newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తమిళం అంత గొప్పదా.. మరి అధికార భాషగా చేయండి మోదీజీ..

02-10-201902-10-2019 10:54:41 IST
2019-10-02T05:24:41.607Z02-10-2019 2019-10-02T05:24:39.983Z - - 11-04-2021

తమిళం అంత గొప్పదా.. మరి అధికార భాషగా చేయండి మోదీజీ..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తన అమెరికా పర్యటనలో తమిళ భాష గొప్పదనం గురించి శ్లాఘించానని ప్రధాని మోదీ చేసిన ప్రకటనను డీఎంకే అధినేత స్టాలిన్ స్వాగతిస్తూనే, తమిళం మాట్లాడుతున్న ప్రజలపై సంస్కృతం, హిందీ భాషలను కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మోదీ ఊరకే ప్రకటన చేయడానికి బదులుగా ప్రపంచంలోనే అతి పురాతన భాష అయిన తమిళాన్న అధికార భాషగా చేయాలని స్టాలిన్ సవాల్ విసిరారు. 

తమిళ భాష సంపద్వంతమైన, వైవిధ్యభరితమైన భాష అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొంటూ దాన్ని ప్రపంచంలోనే అతి పురాతనమై భాషగా కొనియాడారు. ఐక్యరాజ్యసమితిలో తాను తమిళ భాషను ఎత్తిపట్టానని కూడా సమర్థించుకున్నారు. దేశమంతటినీ ఐక్యపర్చడానికి హిందీని ఉమ్మడి అనుసంధాన భాషగా చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునివ్వడంపై  దక్షిణాది రాష్ట్రాలు, ప్రత్యేకించి తమిళనాడు, కేరళ, కర్నాటక తీవ్రంగా విరుచుకుపడిన నేపథ్యంలో నష్టనివారణకు ప్రయత్నించిన ప్రధాని మోదీ ప్రయత్నించారు.

ఈ నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత స్టాలిన్ డీఎంకే పార్టీ తరపున ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రప్రభుత్వ పథకాన్నీ హిందీలో లేక సంస్కృతంలో ఉంటున్నాయి. తమిళంలో వాటిని ప్రచురించినప్పటికీ పదాల ఉచ్చారణ హిందీలో, సంస్కృతంలో ఉంటోంది. కేంద్ర పథకాలను హిందీ లేదా సంస్కృతంలో పేరు పెడుతున్నందువల్ల వాటిని తమిళులు, ఇతర భాషలు మాట్లాడేవారు ఆ పథకాలను, వాటి లక్ష్యాలను అర్థం చేసుకోవడం కష్టంగా ఉందని డీఎంకే పార్టీ ప్రకటన పేర్కొంది.

రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో గుర్తింపు పొందిన 22 భారతీయ భాషలను అధికార భాషగా చేయాలని డీఎంకే ఎంతకాలంనుంచో నొక్కి చెబుతోంది. దీంట్లో భాగంగా పురాతన భాష అయిన తమిళాన్ని మొదటగా భారత అధికార భాషగా చేయాలి. మద్రాస్ హైకోర్టులో కూడా తమిళంనే అధికార భాషగా చేయాలి. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం తమిళభాషకు గుర్తింపు నివ్వదల్చుకుంటే 8 కోట్లమంది ప్రజలు మాట్లాడుతున్న తమిళాన్ని అధికార భాషగా ప్రకటించాలి. పలు ఇతర దేశాల్లో కూడా తమిళం అధికార భాషల్లో ఒకటిగా చలామణిలో ఉందని ఈ సందర్భంగా ప్రధానికి తెలియజేస్తున్నాము. కానీ అదే సమయంలో భారతదేశంలో అది అధికార భాషగా లేదని ఆ ప్రకటన విచారం వ్యక్తం చేసింది.

ప్రదాని తమిళ వంటలు, తమిళుల ఆతిథ్యం గొప్పదనం గురించి చేసిన వ్యాఖ్యలను డీఎంకే ప్రస్తావించింది. తమిళులు కేవలం ఆతిథ్యానికే కాదు విశ్వాసానికి కూడా మారుపేరు. ప్రధాని మోదీ నిజంగానే తమిళభాషను అధికార భాషగా ప్రకటించి చట్టపరమైన నిబంధనలను పొందుపరిస్తే, తమిళప్రజలు ఎంతగానో సంతోషిస్తారు. తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, కరుణానిధి కూడా తమిళానికి అధికార భాష ప్రతిపత్తిని కల్పించాలని తపన పడ్డారని ప్రకటన గుర్తు చేసింది.

హిందీని ఉమ్మడి అనుసంధాన భాషగా ప్రతిపాదించి దక్షిణాదిలో అమిత్ షా బీజేపీ పరువును పూర్తిగా తేసేశారు. తర్వాత బలవంతంగా హిందీని అనుసంధాన భాష చేయాలని తన ఉద్దేశం కాదని, ఇందుకు అన్ని రాష్ట్రాలను ఒప్పించాల్సి ఉంటుందన్నదే తన ఉద్దేశమని తర్వాత షా సమర్థించుకున్నప్పటికీ బీజేపీకి నష్టం జరిగిపోయింది

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తమిళనాడు సందర్శన సందర్బంగా తమిళ వంటలు, ఆతిధ్యం గొప్పదనం గురించి తమిళులకు నచ్చేలా ప్రకటించి ఉపశమింప చేయాలని ప్రయత్నించారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   13 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   9 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   11 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   16 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   19 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   20 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle