newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

తీహార్ జైలుకు చిదంబరం... ఇందిరా తర్వాత ఆయనే!

06-09-201906-09-2019 09:13:04 IST
2019-09-06T03:43:04.585Z06-09-2019 2019-09-06T03:42:58.984Z - - 20-09-2019

తీహార్ జైలుకు చిదంబరం... ఇందిరా తర్వాత ఆయనే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆయన మాజీ హోంమంత్రి.. ఆర్థిక మంత్రి కూడా. కాంగ్రెస్ హయాంలో చక్రం తిప్పిన చిదంబరం ఇప్పుడు వివిధ కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయనను తీహార్ జైలుకి తరలించారు. 

జెడ్ కేటగిరి భద్రత ఉన్న చిదంబరానికి జైల్లో ప్రత్యేక సదుపాయాలకు కూడా కల్పించారు. వెస్ట్రన్ టాయిలెట్‌ సౌకర్యంతో పాటు ఆయనకు మందులను అందించేందుకు అనుమతిచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ ఆర్థికమంత్రి చిదంబరంకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. 14 రోజుల పాటు కస్టడీ విధించడంతో ఆయన్ను తీహార్‌ జైలుకు తరలించారు. 

సెప్టెంబర్ 19 వరకు చిదబరం అక్కడే ఉంటారు చిదంబరం. సీబీఐ కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు చిదంబరంను గురువారం కోర్టులో హాజరపరిచారు. దాంతో ఆయన్ను జుడిషియల్ కస్టడీకి అప్పగించింది స్పెషల్ కోర్టు. జైల్లో చిదంబరానికి ప్రత్యేక సెల్‌ను కేటాయించాలని కోర్టు ఆదేశించింది. దీంతో అధికారులు ఆ ఏర్పాట్లు చేశారు. ఐఎన్ఎక్స్ ముడపుల కేసులో ఆగస్టు 21న సీబీఐ అధికారులు చిదంబరంను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

 సీబీఐ కస్టడీలో 16 రోజుల పాటు ఉన్న చిదంబరం మందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. అయితే ఆయన బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ఎయిర్‌సెల్ మాక్సిస్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరానికి ఊరట లభించింది. వారిద్దరికీ ఢిల్లీ ప్రత్యేక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో మాత్రం వారికి ఎలాంటి ఊరట లభించలేదు. సీబీఐ కస్టడీ ముగిసిన నేపథ్యంలో తనను ఈడీ కస్టడీకి అప్పగించాలని పిటిషన్ వేశారు చిదంబరం. ఐతే ఆ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు ఆయన్ను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది. దాంతో చిదంబరంను తీహార్ జైలుకు తరలించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఇక్కడే శిక్ష అనుభవించారు. 

తీహార్ జైలులో ఇందిరాగాంధీ

దక్షిణ ఆసియా లోనే అతి పెద్ద కారాగార ప్రాంగణం ఢిల్లీ లోని చాణక్యపురి నుండి 7 కి.మీ. దూరంలో ఉంది.అనేక మంది ప్రముఖులకు తన సుదీర్ఘ చరిత్రలో ఆశ్రయమిచ్చింది. భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ కూడా తీహార్ జైలులో ఉన్నారు.. ప్రధాని పదవిలో ఉండగా ఆమె అధికారులను పీడించినట్లు ఆరోపించి ఆమెను తీహార్ జైలులో ఉంచారు.

అయినా ఆమెలోని పోరాట పటిమ తగ్గలేదు. అక్కడ ఉండే తాను విడుదల అయిన తరువాత చెయ్యవలసిన ప్రణాళికను తయారుచేసింది. విడుదల అవగానే తన ప్రణాళికను అమలు పరచింది. అప్పటి మొరార్జీ దేశాయ్ పరిపాలనలో ధరలు ఆకాశాన్నంటాయి. నేరాలు పెరిగాయి. దీంతో విపక్షాలు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించాయి. 

విధిలేని పరిస్థితుల్లో ఆయన రాజీనామా చేశారు. అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి లోక్‌సభను రద్దు చేశారు. తీహార్ జైలునుంచి బయటకు వచ్చిన ఇందిరాగాంధీ తన సత్తా చాటారు. ప్రజలతో మమేకమే,  సుడిగాలి పర్యటనలు చేసి ప్రజా  సమస్యల పరిష్కారానికి కృషి చెస్తానని వారికి మాట ఇచ్చారు. ఇందిరపై ప్రజలకు గల నమ్మకం మరొకసారి రుజువయింది. లోక్‌సభ ఎన్నికలలో 529 స్థానలకు గాను 351 సీట్లు గెలుచుకుని తమ సత్తాను నిరూపించుకున్నారు.. 1980 జనవరిలో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

ఎందరో రాజకీయ వేత్తలు, పారిశ్రామిక వేత్తలు, హంతకులు, ఉగ్ర వాదులు, ఉద్యమ నాయకులు మొదలైన వారెందరో ఈ జైలులో వుంచ బడ్డారు. కొందరిని ఇక్కడే ఉరి తీశారు. పార్లమెంట్‌పై దాడికి పాల్పడ్డవారిలో కీలక నిందితుడు అఫ్జల్‌ గురు కూడా తీహార్ జైలు పక్షి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులో కేహార్‌ సింగ్‌, సత్వంత్‌ సింగ్‌లను ఈ జైలులోనే ఉరి తీశారు.1986 మార్చి 16న క్రిమినల్‌ చార్లెస్‌ శోభరాజ్‌ ఈ జైలు నుంచి తప్పించుకున్నాడు.

అయినా మళ్లీ దొరికిపోయాడుఅస్సాం మాజీ విద్యాశాఖామంత్రి రిపున్‌ బోరా డానియల్‌ టాప్‌నో హత్యకేసులో ప్రధాన నింది తుడు. 3 జూన్‌ 2008న సిబిఐ బోరాను అరెస్టు చేసి ఇదే జైలుకు తరలించారు. డిఎంకె ప్రముఖ నాయకులు, కేంద్ర మాజీ మంత్రులు ఎ.రాజా, ఎం.కె.కని మొళి, వినోద్‌ గోయంకా, షాహిద్‌ బల్వా, సంజయ్‌ చంద్రా లను 2జీ కేసులో అరెస్టు చేసి ఇదే జైలులో ఉంచారు.

ఒలంపిక్స్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి సురేష్‌ కల్మాడీని 2010లో తీహార్ జైలులో ఉన్నారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మాన సమయంలో డబ్బు ఎర చూపి ఎంపిలను ప్రభావితం చేసిన ఆరోపణలపై సమాజ్‌ వాదీ పార్టీ మాజీ సభ్యుడు అమర్‌సింగ్‌ ఇదే జైలులో ఉన్నారు.

అవినీతికి వ్యతిరేకంగా తాము కోరిన విధంగా లోక్‌పాల్‌ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలంటూ ఆందోళన చేస్తున్న అన్నా హజారే, అరవింద్‌ కేజ్రీవాల్‌లను అరెస్టు చేసి ఇక్కడే ఉంచారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతలా, అతని కుమారుడు అజయ్‌ చౌతలాలను అవినీతి కేసులో అరెస్టు చేసి ఈ జైలులోనే ఉంచారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle