newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

తెలంగాణ సర్కార్ పై బీసీ కమిషన్ వత్తిడి పనిచేస్తుందా?

20-10-201920-10-2019 09:37:21 IST
2019-10-20T04:07:21.491Z20-10-2019 2019-10-20T04:07:12.650Z - - 25-05-2020

తెలంగాణ సర్కార్ పై బీసీ కమిషన్ వత్తిడి పనిచేస్తుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జాతీయస్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను తెలంగాణ ప్రభుత్వం అంత సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై జాతీయ బీసీ కమిషన్‌ స్పందించింది.

సమ్మెలోకి వెళ్ళిన కార్మికులంతా సెల్ఫ్‌ డిస్మిస్‌ అంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనపై బీసీ కమిషన్ వివరణ కోరింది.15 రోజులుగా రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నారు. సమ్మె నివారణకు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో రాష్ట్రంలోని విపక్ష పార్టీలు, విద్యార్థి, కార్మిక సంఘాలన్నీ ఏకమై ఆందోళనలను పెంచాయి.

కొద్ది రోజుల క్రితం మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనకు వెళ్ళిన జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారికి కొంత మంది ఆర్టీసీకి చెందిన బీసీ ఉద్యోగులు కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమను ఉద్యోగం నుంచి తీసేసినట్లు ప్రకటించి మానసిక క్షోభకు గురి చేస్తోందంటూ ఫిర్యాదు చేశారు. 

సెల్ఫ్‌ డిస్మిస్‌ అంటూ సీఎం చేసిన ప్రకటనతో దాదాపు 20 వేల మంది బీసీ ఉద్యోగులకు అన్యాయం జరిగిందని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమర్పించిన వినతి పత్రంపై జాతీయ బీసీ కమిషన్‌ అధికారులతో చర్చించింది. వెంటనే చర్యలకు ఉపక్రమించింది.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్‌ జోషీతో పాటు ఆర్టీసీ ఎండీకి శనివారం నోటీసులను జారీ చేసింది.

20 వేల మందిని ఏకపక్షంగా బీసీ ఉద్యోగులను తొలగించామంటూ ప్రకటించడం దారుణమని, తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. పూర్తి నివేదికతో ఈ నెల 25 న సీఎస్‌, ఎండీలు స్వయంగా ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

ఈ నెల 25 న సీఎస్‌, ఎండీల నివేదికలను పరిశీలించిన తర్వాత భవిష్యత్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి. ఇటు హైకోర్టు-ఇటు బీసీ కమిషన్ వత్తిడితో కేసీఆర్ సర్కార్ ఏం చేస్తుందో చూడాలి. 

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   16 hours ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   18 hours ago


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   19 hours ago


లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

   19 hours ago


డోసు పెంచిన కమలనేతలు.. ప్రభుత్వంపై గవర్నరుకు ఫిర్యాదు!

డోసు పెంచిన కమలనేతలు.. ప్రభుత్వంపై గవర్నరుకు ఫిర్యాదు!

   19 hours ago


ప్రయాణికులకు గుడ్ న్యూస్.... తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ కౌంటర్లివే

ప్రయాణికులకు గుడ్ న్యూస్.... తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ కౌంటర్లివే

   19 hours ago


శ్రీవారి అస్తులకే ఎసరు.. అమ్మకానికి సిద్ధమైన టీటీడీ!

శ్రీవారి అస్తులకే ఎసరు.. అమ్మకానికి సిద్ధమైన టీటీడీ!

   19 hours ago


చరిత్రలో కలిసిపోయిన మూడులాంతర్ల స్థూపం.. విమర్శల పర్వం

చరిత్రలో కలిసిపోయిన మూడులాంతర్ల స్థూపం.. విమర్శల పర్వం

   23-05-2020


వరద రోజుల్లో వాడుకున్న నీటిని కోటాలో కలిపేస్తారా.. కృష్ణా బోర్డుపై ఏపీ గుస్సా

వరద రోజుల్లో వాడుకున్న నీటిని కోటాలో కలిపేస్తారా.. కృష్ణా బోర్డుపై ఏపీ గుస్సా

   23-05-2020


ఇప్పుడు జూనియ‌ర్‌పైనే ఆశ‌లు పెంచుకుంటున్నారా..?

ఇప్పుడు జూనియ‌ర్‌పైనే ఆశ‌లు పెంచుకుంటున్నారా..?

   23-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle