తెలుగు రాష్ట్రాలపై కాంగ్రెస్ పార్టీకి మరీ ఇంత చిన్నచూపా..?
13-09-202013-09-2020 10:42:47 IST
2020-09-13T05:12:47.819Z13-09-2020 2020-09-13T05:12:44.294Z - - 15-04-2021

నాయకత్వ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన మొదలైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని కొత్తగా నియమించింది. వివిధ రాష్ట్రాలకు కొత్తగా ఏఐసీసీ ఇంఛార్జ్‌లను వేసింది. పలువురు వృద్ధ నేతలను ఇంటికి పంపించారు. యువ నేతలకు ప్రాధాన్యం ఇచ్చారు. నాయకత్వలోపంపై సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది పార్టీ సీనియర్లకు చెక్ పెట్టారు. ఇలా రకరకాల ఈక్వేషన్లతో సోనియా గాంధీ కొత్త నియామకాలు చేపట్టారు. అయితే, ఈ నియామకాల్లో తెలుగు రాష్ట్రాల కు చెందిన నాయకులకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండేది. గ్రామగ్రామాన కాంగ్రెస్‌కు క్యాడర్ ఉండేది. యూపీఏ ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి రావడానికి ఉమ్మడి ఏపీ నుంచి గెలిచిన ఎంపీలు ప్రధాన కారణం. జాతీయ స్థాయిలోని కాంగ్రెస్‌లో తెలుగు నేతలకు మంచి స్థానం ఉండేది. కేంద్ర మంత్రులుగా కూడా తెలుగువారికి ఎక్కువగా అవకాశం వచ్చేది. పలువురు తెలుగు నేతలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కూడా పని చేశారు. ఒకప్పుడు తెలుగు వారికి ఇంత ప్రాధాన్యత ఇచ్చిన కాంగ్రెస్‌లో ఇప్పుడు చిన్న చూపు మొదలైందా అనే విశ్లేషణలు వస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నియామకాల్లో తెలుగువారికి చోటు లేకపోవడమే ఇందుకు కారణం. కీలకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని 22 మంది సభ్యులతో నియమించారు. వీరిలో మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి కీలక నేతలు ఉన్నారు. ఇంతకముందు సీడబ్లూసీలో వెంకటస్వామి వంటి తెలుగు నేతలు ఒక్కరైనా ఉండేవారు. కానీ, గతసారి, ఇప్పుడు ఒక్కరంటే ఒక్క తెలుగు నేతకు కూడా వర్కింగ్ కమిటీలో అవకాశం కల్పించలేదు. మరో 26 మంది శాశ్వత ఆహ్వానితులను సైతం నియమించారు. ఇందులో దిగ్విజయ్ సింగ్, అధిర్ రంజన్ చౌదరి, జైరాం రమేష్ వంటి నేతలు ఉన్నారు. ఇందులోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఒక్క నేతకు ఛాన్స్ ఇవ్వలేదు. సీడబ్లూసీ ప్రత్యేక ఆహ్వానితులుగా మరో తొమ్మిది మందిని నియమించారు. ఇందులో మాత్రం తెలంగాణ నుంచి ఒకరికి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరికి ఛాన్స్ ఇచ్చారు. తెలంగాణ నుంచి ఏఐటీయూసీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జి.సంజీవరెడ్డికి, ఏపీ నుంచి తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్‌కు అవకాశం ఇచ్చారు. సంజీవరెడ్డి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. వివిధ రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జిలుగా 9 మంది ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులను నియమించారు. 17 మంది కార్యదర్శులను పలు రాష్ట్రాలకు ఇంఛార్జిలుగా వేశారు. వీరిలోనూ ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు లేరు. అంటే తెలుగు నేత ఒక్కరు కూడా ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ఇంఛార్జిగా ఉండరు. ఈ నియామకాలు చూస్తే తెలుగు రాష్ట్రాలకు పార్టీ పదవుల్లో చిన్నచూపు చూసిందనేది స్పష్టమవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నామమాత్రంగా తయారైంది. అయినా కూడా కేవీపీ రామచంద్రరావు, సుబ్బిరామిరెడ్డి, పల్లంరాజు, సాయిప్రతాప్ వంటి సీనియర్ నేతలు ఇంకా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఉంటున్నారు. వీరికి ఎవరికి జాతీయ కాంగ్రెస్‌లో చోటిచ్చే ప్రయత్నం చేయలేదు పార్టీ అధిష్ఠానం. రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొంత బలంగానే ఉంది. అనేక మంది నాయకులు ఉన్నారు. ముగ్గురు ఎంపీలు విజయం సాధించారు. రాష్ట్రంలో అధికారం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతోంది. కానీ, పార్టీ పదవుల్లో అయితే తెలంగాణను నిర్లక్ష్యం చేశారు. ఇప్పటికే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి జాతీయ స్థాయి కాంగ్రెస్‌లో మంచి పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ, ఆయనకు ఏ పదవీ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ నామమాత్రం, బలహీనంగా ఉన్న రాష్ట్రాలకు చెందిన నేతలకు కూడా ఈ కమిటీల్లో మంచి ప్రాధాన్యత దక్కింది. మరి, తెలుగు రాష్ట్రాల నేతలకు ఎందుకు ఇవ్వలేదని చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలతో తమకు ఉపయోగం లేదని కాంగ్రెస్ అధిష్ఠానం భావించి ఉండాలి. లేదా తెలుగు రాష్ట్రాల్లో సీడబ్లూసీ సభ్యులుగా, ఇతర రాష్ట్రాలకు ఇంఛార్జిలుగా పని చేసే సామర్థ్యం ఉన్న నేతలు ఎవరూ లేరని సోనియా గాంధీ భావించి ఉండాలి.

నా రూటే సెపరేటు
17 minutes ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
14 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
15 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
14 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
18 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
19 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
18 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
20 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
21 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
16 hours ago
ఇంకా