తమ పాలన చూపించి ఓట్లడిగే దమ్ములేదా..?
11-05-201911-05-2019 12:05:32 IST
Updated On 28-06-2019 16:38:00 ISTUpdated On 28-06-20192019-05-11T06:35:32.743Z11-05-2019 2019-05-11T06:35:30.636Z - 2019-06-28T11:08:00.547Z - 28-06-2019

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రచార శైలిపై పెదవి విరుపులు కనిపిస్తున్నాయి. ఆయన ప్రచారంలో చేస్తున్న వ్యాఖ్యలు సగటు ఓటరుకు ఏ మాత్రం ఉపయోగపడేవిగా కనిపించడం లేదు. ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తి తాను చేసింది చెప్పి మరోసారి ఓట్లేయాలని అడగాలి. కానీ నరేంద్ర మోడీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పాలనను దాచిపెట్టి ప్రచారంలో కొత్త అంశాలు తెరపైకి తీసుకువచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందడం ఇప్పుడొక వ్యూహంలా మారింది. ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ఇదే వైఖరి అవలంభించారు. తన పథకాలు, ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు చేశారో కారణాలు చెప్పే దాని కంటే ఎక్కువగా చంద్రబాబును బూచీగా చూపి ఓట్లు పొందారు. దీంతో ఆయన విజయం సాధించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు సైతం ఇదే వ్యూహంతో ముందుకుపోయారు. కేసీఆర్, నరేంద్ర మోడీ వ్యతిరేకత ద్వారానే ఓట్లు పొందే ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు అవసరం లేదని కోడికత్తి, వివేకానంద రెడ్డి హత్య కేసు, డేటా చోరీ వంటి కొత్త అంశాలతో ఆయన ఎన్నికల ప్రచారం సాగింది. ఐదేళ్ల తన పాలనపై పెద్దగా ఆయన ప్రచారం చేయలేదు. ఇక, ఇప్పుడు నరేంద్ర మోడీ మరింత ముందుకు వెళుతున్నారు. ఐదేళ్లుగా తన పాలనలో సాధించిన విజయాలపై ఆయన పెద్దగా ప్రచారం చేయడం లేదు. ఎప్పుడో 26 ఏళ్ల క్రితం మరణించిన రాజీవ్ గాంధీని తెరపైకి తీసుకువచ్చారు. రాజీవ్ యుద్ధనౌకలో పిక్నిక్ పోయారని, సిక్కులకు వ్యతిరేకంగా మాట్లాడారని, నెంబర్ 1 అవినీతిపరుడని రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ కూడా అంతే తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. దీంతో ఈ అంశాలే ప్రధానంగా ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఐదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వ పాలనపై మాత్రం ఎన్నికలు జరగడం లేదు. నరేంద్ర మోడీ హయాంలో అనేక కొత్త పథకాలు తీసుకువచ్చారు. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు వంటి చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, మోడీ ఎన్నికల ప్రచారంలో పెద్దగా ఈ అంశాలను ప్రస్తావించడం లేదు. ఇంతకుముందు కేసీఆర్, చంద్రబాబు, ఇప్పుడు నరేంద్ర మోడీ ఇలా తమ పాలనను గుర్తు చేసి ఓట్లు అడగకుండా ఎన్నికల నాటికి కొత్త అంశాలను, ఎన్నికలతో సంబంధం లేని విషయాలను తెరపైకి తీసుకురావడం రాజకీయంగా వారికి లబ్ధి చేకూరుతుందేమో కానీ ప్రజలకు మాత్రం జరిగేదేమీ లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
9 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
12 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
15 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
5 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
15 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
13 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
16 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
16 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
10 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
19 hours ago
ఇంకా