newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తీరాన్ని తాకిన ఎంఫాన్‌ అతి తీవ్ర తుపాను

20-05-202020-05-2020 19:06:56 IST
Updated On 20-05-2020 19:31:18 ISTUpdated On 20-05-20202020-05-20T13:36:56.800Z20-05-2020 2020-05-20T13:36:47.385Z - 2020-05-20T14:01:18.842Z - 20-05-2020

 తీరాన్ని తాకిన ఎంఫాన్‌ అతి తీవ్ర తుపాను
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలను వణికించిన అతి తీవ్ర తుపాను ఎంఫాన్ తీరాన్ని తాకింది. భీకర గాలులతో మధ్యాహ్నం 2.30 గంటలకు తీరాన్ని తాకిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బంగ్లాదేశ్‌ వైపు వెళ్లాక తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఒడిశాలోని పూరీ, ఖుర్దా, జగత్‌సింగ్‌పూర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

బాలాసోర్‌ జిల్లా, కటక్‌, కేంద్రపారా, జాజ్‌పూర్‌, గంజాం, భద్రక్‌లో ఈదురుగాలులతో భారీ వర్షాలు పడుతున్నాయి. ఒడిశా పారాదీప్‌కు తూర్పు ఆగ్నేయంగా 120కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయి వుంది. బెంగాల్‌లోని డిగాకు దక్షిణ ఆగ్నేయంగా 105 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గంటకు 170-200 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

Image

Image ఎంఫాన్ తుపానుకి ఆందోళన చెందవద్దని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ గీసిన శాండ్ ఆర్ట్ 

తీరం దాటాక గంటకు 110-120 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, బంగ్లాదేశ్‌ వైపు వెళ్లాక తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత బలహీనపడుతుందని అంచనా. భీకరగాలులతో  బెంగాల్ తీరాన్ని తాకింది తుఫాను. పూర్తిగా తీరం దాటేందుకు నాలుగు గంటలు పడుతుందని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. బెంగాల్ -బంగ్లాదేశ్‌ మధ్య సుందర్బన్‌ వద్ద తీరం దాటుతుందని అంచనా వేశారు.

ఇప్పటికే అల్లకల్లోలంగా మారాయి ఒడిశా, బెంగాల్‌ తీర ప్రాంతాలు. ఆయా ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక వద్ద తుపాను కారణంగా ముందుకు వచ్చింది సముద్రం.

తహశీల్దార్ ,ఫిషరీస్ అధికారులు తీరం సందర్శించి ముందు జాగ్రత్తగా స్థానికులకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తీరం వెంబడి  నివాసాలు ఉన్న  మత్యకారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పడవలు ,వలలు,వేట సామాగ్రి కాపాడుకుంటూ గాయాలపాలవుతున్నారు. రాత్రికి తుపాన్ ఉధృతి పెరిగితే చాలా ఇబ్బందిగా ఉంటుందని స్థానికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సముద్రంలో ఎగసిపడుతున్న అలలు బెంగాల్ తీరప్రాంతాలను ముంచెత్తే ప్రమాదం ఉంది. ఎన్డీఆర్ఎఫ్ టీంలు శాటిలైట్ ఫోన్లతో ప్రజల్ని అప్రమత్తం చేశాయి. బెంగాల్లో 19, ఒడిశాలో 20 టీంలు పనిచేస్తున్నాయి. కమ్యూనికేషన్ వ్యవస్థలు బాగా దెబ్బతినే అవకాశం ఉండడంతో శాటిలైట్ ఫోన్లతో ఈ టీంలు అందుబాటులో వున్నాయి. ఎంఫాన్ తుపాను కారణంగా ఎలాంటి పరిస్థితి ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రం తెలిపింది. 

 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle