newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెరపైకి హాంకాంగ్ మోడల్.. మోడీ అదే అమలుచేస్తారా?

30-04-202030-04-2020 08:24:23 IST
Updated On 30-04-2020 08:45:54 ISTUpdated On 30-04-20202020-04-30T02:54:23.201Z30-04-2020 2020-04-30T02:54:16.954Z - 2020-04-30T03:15:54.880Z - 30-04-2020

తెరపైకి హాంకాంగ్ మోడల్.. మోడీ అదే అమలుచేస్తారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో లాక్ డౌన్ పరిస్థితి ఏంటి?

మరోమారు పొడిగింపు వుంటుందా? 

మోడీ ఏం ఆలోచిస్తున్నారు? 

రాష్ట్రాలు ఏమంటున్నాయి? 

తెలంగాణలో మే7 వరకూ లాక్ డౌన్.. తర్వాత?

ఏపీలో పెరుగుతున్న కేసులతో లాక్ డౌన్ పొడిగింపే?

హాంకాంగ్ మోడల్ ఏంటి? మోడీ ఏంచేయబోతున్నారు? 

కరోనా ఉధృతి లేనిచోట మరిన్ని సడలింపులు వుంటాయా? 

భారత్ లో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. రెండుపర్యాయాలు లాక్ డౌన్ విధించారు. మరో మూడురోజుల్లో కరోనా లాక్ డౌన్ ముగియబోతోంది. ఈ నేపథ్యంలో మోడీ మదిలో ఏముందనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. భారత్‌లో హాంకాంగ్‌ మోడల్‌ అమలు చేస్తారా..? లాక్‌డౌన్‌ ఎత్తేసేందుకు హాంకాంగ్‌ వ్యూహాన్ని అనుసరిస్తారా... హాంకాంగ్ మోడల్‌పై ప్రధాని ఆసక్తి చూపిస్తున్నారనే వార్తలతో ఆ మోడలేంటనే ఆసక్తి పెరిగింది. అసలు హాంకాంగ్ కరోనా వైరస్ ని ఎలా నియంత్రించింది. 

మే 3 సమీపిస్తోంది. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ ముగిసేందుకు మరికొన్ని రోజులే మిగిలున్నాయి. గడువు దగ్గరపడే కొద్దీ ప్రజల్లో ఒక రకమైన భావోద్వేగం కలుగుతోంది. ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయంపై ఉత్కంఠ పెరుగుతోంది.లాక్‌డౌన్‌ మళ్లీ పొడగిస్తారా? దశల వారీగా ఆంక్షలు ఎత్తివేస్తారా? నిష్ర్కమణ విధానం ఏంటి? తరహా అంశాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ప్రజల ప్రాణాలు, ఆర్థిక వ్యవస్థ రెండూ ముఖ్యమే అంటున్న ప్రభుత్వం ఇంకా స్పష్టతనివ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ అమలు చేయని ‘హాంకాంగ్‌ మోడల్‌’ను భారత్‌ అనుకరిస్తుందా? మోడీ దానినే అనుసరిస్తారా? ఇప్పుడంతా ఇదే చర్చ సాగుతోంది. 

ఇప్పుడు హాంకాంగ్ మోడల్ పై ప్రపంచ దేశాల ఆసక్తి చూపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ ముగిశాక దశల వారీగా ఆంక్షలు సడలించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉందని సమాచారం. భారీగా గుమిగూడటం, ప్రార్థనా మందిరాలు, సినిమా థియేటర్లు, ఫంక్షన్‌ హాళ్లపై నిషేధం అమల్లోనే ఉండనుందని తెలుస్తోంది. ఇక ప్రజా రవాణాకూ అనుమతించకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. భారత్‌ మాత్రమే కాకుండా చాలా దేశాలు లాక్‌డౌన్‌ను ఎలా సడలించాలా అన్న సందిగ్ధంలో పడ్డాయి. ఇప్పటికే అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో నిబంధనలు సులభతరం చేశారు. ఐరోపా దేశాల్లోనూ ఆంక్షల రద్దుపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్‌ అమలు చేయకుండా కరోనాను కట్టడి చేయడంలో సక్సెస్ అయిన ‘హాంకాంగ్‌ మోడల్‌’పై  అందరి దృష్టి పడింది.

