తండ్రులు నిలబెడితే కొడుకులు పడగొడుతున్నారు
11-03-202011-03-2020 07:39:30 IST
Updated On 11-03-2020 11:52:25 ISTUpdated On 11-03-20202020-03-11T02:09:30.564Z11-03-2020 2020-03-11T02:09:11.762Z - 2020-03-11T06:22:25.500Z - 11-03-2020

దేశంలో 130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదొడుకులు ఎదురుకుంది. బలమైన నాయకులు ఆ పార్టీని ఎల్లప్పుడు నిలబెడుతూ వస్తున్నారు. గాంధీ కుటుంబమే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నా వివిధ రాష్ట్రాల్లో బలమైన నాయకులు ఉండటమే కాంగ్రెస్‌కు బలం. అయితే, ఇప్పుడు ఆ బలం క్రమంగా కోల్పోతూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీ బాగు కోసం ఎంతో కష్టపడి నిలబెట్టిన నేతల కుమారులే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని పడగొడుతున్నారు. వైఎస్ జగన్, పెమా ఖండూ ఇలా చేసిన వారు. ఇప్పుడు వీరి కోవలోకి జ్యోతిరాధిత్య సింథియా చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బలమైన నాయకుడిగా ఉండేవారు. కాంగ్రెస్‌లో ఆయన అనేక ఇబ్బందులు పడ్డా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చారు. రాష్ట్రం నుంచే ఎక్కువ పార్లమెంటు స్థానాలను అందించి రెండుసార్లు యూపీఏ ప్రభుత్వాలు కేంద్రంలో ఏర్పడేందుకు కృషి చేశారు. పార్టీ కోసం ఇంత చేసిన వైఎస్ కుమారుడు జగన్ మాత్రం అదే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేశారు. తన ఓదార్పు యాత్రకు అనుమతించక, తన తండ్రి తీసుకొచ్చిన అధికారాన్ని ఇతరులకు అప్పజెప్పి తనను అవమానించిన కాంగ్రెస్ పార్టీని జగన్ గట్టి దెబ్బ కొట్టారు. కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు వచ్చి వైసీపీని స్థాపించిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైంది. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి అందరికీ తెలిసిందే. ఇక, ఆంధ్రప్రదేశ్ లాంటి అనుభవమే అరుణాచల్ ప్రదేశ్‌లోనూ జరిగింది. కాంగ్రెస్ పార్టీ నిబద్ధత కలిగిన నేతగా అక్కడ దోర్జీ ఖండూ ఉండేవారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2011లో ఆయన హెలీకాఫ్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. అయితే, జగన్ విషయంలో చేసిన తప్పును కాంగ్రెస్ అరుణాచల్ ప్రదేశ్‌లో చేయలేదు. దోర్జీ ఖండూ కుమారుడు పెమా ఖండూకు రాజకీయంగా ప్రధాన్యతను ఇచ్చింది. కొంతకాలానికి ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు. కానీ, కాంగ్రెస్ వైఖరి నచ్చక ఆయన ఆ పార్టీని వీడి ఇప్పుడు బీజేపీలో కొనసాగుతూ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పెమా ఖండూ వెళ్లిపోవడంతోనే అరుణాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిన్నది. ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్రంలో పూర్తిగా బలహీనంగా మారిపోయంది. తాజాగా మధ్యప్రదేశ్‌లోనూ ఇదే జరిగింది. కాంగ్రెస్ యువనేత జ్యోతిరాధిత్య సింథియా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరి రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే పనిలో ఉన్నారు. ఆయన తండ్రి మాధవరావు సింథియా కాంగ్రెస్‌లో చాలా కాలం పాటు నిబద్ధతగా పని చేశారు. రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు హయాంలో కేంద్రమంత్రిగా పని చేశారు. ఆయన కూడా ప్రమాదంలో మరణించారు. దీంతో జ్యోతిరాధిత్య సింథియా ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. మొదట్లో కాంగ్రెస్ ఆయనకు మంచి స్థానమే ఇచ్చింది. రెండుసార్లు కేంద్ర మంత్రిని చేసింది. దీంతో రాహుల్ గాంధీ టీమ్‌లో ఆయన కీలక వ్యక్తిగా మారారు. గత ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయానికి ఎక్కువగా కష్టపడిన నేతగా జ్యోతిరాధిత్య సింథియా నిలిచారు. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఆయననే ముఖ్యమంత్రిని చేస్తారని అంతా అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయనను పక్కనపెట్టి కమల్‌నాథ్‌ను ముఖ్యమంత్రిని చేసింది. దీంతో ఇప్పుడు ఆయన కాంగ్రెస్‌ను వీడి ఆ పార్టీ ప్రభుత్వాన్నే పడగొడుతున్నారు. ఇలా తండ్రులు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంత కష్టపడితే వారి కుమారులు మాత్రం కాంగ్రెస్ పతనానికి కారణమవుతున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం యువ నాయకత్వాన్ని గుర్తించకపోవడం, ఇంకా తాము పంపిన సీల్డ్ కవర్‌తోనే, తమ చెప్పు చేతల్లోనే రాజకీయాలు నడవాలని అనుకుంటుండటమే ఇందుకు ప్రధాన కారణం. యువ నేతలు ఈ తరహా అధిష్ఠానం పెత్తనాన్ని సహించక బయటకు వచ్చి కాంగ్రెస్‌ను నిండా ముంచేస్తున్నారు. అయితే, రాజస్థాన్‌లో రాజేష్ పైలట్, మహారాష్ట్రలో విలాస్‌రావు దేశ్‌ముఖ్ కుమారులు మాత్రం తండ్రుల బాటలో కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు.

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
an hour ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
2 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
2 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
4 hours ago

కేటీఆర్ కి అంత సీన్ లేదులే
6 hours ago

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!
6 hours ago

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ
21 hours ago

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!
20 hours ago

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!
21 hours ago

గత సావాసంతో టీఆర్ఎస్ కు కమ్యూనిస్టుల సపోర్ట్
20 hours ago
ఇంకా