newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

తమిళ పార్టీలను వణికిస్తున్న కబాలి

03-05-201903-05-2019 13:11:24 IST
Updated On 02-07-2019 12:07:40 ISTUpdated On 02-07-20192019-05-03T07:41:24.843Z03-05-2019 2019-05-03T07:41:23.027Z - 2019-07-02T06:37:40.181Z - 02-07-2019

తమిళ పార్టీలను వణికిస్తున్న కబాలి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కొట్టిన డైలాగ్ ఇప్పుడు త‌మిళ రాజ‌కీయాల వేడిని అమాంతం రెట్టింపు చేసింద‌ట‌. 2021లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న పార్టీ ప్రత్యక్ష రాజ‌కీయాల్లోకి దిగుతుంద‌నీ, అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఒంట‌రిగా పోటీ చేస్తుంద‌ని ప్రక‌టించారు ర‌జ‌నీ కాంత్. దీంతో డీఎంకే అధినేత స్టాలిన్ ప‌రిస్థితి కుడిలో ప‌డ్డ ఎలుక‌లా మారింద‌ట‌. ఎందుకంటే, జ‌య‌ల‌లిత చ‌నిపోయిన త‌ర్వాత త‌మిళ రాజ‌కీయాలు మారిపోయాయి. అధికారం కోసం అన్నా డీఎంకే నేత‌లు కొట్టుకుంటే, అవ‌కాశం కోసం స్టాలిన్ ఎదురు చూశారు. 

కానీ ఎట్టకేల‌కు ప‌న్నీర్ సెల్వం ప్రభుత్వం ఏర్పాటు చేయ‌డం, ఆ త‌ర్వాత ప‌ళ‌నిస్వామి ముఖ్యమంత్రి అవ్వడం జ‌రిగాయి. ఇక పాల‌న‌లో నెల‌కొన్న అనిశ్చిత ప‌రిస్థితి జ‌నంలో అన్నా డీఎంకే మీద కొంచెం వ్యతిరేక‌త వ‌చ్చింద‌ట‌. దీంతో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ‌కు అధికారం ఖాయ‌మ‌ని డీఎంకే నేత‌లు సంబ‌ర‌ప‌డి పోయారు. ఇక స్టాలిన్ కూడా సీఎం కుర్చీ మీద ఆశ‌లు పెట్టుకున్నారు.

ఇదే స‌మ‌యంలో ర‌జ‌నీకాంత్ ప్రక‌ట‌న ఆయ‌న‌కు ఇబ్బందిగా మారింద‌ట‌. ఎందుకంటే త‌మిళ‌నాడులో నెల‌కొన్న రాజ‌కీయ శూన్యత‌ను త‌మ పార్టీ నింపేస్తుంద‌న్న ఆశ‌లో ఉన్నారు స్టాలిన్. అంటే త‌న‌కు అన్నాడీఎంకే కూట‌మి పెద్ద పోటీ కాద‌నేది ఆయ‌న అభిప్రాయం. ఇప్పుడు ర‌జ‌నీకాంత్ పార్టీ రంగంలోకి దిగితే, ఆయ‌న వ‌ర్గంతో పాటు అన్నాడీఎంకే నేత‌లు కూడా ర‌జ‌నీ వైపు వెళ్లడం ఖాయం. అప్పుడు ర‌జ‌నీ పార్టీకి రెట్టింపు బ‌లం చేకూరుతుంది. 

ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా చీల‌తాయి. ఇదంతా జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని తెల్సుకున్న స్టాలిన్, ర‌జ‌నీ ప్రక‌ట‌న‌తో భ‌య‌ప‌డుతున్నార‌ట‌. మ‌రో విష‌యం ఏంటంటే, ర‌జ‌నీకాంత్ అభిమానుల్లో ఎక్కువ మంది డీఎంకే పార్టీకి ఓట్లు వేసేవారే. అంటే వీరి ఓట్లు కూడా స్టాలిన్ పార్టీ కోల్పోయే అవ‌కాశం ఉంది. ఇప్పటికే త‌మిళ‌నాడు మొత్తం పార్టీ కేడ‌ర్ నిర్మాణం, క‌మిటీలు పూర్తి చేశారు ర‌జ‌నీకాంత్. మ‌రో విష‌యం ఈ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో త‌న పార్టీ పోటీ చేయ‌ద‌ని కూడా చెప్పారు. ఇది కూడా స్టాలిన్‌కు ఇబ్బందిగా మారిందట‌. 

ఎందుకంటే, త‌మిళ‌నాడులో పార్లమెంట్ సీట్లతో పాటు కొన్ని అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. స‌ర్వేలు కూడా డీఎంకే పార్టీకి అనుకూలంగా వ‌చ్చాయి. ఒక‌వేళ అన్ని అసెంబ్లీ సీట్లను గెల్చుకుంటే ప‌న్నీర్ సెల్వం ప్రభుత్వాన్ని ప‌డ‌గొట్టవ‌చ్చన్నది స్టాలిన్ ఆలోచ‌న‌. కానీ ర‌జ‌నీకాంత్ పార్టీ నేరుగా పోటీ చేయ‌కుండా, అన్నాడీఎంకే, బీజేపీ కూట‌మికి ప‌రోక్షంగా మ‌ద్దతు ఇస్తుంద‌నేది ఆయ‌న అనుమానం. అందుకే ఇప్పుడు ర‌జ‌నీకాంత్ ఎత్తుగ‌డ‌ల‌తో స్టాలిన్ వ‌ణికిపోతున్నార‌ట‌.

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

   9 hours ago


కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం

కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం

   9 hours ago


‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?

‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?

   10 hours ago


టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

   10 hours ago


జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

   11 hours ago


హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

   11 hours ago


ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

   13 hours ago


జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

   13 hours ago


దేవుడు కూడా కేసీఆర్‌‌ను వ్యతిరేకిస్తున్నాడుగా.. దాసోజు ఎద్దేవా

దేవుడు కూడా కేసీఆర్‌‌ను వ్యతిరేకిస్తున్నాడుగా.. దాసోజు ఎద్దేవా

   14 hours ago


ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

   14 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle