కానీ, 288 సీట్లు ఉన్న మ‌హారాష్ట్ర అసెంబ్లీలో కేవ‌లం 56 సీట్లు ఉన్న శివ‌సేన ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ఆశిస్తుండ‌టం అత్యాశ‌గానే క‌నిపిస్తోంది. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో క‌లిసి అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని సైతం శివ‌సేన ప్ర‌య‌త్నిస్తోంది.

మ‌రోవైపు ఇప్పుడు కూడా బీజేపీకే ముఖ్య‌మంత్రి పీఠం వ‌దిలేస్తే ఆ పార్టీ రాష్ట్రంలో మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌ని, బీజేపీ ఎంత బ‌ల‌ప‌డితే శివ‌సేన అంత బ‌ల‌హీనం అయ్యే అవ‌కాశం ఉంది.

ఇక‌, ఎప్ప‌టికీ మ‌హారాష్ట్ర‌లో బీజేపీకి తోక‌పార్టీగా శివ‌సేన మిగిలిపోవాల్సి వ‌స్తుందనే భ‌యం శివ‌సేన నేత‌ల్లో ఉంది. అందుకే ఎట్టి ప‌రిస్థితుల్లో రాజీ ప‌డొద్ద‌ని శివ‌సేన భావిస్తోంది.

ఒక‌వేళ ఎన్సీపీ, కాంగ్రెస్‌తో క‌లిసి శివ‌సేన అధికారాన్ని ద‌క్కించుకున్నా ఎంత‌కాలం నిలుస్తుందో చెప్ప‌లేం. త‌క్కువ సీట్లు వ‌చ్చినా క‌ర్ణాట‌క‌లో ముఖ్య‌మంత్రి అయిన కుమార‌స్వామి సంవ‌త్స‌రం తిర‌గ‌కుండా దిగిపోవాల్సి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

థాక్రే కుటుంబం మొద‌టిసారి అధికారం చేప‌ట్టి మ‌ధ్య‌లోనే ప్ర‌భుత్వం ప‌డిపోతే ఆ కుటుంబానికి మ‌రింత అవ‌మానంగా మార‌వ‌చ్చు. దీంతో శివ‌సేన‌కు ముందు నుయ్యి... వెనుక గొయ్యి అన్న‌ట్లుగా ప‌రిస్తితి తయారైంది.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle