newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

త్వరలో మోడీ కేబినెట్ విస్తరణ.. ఏపీకి ఛాన్స్ దక్కుతుందా?

12-11-201912-11-2019 08:30:06 IST
Updated On 12-11-2019 08:29:24 ISTUpdated On 12-11-20192019-11-12T03:00:06.060Z12-11-2019 2019-11-12T02:57:18.465Z - 2019-11-12T02:59:24.338Z - 12-11-2019

త్వరలో మోడీ కేబినెట్ విస్తరణ.. ఏపీకి ఛాన్స్ దక్కుతుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్ర ప్రభుత్వం మంచి దూకుడు మీద ఉంది. రెండవసారి ప్రధాని పీఠం అధిరోహించిన తర్వాత మోడీ విప్లవాత్మకమయిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్టికల్ 370రద్దు, కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి స్థానంలో కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటు, ట్రిపుల్ తలాక్, తాజాగా రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బీజేపీ తన వేగం పెంచుతోంది.

అలాగే. అధికారానికి దూరంగా ఉన్నా.. మహారాష్ట్రలో శివసేన -కాంగ్రెస్- ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటుపై ఆచి తూచి స్పందించాలని బీజేపీ నేతలకు సూచనలు అందాయి. మరోవైపు కేంద్రమంత్రి పదవికి శివసేన నేత అరవింద్ సావంత్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

అరవింద్ కేంద్ర భారీపరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖ మంత్రిగా పనిచేశారు. అరవింద్ రాజీనామాతో మంత్రి పదవి ఖాళీ అయింది. ఎన్డీయే నుంచి శివసేన బయటకు రావడంతో మంత్రివర్గంలో మార్పులు గ్యారంటీ అనే సంకేతాలు అందుతున్నాయి.

బీజేపీలోకి వచ్చినప్పటినుంచీ ఏపీలో పార్టీ పటిష్టానికి రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో త్వరలో యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తానని టీడీపీ రాజ్యసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేసినప్పుడే ఆయన ప్రకటించారు.

గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో సుజనా చౌదరి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏపీలో 150 కిలోమీటర్ల మేర గాంధీ సంకల్పయాత్రను నిర్వహించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాష్ నడ్డా కూడా సుజనా పనితీరుపట్ల చాలా సంతృప్తిగా ఉన్నారని.. ఎప్పుడైనా కేంద్రం నుంచి పిలుపు రావచ్చని భావిస్తున్నారు. 

కేంద్రమంత్రివర్గంలో ఎంపీ సుజనా చౌదరికి కీలక పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని ముందుకు నడిపించేందుకు పదవి అవసరమని, తరచూ ఏపీలో పర్యటించి జగన్ ప్రభుత్వ పనితీరుని పరిశీలించేందుకు, విమర్శలు చేసేందుకు కేంద్రమంత్రి పదవి దోహదం చేస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వంలో సుజనా చౌదరికి ప్రాతినిధ్యం కల్పించేందుకు రంగం సిద్ధం చేశారు. రాబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో సుజనా చౌదరికి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కనుంది. ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అయినప్పటికీ.. ఆయన ఎప్పుడూ రాష్ట్రంలోనే ఎక్కువకాలం గడుపుతున్నారు.

సుజనా చౌదరి రాజ్యసభ సభ్యుడు కావడంతో పలుమార్లు ఢిల్లీ చుట్టూ తిరిగేస్తున్నారు. కేంద్రం పెద్దలు, పార్టీ పెద్దలతో కూడా పలుమార్లు సమావేశం అవుతున్నారు.

ఏపీకి రావాల్సిన నిధులు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయనకు అవగాహన ఉంది. ఏపీలో బీజేపీ కి రాజ్యసభ సభ్యులు తప్ప లోక్ సభ ఎంపీలు లేరు. అందునా టీడీపీ నుంచి నలుగురు ఎంపీలు బీజేపీలో చేరడంలో రాజ్యసభలో బీజేపీ బలం కూడా పెరిగింది. టీడీపీ నుంచి ముగ్గురిని బీజేపీలోకి చేర్చడంలో సుజనా పాత్రను బీజేపీ గుర్తించింది.

తరచూ ఏపీలో చంద్రబాబు, జగన్ లపై ఆయన ఘాటైన విమర్శలు చేస్తున్నారు. గత కొంతకాలంగా బీజేపీ క్యాడర్ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో సుజనా చౌదరికి మంత్రి పదవి ఇస్తే సముచితంగా ఉంటుందని కమలనాథులు భావిస్తున్నట్టు సమాచారం. 

 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   an hour ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   43 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

   2 minutes ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle