newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తమిళ సూపర్ స్టార్.. పవర్ స్టార్‌లా మారతారా?

15-03-202015-03-2020 09:10:09 IST
Updated On 15-03-2020 09:10:28 ISTUpdated On 15-03-20202020-03-15T03:40:09.726Z15-03-2020 2020-03-15T03:39:55.022Z - 2020-03-15T03:40:28.950Z - 15-03-2020

తమిళ సూపర్ స్టార్.. పవర్ స్టార్‌లా మారతారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సినిమాల్లో కొంతమందిని రోల్ మోడల్స్ గా భావిస్తారు. తమిళ సూపర్ స్టార్ రజినికాంత్ ని ఎంతోమంది ఇనిస్సిరేషన్ గా తీసుకుంటారు. కానీ ఈమధ్య సూపర్ స్టార్ ఏపీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరహాలోనే ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఏపీలో పవన్ కళ్యాణ్‌కు , తమిళనాడులో రజనీకి పెద్ద తేడా ఏం కనిపించడం లేదు. ఇద్దరికి ఇద్దరూ ఒకే నిర్ణయాలు తీసుకుంటున్నారు.

నిన్న సీఏఏ విషయంలో బీజేపీ సపోర్టం చేయడం  దగ్గరనుంచి.. సీఎం పదవికి దూరమంటూ అడుగులు వేస్తున్నారు. వాస్తవానికి యుద్ధానికి ముందే చేతులెత్తేయకూడదు. ఓటమి తర్వాత ఏవిధమైన సమర్థన చేసుకున్నాచెల్లుతుంది. రాజకీయ యుద్ధమైన ఎన్నికలు ప్రజాభిప్రాయంతో ముడిపడి ఉంటాయి. 

నాయకుడు పార్టీ శ్రేణులకు తామే అధికారంలోకి వస్తున్నామన్న భరోసా కల్పించాలి. అలా కాకుంటే అచ్చం జనసేనలా మారడం ఖాయం. అత్యున్నత పదవిని అధిష్ఠిస్తాననే నమ్మకాన్ని కూడా కలిగించాలి.  పెద్ద టార్గెట్లు లేకుంటే రాజకీయ పరుగుపందెంలో పరిగెట్టలేం. తమిళనాట రజనీ కాంత్ ప్రకటన భిన్నంగా ఉంది.

తాను ముఖ్యమంత్రి కావాలనుకోవడం లేదని , సమర్థుడైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని సూపర్ స్టార్ రజనీకాంత్ క్లారిటీ ఇచ్చేశారు. దీనిపై ఆయన అభిమానులు పెదవి విరిచేస్తున్నారు. ఎవరినో సీఎంని చేసేందుకు మేమెందుకు చెమటలు కక్కుకోవాలనే బాధన అభిమానుల్లో కలగడం ఖాయం. 

జనసేనను స్థాపించిన పవన్ కల్యాణ్ తో రజనీకాంత్ కు పోలికలు ఎందుకు వస్తున్నాయో సోదాహరణంగా వివరిస్తున్నారు కొందరు నేతలు. రాజకీయాల్లో మార్పుకోసం, దేశం కోసం తాను పాలిటిక్స్ లోకి వచ్చానని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పదే పదే చెబుతుంటారు. తాను ముఖ్యమంత్రి కావాలనుకోవాలనుకోవడం లేదని పలు సందర్బాల్లో ప్రస్తావించారు. నైతిక సూత్రాలు, ఆశయాలు చెప్పడంలో తప్పు లేదు కానీ, అభిమానులు ఆశించేది వేరు. సినీ పొలిటీషియన్స్ ఫ్యాన్స్ ను బేస్ చేసుకుంటూ మిగిలిన వర్గాలను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. తమిళనాడులో అత్యంత ఆదరణ కలిగిన నటుడు రజనీకాంత్ . 

దేశంలోనే అత్యధిక సంఖ్యలో అభిమాన సంఘాలు కలిగిన సూపర్ స్టార్ కూడా అతనే. రజనీ మక్కల్ మండ్రం రూపకల్పనలో అభిమాన సంఘాలదే ప్రధాన పాత్ర. ఎంజీఆర్, జయలలితలను అధికార పీఠంపై కూర్చోబెట్టడంలో వారి అభిమానులు పోషించిన పాత్ర చాలా కీలకం. ప్రస్తుతం రజనీకాంత్ తాను కేవలం పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే మిగిలిపోతాననడంతోనే పార్టీలో జోష్ తగ్గించేశారు.సినిమా నటులు రాజకీయ పార్టీని స్థాపిస్తున్నారంటే రాజకీయాల దశ మార్చేస్తారనే భావన ఉండేది. 

రెండు మూడు దశాబ్దాల్లో సీన్ రివర్స్ అయిపోయింది. ముఖ్యంగా సినీ రాజకీయాలకు శ్రీకారం చుట్టిన తమిళనాడులోనే ఆ ధోరణి తిరగబడింది. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత తర్వాత సినీరంగం నుంచి వచ్చి రాజకీయాలను శాసించిన వారు పెద్దగా కనిపించరు. శివాజీ గణేశన్, విజయకాంత్, కమలహాసన్ వంటి వారు పార్టీలను పెట్టినా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ లో నూ అదే ట్రెండ్ కనిపిస్తోంది. ఎన్టీయార్ తర్వాత అంత పెద్ద నటుడిగా రికార్డు కలిగిన చిరంజీవి ప్రజారాజ్యం ఒక ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలిపోయింది. పవన్ కల్యాణ్ జనసేన కనీసం ప్రజారాజ్యం స్థాయికి కూడా చేరుకోలేకపోయింది. 

పార్టీ స్థాపన తర్వాత మొదటి ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019లో పోటీ చేసినప్పటికీ చట్టసభల ఫలితాలను ప్రభావితం చేయలేకపోయింది. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు రజనీ మక్కల్ మండ్రం తమిళనాడులో ఈ ట్రెండ్ ను రివర్స్ చేసి పొలిటికల్ బ్లాక్ బస్టర్ గా రికార్డు సృష్టించగలదా? అన్నదే ఇప్పుడు రాజకీయాల్లో నలుగుతున్న చర్చ జరుగుతోంది. పూర్తికాలం రాజకీయాల్లో కొనసాగాలనే ఉద్దేశంతోనే పవన్ కల్యాణ్ రాజకీయ అరంగేట్రం చేశారు. కానీ 2014లో తెలుగుదేశానికి మద్దతు ఇచ్చారు. పొత్తు కుదుర్చుకుని కొన్ని స్థానాలకైనా పోటీ చేసి ఉంటే జనసేన నిర్మాణానికి పునాదులు ఏర్పడి ఉండేవి. కానీ వైసీపీని నిరోధించడమనే ఏకైక లక్ష్యంతో తన పార్టీ ఎదుగుదలను సైతం కుదించేసుకున్నారు. ఫలితంగా జనసేన లోక్ సభ, శాసన సభ వంటి చట్టసభల్లో అడుగుపెట్టలేకపోయింది.

జనసేనకు ఈ ముందు చూపు కొరవడటంతో పార్టీ పటిష్ఠం కాలేకపోయింది. టీడీపీ, వైసీసీలకు తామే ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని భావించే వుంటే పోటీ బావుండేది. రజనీకాంత్ సైతం ఇదే తరహా ధోరణిలో ప్రసంగాలు చేస్తుండటంతో రజనీ మక్కల్ మండ్రం భవిష్యత్తుపై అనుమాన మేఘాలుకమ్ముకుంటున్నాయి.తమిళనాడులో జయలలిత, కరుణానిధి మరణించడంతో అన్నాడీఎంకే, డీఎంకేలకు మార్గదర్శకులు కరవు అయ్యారు. కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రాన్ని శాసిస్తున్న ఈ రెండుపార్టీలు రాష్ట్రంపై పట్టు బిగించాయి. అనేక విధాల వనరులు ఉన్న రాష్ట్రాన్ని అయాచిత పథకాలు, అనుచిత పంపిణీల పాలు చేశాయి.

ఈ పరిస్థితుల్లో రజనీకాంత్ వంటి నాయకుడు వస్తే సులభంగానే అధికారాన్ని దక్కించుకోవచ్చని పరిశీలకులు అంచనా వేశారు. కానీ ప్రతి ఊరు,వాడ విస్తరించిన శ్రేణులతో ఉన్న పార్టీలు డీఏంకె, ఏఐఏడీఎంకే. వాటిని దీటుగా ఎదుర్కోవడం అంత చిన్నవిషయం కాదు. రజనీకాంత్ కొత్త పార్టీ అభిమాన సంఘాలనే పార్టీ కార్యకర్తలుగా తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. తాను ముఖ్యమంత్రిని అవుతాననే సంకేతాన్ని వారికి అందిస్తేనే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదని రజనీ చెప్పడం తీవ్రమైన పొరపాటే. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle