త్వరలో మోడీ కేబినెట్ విస్తరణ.. చోటెవరికి? వేటెవరికి?
09-10-201909-10-2019 08:34:27 IST
Updated On 09-10-2019 11:10:18 ISTUpdated On 09-10-20192019-10-09T03:04:27.391Z09-10-2019 2019-10-09T03:03:24.351Z - 2019-10-09T05:40:18.195Z - 09-10-2019

నరేంద్ర మోడీ రెండవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక దూకుడుగా ముందుకెళుతున్నారు. తన పాలనలో లోటుపాట్లు ఏంటో ఆయన బాగా తెలుసుకుంటున్నారు. సరిగా పనిచేయని కేబినెట్ మంత్రులు ఎవరో.. బాగా చేస్తున్నదెవరో ఆయన ఒక అవగాహనకు వచ్చారని తెలుస్తోంది. ఒకటి కంటే ఎక్కువ శాఖలు చూస్తున్న మంత్రులకు అవి భారం అవుతున్నాయి. దీంతో వారికి రిలీఫ్ ఇవ్వాలని, పనిచేయని అమాత్యులను సాగనంపాలని భావిస్తున్నారు. దసరా పండుగ కూడా ముగియడంతో మోడీ మంత్రివర్గ ప్రక్షాళన వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల మూడో వారంలోనే మోడీ తన కేబినెట్ ను విస్తరిస్తున్నారని ఢిల్లీలో అంతా భావిస్తున్నారు. పాలనలో మరిన్ని సంస్కరణల దిశగా మోడీ అడుగులు వేస్తున్నారు. ఈనేపథ్యంలో మోడీ పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు చేయాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. నరేంద్ర మోడీ కేబినెట్ లో ఒకటి కంటే ఎక్కువ శాఖలు చూస్తున్న సృతీ ఇరానీ, రవిశంకర్ ప్రసాద్, హర్షవర్ధన్, ప్రకాష్ జవదేకర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ వంటి వారి దగ్గర అదనంగా ఉన్న వివిధ శాఖలను కొత్త వారిని మంత్రివర్గంలోకి తీసుకొని వారికి అప్పగించాలని మోడీ ఆలోచిస్తున్నారు. అలాగే ఇక ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన సురేష్ ప్రభుకు సమర్థుడిగా పేరుంది. సురేష్ ప్రభును మంత్రివర్గంలోకి తీసుకొని పీయూష్ గోయల్ వద్దనున్న రైల్వే - వాణిజ్య - పరిశ్రమల్లో శాఖల్లో వాణిజ్య - పరిశ్రమలను సురేష్ ప్రభుకు ఇస్తారని అంటున్నారు. ఇక మోడీ కేబినెట్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రివర్గంలో ఎవరికీ చోటివ్వలేదు. జేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తెలుగు వ్యక్తి రాంమాధవ్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని మోడీ డిసైడ్ అయ్యారని అంటున్నారు. బీజేపీలోకి వివిధ పార్టీల నుంచి వలసలను రాంమాధవ్ బాగా ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఆయనకు మరింతగా ప్రాధాన్యత ఇవ్వాలని మోడీ ఆలోచనగా ఉంది. అలాగే కేబినెట్లోకి కొందరు వృత్తి పరమయిన నిపుణులు - ప్రతిభావంతులైన మాజీ అధికారులను కూడా తీసుకునే అంశాన్ని మోడీ పరిశీలిస్తున్నారు. ఇప్పుడు మంత్రివర్గాన్ని విస్తరిస్తే.. మరికొంతకాలం వరకూ మంత్రివర్గ విస్తరణ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. దీని ద్వారా పాలనపై పూర్తిస్థాయిలో పట్టు బిగించవచ్చని అంటున్నారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
6 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
9 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
12 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
3 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
13 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
10 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
13 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
14 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
7 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
16 hours ago
ఇంకా