చైనా నుంచి మొదట కరోనా వైరస్‌ సోకిన దేశాల్లో హాంకాంగ్‌ కూడా ఒకటి. జనవరి 23న తొలి కేసు అక్కడ నమోదైంది. మార్చి 2న కేసుల సంఖ్య 100కు చేరింది. ప్రస్తుతం 1038 కేసులు నమోదవ్వగా నలుగురు మరణించారు. 75 లక్షల జనాభా కలిగిన హాంకాంగ్‌ లాక్‌డౌన్ అమలు చేయకుండానే కరోనాపై విజయం సాధించింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు హాంకాంగ్‌ పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసుకుంది. ముందు నుంచీ కొవిడ్‌-19 బాధితుల్ని వెతికి పట్టుకుంది. అందరికీ టెస్టులు చేసి మరీ వారిని క్వారంటైన్ చేసింది.

లాక్ డౌన్ వేళ హాంకాంగ్ కఠినచర్యలు అమలుచేసింది. ఎక్కువ మంది గుమిగూడితే భారీగాజరిమానాలు విధించింది. ఫిబ్రవరిలోనే చైనాతో సరిహద్దులు మూసేసింది. విదేశీయులకు 14 రోజుల క్వారంటైన్‌  అమలు చేసింది. పాఠశాలలు మూసేసింది. ప్రజా రవాణా బంద్‌ చేసింది. బయట ఎక్కువ మంది తిరగకుండా ఆంక్షలు అమలు చేసింది. దీంతో మార్చి 31కి అక్కడ 715 కేసులు నమోదయ్యాయి. సార్స్ వైరస్ వంటి మహమ్మారిల నుంచి రక్షించుకునేందుకు గత అనుభవాల నేపథ్యంలో పౌరులు ప్రభుత్వానికి పూర్తిగా సహకరించారు. మార్చి మొదటి వారం నుంచే గుంపులుగా చేరడం మానేశారు. పౌరులంతా మాస్క్‌లు ధరించాలని ముమ్మరంగా ప్రచారం చేసింది. ఈ సలహాను ప్రజలు పాటించారు. ఈ విధానాలే హాంకాంగ్‌ను కరోనా నుంచి బయటపడింది. 

అయితే కరోనానుంచి బయటపడేందుకు భారత్ లాక్ డౌన్ వ్యూహం అమలుచేసింది. మార్చి 2న కేసులు సంఖ్య 5. భారత్‌ సువిశాల దేశం, అత్యధిక జనాభా ఉండటంతో చైనా వ్యూహాన్నే అనుసరించింది. సంపూర్ణంగా లాక్‌డౌన్‌ ప్రకటించింది. అక్కడ పరిశ్రమలన్నీ మూసేసినప్పటికీ ఇక్కడ నిత్యావసరాలు సహా మరికొన్నింటికి అనుమతించింది. ప్రస్తుతం దేశంలో కేసులు సంఖ్య 33,000 దాటింది. 22,000 మంది చికిత్స పొందుతుండగా దాదాపు 1080 మంది మృతిచెందారు. పొడగించిన లాక్‌డౌన్‌ ముగుస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధాని మోదీ ఏం చేయనున్నారు? లాక్‌డౌన్‌ పొడగిస్తారా? ఎత్తేస్తారా? ఆంక్షలు సడలిస్తారా? అని ఎదురుచూస్తున్నారు. మరోవైపు మే నెల 25 వరకూ లాక్ డౌన్ వుంటుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడం కూడా చర్చకు దారితీస్తోంది. 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   13 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   12 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   17 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   18 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   14 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   21 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   21 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   13 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   15 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle