తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది.. జగన్, కేసీఆర్‌తో ప్రధాని ఆరా
20-07-202020-07-2020 07:23:24 IST
2020-07-20T01:53:24.057Z20-07-2020 2020-07-20T01:51:42.339Z - - 11-04-2021

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజా పరిస్థితులపై ఆరా తీశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదివారం ఫోన్ చేసి కరోనా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు మోదీ ఫోన్ చేశారు. కరోనా తీవ్రత, కట్టడికి చేపడుతున్న నివారణ చర్యలు, పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. అలాగే వైరస్‌ను నివారించుటకు పలు సూచనలు, సలహాలు సైతం చేశారు. జగన్‌కు ప్రధాని ఫోన్ ప్రధాని మోదీ ఆదివారం నాడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫోన్ చేశారు. దేశంలోనూ.. రాష్ట్రంలోనూ నానాటికి కరోనా కేసులు పెరిగిపోతుండడంతో.. కట్టడికి ఏం చేయాలో పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యల గురించి ఆరా తీశారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో దేశంలోనే ముందున్నామని ఈ సందర్భంగా జగన్ ఆయనకు తెలిపారు. క్వారంటైన్ సెంటర్లు, ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని.. బాధితులకు సరిపడా బెడ్లు సిద్ధం చేశామని చెప్పారు. కరోనా పరీక్షలను రికార్డు స్థాయిలో నిర్వహిస్తున్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు మోదీ అభినందనలు తెలిపారు. కాగా.. దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి పెరుగుతుండడంతో మరోసారి లాక్డౌన్ విధించే అవకాశాలపైనా ఉభయులూ చర్చించినట్లు తెలిసింది. కేసీఆర్‌కు ప్రధాని ఫోన్.. తెలంగాణలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి దాని కట్టడికి తీసుకుంటున్న చర్యల గురించి సీఎం కేసీఆర్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితి, ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి ప్రధానికి సీఎం కేసీఆర్ వివరించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో రాష్ట్రాల్లోని పరిస్థితులపై ఆయా సీఎంలతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతున్న ప్రధాని.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బిహార్, అసోం, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ సీఎంలతో ఆదివారం మాట్లాడారు. జగన్‌తోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మరోవైపు వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న బిహార్, అసోం, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల సీఎంలతో ప్రధాని ముచ్చటించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరదలు ముంచెత్తుతున్న అసోంను అన్ని విధాలా అదుకుంటామని ఆ రాష్ట్ర సీఎం సర్బానంద సోనోవాల్‌తో ప్రధాని స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌తో మాట్లాడుతూ.. కరోనా సోకిన సైనికుల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. తమిళనాడు సీఎం పళనిసామితో కూడా మోదీ ఫోన్లో మాట్లాడారు. ఆ రాష్ట్రంలోని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సహకరిస్తామని చెప్పారు. కాగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 10,77,618కి చేరింది. దీంతో పలు రాష్ట్రాలు మళ్లీ లాక్డౌన్ మంత్రాన్ని పాటిస్తున్నాయి. గత 24 గంటల్లోనే 39 వేల కేసులు నమోదు కావడంతో భారత్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11 లక్షలకు చేరుకుంది. ఇంకా 3.73 లక్షల యాక్టివ్ కేసులు ఉండగా ఇంతవరకు 6.77 లక్షల మంది ప్రజలు దేశవ్యాప్తంగా కరోనా నుంచి స్వస్థత పొందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా దేశంలో ఇంతవరకు 27 వేలమంది కరోనా బారిన పడి మరణించారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
5 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
8 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
11 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
an hour ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
11 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
9 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
12 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
12 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
6 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
15 hours ago
ఇంకా