newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

త్వరలో జాతీయ జనాభా పట్టిక రూపకల్పన.. కేబినెట్ కీలక నిర్ణయం

24-12-201924-12-2019 15:53:19 IST
2019-12-24T10:23:19.987Z24-12-2019 2019-12-24T10:22:28.701Z - - 23-04-2021

త్వరలో జాతీయ జనాభా పట్టిక రూపకల్పన.. కేబినెట్ కీలక నిర్ణయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ అయింది. పలు కీలకాంశాలపై నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక తయారుచేయాలని నిర్ణయించింది. దేశమంతటా సీఏఏ, ఎన్‌ఆర్‌సీ నిరసనలు, ఆందోళనలు జరుగుతున్న వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక తయారీ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది.

ఇందుకు రూ. 8700 కోట్ల నిధులను కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియా సమావేశంలో తెలిపారు.

బ్రిటిష్ కాలంలో సమగ్ర జనాభా పట్టిక తయారైందని, ఇన్నేళ్ళ తర్వాత తాజాగా ఈ జనగణన అవసరం అన్నారు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్. తొలుత ఎన్‌పీఆర్​ను రూపొందించి ఆ తర్వాత ఎన్​ఆర్​సీ అమలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది.  ఒకసారి ఎన్‌పీఆర్​ తయారైన తరువాత దాని ఆధారంగా నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ రూపొందించనుంది.

దేశంలోని నిజమైన పౌరుల వివరాలు సేకరించడమే ఎన్‌పీఆర్‌ లక్ష్యం అని కేంద్రం ప్రకటించింది. ప్రజలందరి వేలి ముద్రలు సేకరించడం, అందరికీ పౌరసత్వ గుర్తింపు కార్డులు ఇస్తారు. అసోం మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 2020 ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య ఎన్‌పీఆర్ ప్రక్రియ జరగనుంది. డేటాబేస్‌లో జనాభాతో పాటు బయోమెట్రిక్ వివరాలు కూడా ఉంటాయని పేర్కొంది.

ఈ జనాభా పట్టిక రూపకల్పనకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైందని, ఈ జనాభా పట్టిక తయారీకి అవసరమయిన సిబ్బంది నియామకం కొనసాగుతుందన్నారు. ఈ పట్టిక వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదని మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా ఈ పట్టిక తయారవుతుందన్నారు. 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   3 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   39 minutes ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   6 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle