newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల గతి ఏమిటి? నిలదీసిన ఉపరాష్ట్రపతి

15-02-202015-02-2020 11:40:53 IST
Updated On 15-02-2020 11:52:47 ISTUpdated On 15-02-20202020-02-15T06:10:53.614Z15-02-2020 2020-02-15T06:10:47.520Z - 2020-02-15T06:22:47.022Z - 15-02-2020

తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల గతి ఏమిటి? నిలదీసిన ఉపరాష్ట్రపతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజకీయ జీవితం విరమించి రాజ్యాంగ అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉపరాష్ట్రపతి పదవిలో ఉంటున్నప్పటికీ తెలుగు బిడ్డ వెంకయ్య నాయుడు తెలుగు రాష్ట్రాలపై తన మమకారాన్ని దాచుకోవడం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా కేంద్ర మంత్రులను తనవద్దకు రప్పించుకుంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిపాదిత కేంద్ర ప్రాజెక్టుల అమలు గురించి సమాచారం వాకబు చేస్తున్నారు. పనుల్లో జాప్యానికి కారణమేమిటని కేంద్రమంత్రులను నేరుగా నిలదీస్తున్నారు. 

రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కేంద్రమంత్రులను తమ నివాసానికి రప్పించుకుని ప్రాజెక్టుల అతీగతీపై వాకబు చేయడంపై మంత్రులు ఆశ్చర్యపోతున్నప్పటికీ వెంకయ్య నాయుడు తన శైలిని మార్చుకోకుండా తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న ప్రాజెక్టుల వ్యవహారాలను సమీక్షిస్తూ కేంద్రమంత్రులకు, అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.

తాజాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రతిపాదించిన పరిశ్రమలు, ఇండస్ట్రియల్ కారిడార్ల నిర్మాణం పనిని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య, భారీ పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్‌కు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. శుక్రవారం ఉప రాష్ట్రపతి నివాసంలో కేంద్ర మంత్రితోపాటు వాణిజ్య శాఖ కార్యదర్శి, భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శులతో జరిగిన సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపాదిత ప్రాజెక్టుల పనితీరును వెంకయ్య నాయుడు అడిగి తెలుసుకున్నారు.

విశాఖపట్టణం-చిత్తూరు మధ్య పారిశ్రామిక కారిడార్ పనుల గురించి, కాకినాడలో ఏర్పాటుచేయ సంకల్పించిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ)పైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. గుంటూరులోని ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో సమన్వయం చేసుకుంటూ గుంటూరు జిల్లాలో స్పైస్ పార్క్ ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సూచించారు.

అలాగే, తెలంగాణలోని హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్, హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌పైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలో ప్రతిపాదించిన ఫార్మాసిటీ అంశంపైనా ఉపరాష్ట్రపతి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులకు వాటికి నిర్దేశించి సమయంలోగా పూర్తిచేయాలని ఉపరాష్ట్రపతి ఆదేశించారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి ప్రాజెక్టుల వ్యవహారంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకోవాలని మంత్రికి సూచించారు. దీనికి మంత్రి, రెండు శాఖల కార్యదర్శులు సమాధానమిస్తూ.. వీలైనంత త్వరగా పూర్తిచేసేలా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి ముందడుగేస్తామన్నారు.

మాతృభూమిపై మమకారాన్ని వదలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన అధికార హోదాను ఉపయోగించుకుని తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగించడం ముదావహం. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   13 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   9 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   12 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   16 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   19 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   20 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle