newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తమిళనాడుకు గోదావరి జలాల పంపిణీపై తెలుగు సీఎంల అంగీకారం

06-03-202006-03-2020 09:51:17 IST
Updated On 06-03-2020 10:15:20 ISTUpdated On 06-03-20202020-03-06T04:21:17.499Z06-03-2020 2020-03-06T04:21:15.071Z - 2020-03-06T04:45:20.138Z - 06-03-2020

తమిళనాడుకు గోదావరి జలాల పంపిణీపై తెలుగు సీఎంల అంగీకారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తాగునీటికోసం అల్లాడిపోతున్న తమిళనాడు రాష్ట్రానికి గోదావరి జలాల పంపిణీపై ఉదారంగా వ్యవహరించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీర్మానించారు. తమిళనాడు మంత్రులు, ప్రభుత్వాధికారులు బుధ, గురువారాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలను కలిసి తమిళనాడులో తాగునీటి సమస్యను వివరించి సహకరించాలని అభ్యర్థించడంతో ముందుగా వైఎస్ జగన్, తర్వాత కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. 

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తమిళనాడు, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు కలిసి నడిస్తే దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. తమిళనాడు సీఎం నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అధికారికంగా లేఖలు అందిన తర్వాత ఏపీ సీఎంతో మాట్లాడి ఇచ్చుపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తామని కేసీఆర్ తమిళనాడు మంత్రులకు భరోసానిచ్చారు. తమిళనాడుకు తాగునీటి సమస్యపై నీతి ఆయోగ్ సమావేశాల్లోనూ పలుమార్లు లేవనెత్తానని, ఒక భారతీయునిగా ఆ రాష్టానికి సాయం చేయడానికి సదా సిద్ధంగా ఉన్నానని కేసీఆర్ పేర్కొన్నారు. తర్వాత తమిళనాడు ప్రతినిధుల బృందం అభ్యర్థనపై సీఎం కేసీఅర్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు పోన్ చేసి మాట్లాడారు. తమిళనాడును ఆదుకోవలసిన అవసరం ఉందని వివరించారు.

మరోవైపున ఆంధ్రప్రదేశ్‌ సాగు, తాగునీటి అవసరాలు తీరాకే గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ నదుల అనుసంధానంలో భాగంగా తమిళనాడుకు గోదావరి వరద జలాలను తరలించడానికి సాధ్యాఅసాధ్యాలపై అధ్యయనం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. తమిళనాడు పురపాలక, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి.. పరిపాలన సంస్కరణలు, మత్స్య శాఖ మంత్రి డి.జయకుమార్‌ బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌తో సమావేశమయ్యారు. 

నదుల అనుసంధానంపై కేంద్ర జల్‌ శక్తి శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ గత నెల 26న ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో తమ రాష్ట్ర అవసరాలు తీరాకే గోదావరి వరద జలాలను తమిళనాడుకు తరలించడానికి సమ్మతిస్తామని ఏపీ సర్కార్‌ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ అనుసంధానంపై తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయం చెప్పాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నాలుగు నదుల అనుసంధానానికి సహకరించాలని కోరేందుకు తమిళనాడు మంత్రులు రాష్ట్రానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు సీఎంలు ఏకాభిప్రాయానికి వస్తే, జాతీయ ప్రాజెక్టుగా ఆ అనుసంధానాన్ని చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవచ్చని ఇద్దరు మంత్రులు వివరించారు.

ఇది కూడా చదవండి : నదుల అనుసంధానానికి కేంద్రం సై .. ఏపీ తెలంగాణ హర్షం 

కేంద్రం నిధులు ఇవ్వకపోతే.. తమ రాష్ట్రానికి ఏ మేరకు గోదావరి జలాలను తరలిస్తారో ఆ దామాషా పద్ధతిలో ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని భరిస్తామని తమిళనాడు మంత్రులు ప్రతిపాదించారు. దీనిపై సీఎం వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. ఈ అంశంపై అధ్యయనం చేయాలని రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. కృష్ణా నదిలో నీటి లభ్యత నానాటికీ తగ్గుతోన్న నేపథ్యంలో పోలవరం– కృష్ణా (ప్రకాశం బ్యారేజీ)–బొల్లాపల్లి–బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ (బీసీఆర్‌) అనుసంధానం పనులు చేపట్టడంపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు.

గోదావరి నుంచి రోజుకు నాలుగు టీఎంసీలను కృష్ణా నది పరీవాహక ప్రాంతానికి తరలిస్తే.. కృష్ణా, పెన్నా పరీవాహక ప్రాంతాల్లో నీటి కొరతను అధిగమించవచ్చని.. అప్పుడు మిగులుగా ఉన్న జలాలను కావేరికి తరలించవచ్చని చేసిన ప్రతిపాదనతో తమిళనాడు మంత్రులు ఏకీభవించారు. కాగా, చెన్నైకి నీటిని సరఫరా చేసినందుకు ఏపీ ప్రభుత్వానికి బకాయి పడిన రూ.348 కోట్లలో రూ.25 కోట్ల మేర చెక్కును ఆ రాష్ట్ర మంత్రులు సీఎంకు అందజేశారు. చెన్నైలో తాగునీటి ఎద్దడి నివారణకు కండలేరు జలాశయం నుంచి రెండు టీఎంసీలను విడుదల చేయాలన్న వారి ప్రతిపాదనకు సీఎం అంగీకరించారు. ఏపీ, తెలంగాణ సీఎంలతో  సమావేశమవుతున్నట్టు తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రకటించారు.   

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   14 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   10 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   13 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   17 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   20 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   21 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle