newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తుపాకులతో హల్‌చల్ ఎఫెక్ట్: ఆరేళ్ళ సస్పెన్షన్

18-07-201918-07-2019 08:41:49 IST
2019-07-18T03:11:49.798Z18-07-2019 2019-07-18T03:10:45.461Z - - 17-04-2021

తుపాకులతో హల్‌చల్ ఎఫెక్ట్: ఆరేళ్ళ సస్పెన్షన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిత్యం  వివాదాల‌తో వార్తల్లో నిలిచే బిజెపి ఎమ్మెల్యే ప్రణవ్‌ సింగ్‌  వ్యవహారశైలిపై బీజేపీ సీరియస్ అయింది. ప్రణవ్‌ను‌ ఆరేళ్లపాటు సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్‌లోని ఖాన్‌పూర్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, కొద్ది రోజుల క్రితం కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు.

ఆసుపత్రి నుంచి డిశ్చార్జి ఐన సంతోషంతో తన అనుచరులను ఓ హోటల్‌లో పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో మద్యం సేవించిన ప్రణవ్‌ సింగ్‌, తుపాకులతో హల్‌ చల్ చేశారు. 

ఒక చేతిలో మద్యం సీసా, మరో చేతిలో తుపాకీతో నానా హంగామా చేశారు.  దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో పార్టీ అధిష్టానం ఈ ఘటనపై స్పందించింది. పార్టీ క్రమశిక్షణా సంఘం సిఫార్సుతో ప్రణవ్‌సింగ్‌ను ఆరేళ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ ఘటనతో పాటు గతంలో ఓ జర్నలిస్టును చంపేస్తానంటూ బెదిరించిన ఘటనలో ఆయనను మూడు నెలల పాటు సస్పెండ్‌ చేసిన అధిష్టానం, తాజా ఘటన నేపథ్యంలో ఆరేళ్లు సస్పెండ్‌ చేసింది.

ఒక బాధ్యతాయుతమయిన ఎమ్మెల్యేగా ఉండి మారణాయుధాలు వాడుతే జల్సా చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. హరిద్వార్-ఖాన్‌పూర్ నుండి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన కున్వర్ ప్రణవ్ సింగ్ మద్యం సేవిస్తూ చేసిన ఓవర్ యాక్షన్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

బీజేపీ ఎమ్మెల్యే తుపాకీతో డ్యాన్స్..ఎక్కడో తెలుసా?

ప్రణవ్ సింగ్ తాను ఓ ప్రజా ప్రతినిధిని అనే విషయం మర్చిపోయి.. ఐటమ్ సాంగ్‌కు తుపాకులు చేత్తో పట్టుకొని డ్యాన్స్ చేశాడు. చుట్టూ మందుబాబులను పోగేసుకుని మరీ అల్లలచిల్లరగా తిరిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను ఊపేసింది. 

బీజేపీ ఎమ్మెల్యే తుపాకీతో డ్యాన్స్..ఎక్కడో తెలుసా?

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   10 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   15 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   11 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   14 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   18 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   17 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   20 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   16 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle