newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తమళనాట సరికొత్త హిందీ వార్...

08-09-202008-09-2020 11:42:02 IST
2020-09-08T06:12:02.930Z08-09-2020 2020-09-08T06:12:00.029Z - - 11-04-2021

తమళనాట సరికొత్త హిందీ వార్...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల వేదికగా మళ్లీ ఉద్యమం బయలుదేరింది. దీంతో తమిళాభిమాన పార్టీలు, బీజేపీ మధ్య సమరానికి దారితీసింది. కొందరు సినీ సెలబ్రిటీలు, యువత 'హిందీ తెలియదు పోరా' అంటూ టీషర్టులతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే పనిలో పడ్డారు. అదే సమయంలో హిందీ నేర్చుకుంటే తమిళం కాదు, డీఎంకే గల్లంతు అంటూ బీజేపీ యువత ఎదురు దాడికి దిగింది. 

తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా సినీ సెలబ్రిటీలు యువన్‌ శంకర్‌రాజ, ఐశ్వర్య రాజేష్, శాంతను తదితరులు పరోక్షంగా, ప్రత్యక్షంగా హిందీ వ్యతిరేక నినాదాలతో టీ షర్టులు ధరించి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యారు. ‘హిందీ తెలియదు పోరా, నేను తమిళం మాట్లాడే భారతీయుడిని’ అన్న నినాదాలు ఉన్న టీషర్టులు ధరించి తమ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. 

HindiTheriyadhuPoda: Five actors who struggled with Hindi in Tamil films

డీఎంకే యువజన నేత, నటుడు ఉదయ నిధి సారథ్యంలో టీ షర్టుల హిందీ వ్యతిరేక ఉద్యమం మరింత ఊపందుకుంది. డీఎంకే ఎంపీ కనిమొళితో కొందరు యువకులు హిందీ వ్యతిరేక నినాద టీషర్టులు ధరించి సామాజి క మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దీంతో హిందీకి వ్యతిరేకంగా కనిమొళి నేతృత్వంలో సామాజిక మాధ్యమం వేదికగా ఉద్యమం మొదలైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. 

దీనిపై కనిమొళిని ప్రశ్నించగా యువత, కొందరు సెలబ్రిటీలు హిందీకి వ్యతిరేకంగా తమదైన శైలిలో స్పందిస్తున్నారని తెలిపారు. చట్టం బయటకు వచ్చే సమయంలో ఈ ఆగ్రహం ఉప్పెనలా ఎగసి పడుతుందన్నారు. బీజేపీ యువత ఎదురు దాడిలో నిమగ్నమైంది. ‘హిందీ నేర్చుకున్నంత మాత్రాన.. తమిళం గల్లంతు కాదని, డీఎంకే అడ్రస్సే గల్లంతు’ అంటూ టీషర్టులతో ఎదురుదాడి సాగిస్తుండటం గమనార్హం.  

ఆది నుంచి హిందీ, సంస్కృతానికి తమిళనాడు వ్యతిరేకమన్న విషయం తెలిసిందే. గతంలో కాంగ్రెస్‌ పాలకులు  హిందీని బలవంతంగా రుద్దే యత్నం చేస్తే ఉద్యమం ఉప్పెనలా ఎగసి పడింది. దీంతో కేంద్రం వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి.   ఇతర భాషల వారు రాష్ట్రంలో ఉన్నా విద్య, ఉపాధి రంగాల్లో తమిళులకే పెద్ద పీట. మిగిలిన భాషల వారు అల్పసంఖ్యాక వర్గాలే. హిందీ, సంస్కృతాన్ని తమిళుల దారిదాపుల్లోకి రానివ్వరు. బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తే పోరాటాలు బయలుదేరుతాయి. 

ఇటీవల కూడా హిందీ, సంస్కృతం విషయంగా కేంద్రం పలు సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలతో  పోరాటాలు భగ్గుమన్నాయి. తాజాగా కేంద్రం త్రి భాషా విధానంతో హిందీ, సంస్కృతంను బలవంతంగా రుద్దే యత్నం చేస్తున్నట్టు తమిళ అభిమాన సంఘాలు, పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం చట్టాన్ని పాలకులే కాదు, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో హిందీకి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ఉద్యమం బయలుదేరడం గమనార్హం. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   14 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   10 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   12 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   17 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   19 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   21 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle