newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తమిళ రాజకీయాలపై 'విజయ్' ముద్ర..!

27-09-201927-09-2019 14:15:08 IST
Updated On 27-09-2019 16:31:23 ISTUpdated On 27-09-20192019-09-27T08:45:08.822Z27-09-2019 2019-09-27T07:57:05.913Z - 2019-09-27T11:01:23.429Z - 27-09-2019

తమిళ రాజకీయాలపై 'విజయ్' ముద్ర..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తమిళ సినిమాలకు భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే ఒక ప్రత్యేకత ఉంది. గ్రామీణ వాతావరణాన్ని, భూమిపుత్రుల జీవన శైలిని  సహజాతిసహజంగా చిత్రించడంలో తమిళ సినిమాకు తొలినుంచి గుర్తింపు ఉంది. అలాగే రాజకీయ విమర్శలు, ప్రభుత్వాలను కత్తుల్లాంటి డైలాగులతో నిలదీయటంలో తమిళ సినిమానే నంబర్ వన్ గా ఉంటోంది. కమర్షియల్ ఎలిమెంటుకు కళాత్మక సృజనను మేళవించడంలో తమిళ సినిమాకు పోటీ వచ్చే చిత్రరంగం భారత్ లోనే లేదు. 

పైగా తమిళ హీరోలకు రాజకీయాలకు ఉండే ఆసక్తి కూడా తక్కువేం కాదు. అసలుకు దేశంలోనే సినిమా హీరోలు, రచయితలు, నటులు ముఖ్యమంత్రులుగా, చట్టసభల సభ్యులుగా మారటం తమిళ సినిమానుంచే మొదలయింది.

ఎమ్జీఆర్, కరుణానిధి, జయలలిత, కెప్టెన్ విజయకాంత్ ఇప్పుడు కమల్ హసన్, రజనీకాంత్, విజయ్ చిత్రసీమనుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన వారు కొందరైతే, తాజాగా రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పండించుకోవాలని సీరియస్ గా ప్రయత్నిస్తున్న వారు కొందరు. వారిలో విజయ్ ఒక తాజా సంచలనం.

పెద్దనోట్ల రద్దుపై వ్యంగ్యబాణాలు విసిరిన తొలి  భారతీయ చిత్రం మెర్సెల్ (అదిరింది. కథా రచయిత మన విజయేంద్రప్రసాదే అనుకోండి). ఆ చిత్రం వేసిన ప్రభావం ప్రేక్షకులపై ఎంత స్థాయికి వెళ్లిందంటే థియేటర్లలో విడుదలయ్యాక ఆ సినిమాను బ్యాన్ చేయాలని బీజేపీ పార్టీ కేంద్రస్తాయిలో ప్రయత్నించిందంటే సినిమా కంటెంట్ స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమా హీరో విజయ్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.

చురకత్తుల్లాంటి డైలాగులతో రాజకీయ నేతలపై నర్మగర్భపు వ్యాఖ్యలతో సినిమాల్లో విరుచుకుపడటం తొలి నుంచి రజనీకాంత్ పెట్టింది పేరు కాగా తాజాగా రజనీకాంత్ డైలాగులకు ఏమీ తీసిపోకుండా తమిళనాట సంచలనం సృష్టిస్తున్న హీరో విజయ్. మెర్సెల్, సర్కార్, తాజాగా బిగిల్ వంటి సినిమాల్లో తమిళనాడు ప్రభుత్వాల పథకాల అర్థరాహిత్యాన్ని ఎండగట్టాడు.

అంతకు ముందు తలైవా చిత్రం (అన్న) విడుదల సమయం నుంచే అన్నాడిఎంకేతో రాజకీయ సమస్యలు ఎదుర్కొన్న విజయ్ తనను వేధిస్తున్న ప్రభుత్వ పెద్దలు, అధికారులను సినిమా కళ ద్వారానే ఎదుర్కొంటున్నారు.  తన తాజా చిత్రం బిగిల్ చిత్ర వేడుకలో కూడా పాలకపార్టీపై నిప్పులు చెరిగిన విజయ్ ఎవర్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి అంటూ ప్రజలను కోరారు. దీంతో విజయ్ మాట విని ఎవర్ని ఎక్కడ ఉంచాలి అన్న అవసరం తమిళ ప్రజలకు లేదని మంత్రి కడంబూరు రాజు పేర్కొనడం అన్నాడీఎంకేలో విజయ్ వ్యవహారం పట్ల ఆగ్రహాన్ని సూచిస్తోంది. 

ఈ అన్ని పరిణామాలను చూస్తుంటే రజనీ కాంత్ కంటే ముందుగా విజయ్ రాజకీయ రంగప్రవేశం చేస్తాడని భావిస్తున్నారు. సినిమాకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉన్న తమిళనాడులో ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని సినీ విశ్లేషకుల వ్యాఖ్య.

నా రూటే సెప‌రేటు

నా రూటే సెప‌రేటు

   24 minutes ago


బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   14 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   15 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   18 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   21 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle