newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తేనెతుట్టెను క‌దిపారు..! నెక్ట్స్ టార్గెట్ అదేనా..?

16-09-201916-09-2019 11:52:02 IST
2019-09-16T06:22:02.467Z16-09-2019 2019-09-16T06:22:00.805Z - - 20-04-2021

తేనెతుట్టెను క‌దిపారు..! నెక్ట్స్ టార్గెట్ అదేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెండోసారి తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వ‌చ్చిన కేంద్ర ప్ర‌భుత్వం దూకుడుగా నిర్ణ‌యాలు తీసుకుంటోంది. సంఖ్యాబ‌లం దండిగా ఉండ‌టంతో ఎంత‌టి కీల‌క‌మైన నిర్ణ‌య‌మైనా ధైర్యంగా తీసుకుంటోంది. ఈ నేప‌థ్యంలోనే ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు, క‌శ్మీర్ విభ‌జ‌న చేసింది. దీని త‌ర్వాత బీజేపీ స‌ర్కార్ నెక్ట్స్ టార్గెట్ ఏంటి అనే దానిపై అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఉమ్మ‌డి పౌరస్మృతి తీసుకురావాల‌నే ఆలోచ‌న ఉన్న‌ట్లు అంతా భావించారు.

కానీ, హిందీ దివస్ సంద‌ర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అధ్య‌క్షులు అమిత్ షా చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఒకే దేశం - ఒకే భాష నినాదాన్ని చెప్పిన ఆయ‌న దేశం మొత్తం హిందీని జాతీయ భాషగా చేసుకోవాల‌నే త‌న ఆకాంక్ష‌ను బ‌య‌ట‌పెట్టారు. ఇది గాంధీ, స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ ఆశ‌యం అని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ ఆశ‌యం అని బీజేపీ ఏదైనా చెప్పిందంటే ఆ అంశాన్ని ఆ పార్టీ క‌చ్చితంగా అమ‌లు చేయాల‌నే ఆలోచ‌న‌తో ఉంటుంద‌నేది తెలిసిందే.

అమిత్ షా వ్యాఖ్య‌లు దేశంలో సంచ‌ల‌నంగా మారాయి. ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను ద‌క్షిణాధి రాష్ట్రాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. ముఖ్యంగా హిందీని త‌మ‌పై ర‌ద్ద‌డాన్ని అస్స‌లు స‌హించని త‌మిళ‌నాడులోని పార్టీలు అమిత్ షా వ్యాఖ్య‌ల‌పై మండిప‌డ్డాయి. షా వ్యాఖ్య‌లు దేశ స‌మ‌గ్ర‌త‌ను దెబ్బ తీసేలా ఉన్నాయ‌నే స్టార్ ఆరోపించారు.

బీజేపీ మిత్ర‌ప‌క్షం అన్నా డీఎంకే స‌హా అన్ని ద్ర‌విడ పార్టీలూ షా వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్టాయి. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్‌, జేడీఎస్ కూడా హిందీని బ‌ల‌వంతంగా రుద్ద‌డం స‌రికాద‌ని స్ప‌ష్టం చేశారు. కేర‌ళ ముఖ్య‌మంత్రి విజ‌యన్ సైతం షా వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ సైతం హిందీని రుద్ద‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసింది. హిందీ కంటే ఇండియా గొప్ప‌ద‌ని ఎంఐఎం అధినేత అస‌దుద్దిన్ ఓవైసీ స్ప‌ష్టం చేశారు.

అయితే, హిందీని జాతీయ భాష‌గా మార్చుకోవాల‌నే అమిత్ షా వ్యాఖ్య‌లు తేనెతుట్టేను క‌దిపిన‌ట్లే క‌నిపిస్తోంది. విభిన్న సంస్కృతులు, భాష‌ల స‌మ్మేళనం అయిన భార‌త్‌లో జాతీయ భాష అనేది రాజ్యాంగం ఏమీ నిర్వ‌చించ‌లేదు. హిందీని అధికారిక భాష‌గా మాత్ర‌మే చెప్పింది. అప్ప‌ట్లోనే త‌మిళ‌నాడులో ఆందోళ‌న‌లు జ‌ర‌గ‌డంతో ఇంగ్లీష్‌ను కూడా అధికారిక భాష‌గా నిర్ణ‌యించారు. దీంతో మొత్తం 22 భాష‌ల‌ను అధికారిక భాష‌లుగా గుర్తించారు.

అయితే, మెజారిటీ ప్ర‌జ‌లు(దేశ జ‌నాభాలో 44 శాతం మంది) మాట్లాడే భాష‌ను జాతీయ భాష‌గా చేసుకుంటే విదేశీ భాష‌లు, సంస్కృతుల ప్ర‌భావం త‌గ్గించుకోవ‌చ్చ‌న్న‌ది కేంద్రం ఆలోచ‌న‌గా చెబుతున్నారు. హిందీ దేశాన్ని ఒక్క‌టి చేస్తుంద‌ని అమిత్ షా చెప్పారు. అయితే, హిందీని జాతీయ భాష‌గా ఎట్టి ప‌రిస్థితుల్లో ద‌క్షిణాధి రాష్ట్రాలు ఒప్పుకునే ప్ర‌స‌క్తే లేదు. ప్ర‌త్యేకించి త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు, పార్టీలు హిందీని ర‌ద్దితే స‌హించ‌వు.

ఇందుకు ఆ రాష్ట్రంలో గ‌తంలో జ‌రిగిన హిందీ వ్య‌తిరేక ఉద్య‌మాలే ఉదాహ‌ర‌ణ‌. 1937లో అప్ప‌టి మ‌ద్రాస్ ప్ర‌భుత్వం హిందీని పాఠ‌శాల‌ల్లో త‌ప్ప‌నిస‌రి చేస్తేనే త‌మిళులు తీవ్రంగా వ్య‌తిరేకించారు. రాజ్యాంగాన్ని రూపొందించే స‌మ‌యంలోనూ హిందీని మాత్ర‌మే అధికారిక భాషగా గుర్తించే ఆలోచ‌న‌ను విర‌మించుకునేలా పోరాడారు. 1965లో మ‌ళ్లీ హిందీని ఏకైక అధికారిక భాష చేయాల‌నే ఆలోచ‌న‌ను కూడా వ్య‌తిరేకించారు. ఇప్పుడు కూడా త‌మిళ‌నాడు స‌హా ద‌క్షిణాధి రాష్ట్రాలు బెంగాల్ వంటి ఇత‌ర రాష్ట్రాలు హిందీని జాతీయ భాష చేస్తామంటే తీవ్రంగా వ్య‌తిరేకిస్తాయి. మ‌రి, కేంద్రం ఈ విష‌యంలో ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి.

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   13 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   12 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   17 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   18 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   14 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   21 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   21 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   13 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   15 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   21 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle