newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలుగు రాష్ట్రాల బాటలో మహారాష్ట్ర.. పేదల కోసం పథకం

28-01-202028-01-2020 09:25:44 IST
Updated On 28-01-2020 11:07:41 ISTUpdated On 28-01-20202020-01-28T03:55:44.113Z28-01-2020 2020-01-28T03:54:50.419Z - 2020-01-28T05:37:41.908Z - 28-01-2020

తెలుగు రాష్ట్రాల బాటలో మహారాష్ట్ర.. పేదల కోసం పథకం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పేద‌ల ప్ర‌జ‌ల కోసం మ‌హారాష్ట్ర‌లోని ఉద్ద‌వ్ థాకరే ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది..కొత్తగా 'శివ భోజన్' కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని 10 రూపాయలకే కడుపునిండా భోజనాన్ని అందిస్తామంటున్నారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే. 

తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఇవి ప్రారంభమవుతాయని, ఆపై రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని  సీఎం ఉద్ధవ్ థాక్రే తెలిపారు. ఈ పథకాన్ని ప్రవేశపెడతామని శివసేన పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. దానిని అమలుచేయడానికి రెడీ అవుతోంది.

ఇలాంటి పథకం ఇప్పటికే తెలంగాణ. ఏపీల్లో అమలవుతోంది. ఏపీలో చంద్రబాబు హయాంలో అన్న క్యాంటీన్లు తక్కువధరకే భోజనం అందించి, వారి ఆకలి తీర్చాయి. అయితే కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీటిని మూసివేసింది.

అక్కడక్కడా రాజన్య క్యాంటీన్లు నడుస్తున్నాయి. ఇటు తెలంగాణలో రూ.5కే అన్నపూర్ణ పథకం అమలవుతోంది. రోజూ లక్షలాదిమంది ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. బస్తీలు, పేదప్రజలు, భవన నిర్మాణ కార్మికులు ఎక్కువగా ఉండే చోట వీటిని ఏర్పాటుచేశారు. వీటి ద్వారా నాణ్యమయిన ఆహారం అందుతోంది. ధరలు ఆకాశాన్నంటుతున్న ఈరోజుల్లో 5 రూపాయలకే ఆహారం అందించడం అభినందనీయం. 

ఈ తరహాలోనే మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 10కే ఆహారం అందించేందుకు ముందుకు వచ్చింది. ఎన్నికల తరువాత కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి 'మహా అఘాడీ' ప్రభుత్వం ఏర్పాటు కాగా, మేనిఫెస్టోలోని అంశాలను ఒక్కొక్కటీ అమలు చేసే దిశగా ఉద్ద‌వ్ థాకరే ప్ర‌భుత్వం కదులుతోంది.

అయితే ఈ భోజనం చేయాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి చేయబోతోంది. అయితే అవన్నీ పుకార్లేనని మంత్రి భుజ్ బల్ ఖండించారు. ఎటువంటి గుర్తింపు కార్డునూ చూపకుండా పేదలు కడుపు నింపు కోవచ్చని మంత్రి  అన్నారు. మొత్తం మీద ఈ పథకం ఎంతోమంది అన్నార్తులకు ఆసరాగా నిలవనుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle